బన్నీ కొత్త సినిమా “సభకు నమస్కారం”

548

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అల్లు అర్జున్ కొంచెం అప్ సెట్ అయి ఉన్నాడు…ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడని సమాచారం..మనం ఫేం విక్రం కుమార్ ఒక కధ చెప్పినప్పటికీ ప్రయోగాలకు పోకూడదనే ఉద్దేశ్యంతో ఇంకా ఫైనల్ చేయనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. రంగస్థలం మూవీలో రాంచరణ్ పోషించిన ఊర మాస్ పాత్ర తరహాలో ఓ సినిమా చేయాలని బన్నీ ఎదురుచూస్తున్నట్టు తాజా సమాచారం.

తాజాగా టాలివుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఒక కధను బన్నీకి వినిపించినట్టు సమాచారం.. ఈ ఫుల్ మాస్ కథ బన్నీకి నచ్చిందని.. దీనికి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ కూడా ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అయితే దిల్ రాజు ఈ సబ్జెక్ట్ ను తొలుత నాని హీరోగా తెరకెక్కిద్దామని అనుకున్నాడట.. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. ఇదే కథను అల్లు అర్జున్ లాంటి ఫుల్ జోష్ హీరోతో తీస్తే ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుందని బన్నీకి వినిపించాడట.. చిన్న హీరోలతో సినిమాలు తీసి ప్రమోషన్ చేయడం కష్టమని ఈ మధ్యే దిల్ రాజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అందుకే నాని కంటే బన్నీ బెటర్ అని ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది.

అయితే ఈ ‘సభకు నమస్కారం’ కథను తీసేందుకు ఇంకా డైరెక్టర్ ఫైనల్ కానట్టు సమాచారం. దిల్ రాజు-బన్నీ కలిసి కొందరు దర్శకుల పేర్లను చర్చించినా ఇంకా కన్ఫం చేయలేదట.. అందుకే బన్నీ ‘గీతాగోవిందం’ ఆడియోలో తన సినిమా ప్రకటనకు ఇంకొంచెం టైం పడుతుందని వ్యాఖ్యానించాడు. దర్శకుడు కన్ఫం అయ్యాక బన్నీ -దిల్ రాజులు ఈ సినిమా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఈ కథతో ఖచ్చితంగా హిట్ కొట్టి మళ్లీ తన మేనియా నిరూపించుకోవాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడట.. మరి బన్నీ కల నెరవేరుతుందో లేదో చూద్దాం మరి..