భారీగా డ్రాప్ అయిన సాహో కలెక్షన్స్

68

‘బాహుబలి’గా ప్రపంచాన్ని గెలిచివచ్చిన ప్రభాస్ ఇప్పడు ‘సాహో’ అంటూ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. అయితే ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ముందు నుండి ఉన్న ప్రీ రిలీజ్ హైప్ వల్ల ఆ సినిమా మొదటి రోజు అసాధారణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అన్ని భాషలు, అన్ని స్క్రీన్స్ కలుపుకుని మొదటి రోజు ఏకంగా రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ టాక్‌తో ఆక్యుపెన్సీ తగ్గకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టడం గమనార్హం. ఇక రెండోసారి వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక తెలుగు హీరోగా ప్రభాస్ ఓ ఘనతను సొంతం చేసుకోనున్నారు.

Image result for sahoo

సినిమా వచ్చి ఐదు రోజులు అవుతున్నా కూడా వసూళ్లు వస్తూనే ఉన్నాయి. నాలుగు రోజుల్లోనే 350 కోట్ల మార్క్ ను దాటేసింది. అయితే ఐదవ రోజు వూహించనట్లుగానే బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం తో సహా అన్ని ఏరియాల్లో మంగళవారం కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 5వరోజు కేవలం 4,63,896 లక్షల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దానికితోడు ఇంతకుముందు అక్కడ 6 థియేటర్లలో ఈసినిమాను ప్రదర్శించగా ఇప్పుడు మూడు థియేటర్లకే పరిమితం అయ్యింది. ఇక నైజాం లో సాహో, మంగళవారం కోటి రూపాయల షేర్ తో 5రోజుల్లో 24కోట్ల షేర్ ను రాబట్టి బాహుబలి 1&2 తరువాత అల్ టైం గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక తమిళ , మలయాళ వెర్షన్ లు డిజాస్టర్ ఫలితాన్ని చవి చూడగా ఓవర్సీస్ లో కూడా అదే ఫలితాన్ని కొనసాగించింది.

ఈ క్రింద వీడియో చూడండి

కాగా హిందీ వెర్షన్ మాత్రం అక్కడి ప్రేక్షకులను బాగానే మెప్పిస్తూ అంచనాలకు మించి వసూళ్లను రాబడుతుంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 93 కోట్ల షేర్ ను రాబట్టగా మంగళవారం 8కోట్ల షేర్ తో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈచిత్రం అక్కడ మరో 15కోట్ల వరకు రాబట్టొచ్చు. అయితే నాలుగు రోజుల తర్వాత కూడా డబుల్ డిజిట్స్ ను సాధిస్తుంది. మాస్ సెంటర్లలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు వచ్చే కలెక్షన్లు కీలకంగా మారాయి. హిందీ వెర్షన్ 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ 50శాతం కలెక్షన్స్ తగ్గినా.. 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. టోటల్ గా ఇప్పటి వరకు కేవలం హిందీ వెర్షన్ లోనే 102 కోట్లు రాబట్టింది. అది కూడా 5 రోజుల్లోనే కావటం విశేషం. మరి సాహో కలెక్షన్స్ తగ్గడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.