బిగ్ బాస్ శిల్పా చక్రవర్తి రియల్ స్టోరీ..

484

శిల్పా చక్రవర్తి..బుల్లితెర ప్రేక్షకులను పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ గా, నటిగా అందరికి పరిచయమే. తన మాటలతో షోను రక్తికట్టించడంలో ఆమెకు ఆమెసాటి. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు అద్భుతంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 తో మళ్ళి ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ శ్రీముఖి ఉండగానే మరొక యాంకర్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె లైఫ్ స్టోరీ మీద చిన్న స్టోరీ మీకోసం.

Image result for silpa chakravarthy
ఈ క్రింద వీడియో చూడండి

శిల్పా చక్రవర్తి 15 మే, 1985 లో పశ్చిమ బెంగాల్ లో జన్మించింది. స్వచ్ఛమైన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. సొంత రాష్టం బెంగాల్ అయినా పెరిగింది మాత్రం హైదరాబద్ లోనే. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఇక్కడే స్థిరపడడంతో శిల్ప బాల్యం అంతా హైదరాబాద్ లోనే సాగింది. తార్నాకలోని రైల్వే క్వాటర్స్ లో ఆమె బాల్యం గడిచింది. స్కూల్ ఎజుకేషన్, కాలేజీ అంతా హైదరాబాద్ లోనే సాగింది. MBA పూర్తీ చేసింది. ఇక చదువు కంప్లీట్ అయ్యాకా నటి అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చింది. సినిమా అవకాశాలు అయితే రాలేదు కానీ సీరియల్స్ అవకాశాలు వచ్చాయి. శిల్పా మొదటి సీరియల్ కంటే కూతుర్నే కనాలి. ఈ సీరియల్ ద్వారా రంగప్రవేశం చేసింది. ఇక తర్వాత వాక్ చాతుర్యం మంచిగా ఉండడంతో యాంకరింగ్ వైపు వెళ్ళింది. అక్కడ కూడా మంచి పేరే సంపాదించుకుంది. సరిగ్గా పదేళ్ల క్రితం యాంకర్ అంటే సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి వారు మాత్రమే ఉండేవారు..దాంతో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేది. యాంకర్ గా పలు షోలు చేసి మంచి యాంకర్ గా రాణించింది. సంతూర్ టాప్ 10, డాన్స్ బేబీ డాన్స్, భలే జోడి వంటి పాపులర్ షోలకు యాంకరింగ్ చేసింది. అదే సమయంలో సినిమాలలో ఛాన్స్ లు కూడా కొట్టేసింది.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే శిల్పా చక్రవర్తి ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు కూడా భరించింది. బెంగాలీ కుటుంబం కావడంతో తెలుగు అంతా మంచిగా వచ్చేది కాదు దాంతో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడింది. శిల్పా చిన్నప్పుడే కథక్ నేర్చుకుంది. ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చింది. మంచి కథక్ డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా ఆడియో ఫంక్షన్ లో శిల్పా కథక్ డాన్స్ కు జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది. స్టేజ్ మీద నుంచి మధ్యలోనే దింపేయడంతో అవమానంగా భావించి మళ్ళి ఎక్కడ కథక్ డాన్స్ చెయ్యలేదు. శిల్పా ఒక అట్లెటిక్ కూడా. లాంగ్ జంప్, మారథాన్ లలో పాల్గొంటుంది. అడ్వాటైజింగ్ వ్యాపారాన్ని చేస్తున్న కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కళ్యాణ్ వరంగల్ జిల్లాకు చెందినవాడు. కళ్యాణ్ ముందు ఒక ఇంగ్లీష్ పేపర్ కు జర్నలిస్ట్ గా పనిచేసేవాడు. ఒకేసారి ఇంటర్యూ చెయ్యడానికి వచ్చిన కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టిన తర్వాత ఇండస్ట్రీని వదిలేసింది. ఇప్పుడిప్పుడే మళ్ళి ఛాన్స్ ల కోసం ట్రై చేస్తుంది. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆమె బిగ్ బాస్ టైటిల్ సాధించాలని, అలాగే సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా ఛాన్స్ లు అందుకుని మళ్ళి రాణించాలని మనసారా కోరుకుందాం.