బిగ్ బాస్ అలీరెజా ఇంట విషాదం కాని కుటుంబం దాచిపెట్టింది

311

బిగ్ బాస్ 3 తెలుగు సీజన్‌లో ఈ వారం అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా బయటకు వస్తుంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ తీవ్రంగా ఏడ్చేశారు. అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా ఎలిమినేట్ కావడం అనేది అందర్నీ షాక్‌కి గురి చేసింది. లోపల ఉన్న కంటెస్టెంట్స్‌కే కాదు. బయట ఉన్న బిగ్ బాస్ ప్రేక్షకులు, అలీ రెజా అభిమానులను మరింత షాక్‌లోకి నెట్టేసింది. దీంతో నెటిజన్లు బిగ్ బాస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇలా బాగా ఆడే వారిని అందర్నీ ఎలిమినేట్ చేసుకుంటూ పోతే.. తర్వాత ఎవరు చూస్తారంటూ ఒకరు ట్వీట్ చేస్తే.. రేపటి నుంచి బిగ్ బాస్ చూడడం మానేస్తున్నామని మరికొందరు ట్వీట్ చేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

విచిత్రం ఏంటంటే. మొదటి సారి ఎలిమినేట్ రౌండ్ లోకి రావడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం ఒక్కసారే జరిగిపోయింది. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఇంటి సభ్యులు ఎంతో ఎమోషన్ కి లోనయ్యారు. సొంత మనిషి తమ నుంచి విడిపోతున్నంత బాధతో కన్నీరు మున్నీరు అయ్యారు. వారి ఆప్యాయతకు దూరమైన అలీ ఎంతో బాధతో ఇంటికి పయనమయ్యాడు కానీ ఇంటికి వెళ్లిన తర్వాత మరో భయంకరమైన విషయాన్ని విని షాక్ తిన్నాడు. తాను బిగ్ బాస్ లో పాల్గొంటున్న సమయంలోనే తన మావయ్య చనిపోయాడని ఇంటికి వెళ్ళాక తెలిసిందని అలీ రెజా భావోద్వేగానికి గురయ్యాడు. అయితే బిగ్ బాస్ లో తాను గట్టి పోటీతో ఉండటం ఇలాంటి సమయంలో ఇలాంటి న్యూస్ వింటే నా మనోధైర్యాన్ని కోల్పోతానని ఇంటి సభ్యులు భావించారట.

Image result for ali reza

ఈ వార్త నాకు తెలిస్తే నేను బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పై ఫోకస్ చేయలేనని మా తల్లిదండ్రులకు తెలుసు. అదే సమయంలో నా ఫ్యామిలీ కూడా నాకు చాలా ముఖ్యం అందుకే ఇంత పెద్ద విషాదాన్ని నాకు తెలియకుండా దాచారు. ఎలిమినట్ అయి షాక్ లో ఇంటికి వెళ్లిన నాకు ఈ వార్త మరింత బాధ కలిగించింది. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా “లవ్ యు ఫరెవర్” మావయ్య అని అలీ రెజా తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు… ఇది చూసిన ఆయన అభిమానులు కూడా అదే అన్నారు, మీ కుటుంబ సభ్యులు నీ ఆట మీద నువ్వు ఫోకస్ చేయాలి అని ఈ విషయం దాచారు, కాని ఆయన చివరి చూపు నోచుకోలేకపోయావు అని బాధపడ్డారు. ఇది నిజంగా అలీ రెజాకు చాలా బాధకారమైన సమయం అనే చెప్పాలి.