బ్రేకింగ్ న్యూస్..సైరా లో మెగా డాటర్ నిహారిక..

543

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కధ ఆదారంగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక 151 వ సినిమా సైరా…ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది…చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్ తమనా వంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగా డాటర్ కొణిదల నిహారిక కూడా సైరా చిత్రంలో నటిస్తోన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సైరా చిత్రంలో మెగాస్టార్ పక్కన తాను కూడా నటించాలనే కోరిక మేరకు ఈ చిత్రంలో ఓ గిరిజన యువతిగా కనిపించనున్నట్లు తెలిపారు. కాకపొతే రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే ఆమె కనిపిస్తారట. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈచిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.