ప్రభాస్ సాహో ఫస్ట్ డే కలెక్షన్స్ : బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్…

59

‘సాహో’.. గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. కనీవినీ ఎరగని రీతిలో అడ్వాన్స్ బుకింగులు, ప్రీమియర్ షోలు.. మొత్తంగా సినీ ప్రపంచం ‘సాహో’ మేనియాతో నిండిపోయింది. రెండేళ్లుగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులను ఊరిస్తోన్న ‘సాహో’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మరి మొదటిరోజు కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందామా.

Image result for prabhas

సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10500 స్క్రీన్లలో విడుదలైంది. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లలో, యూకేలో 300, యూరప్‌లో 500, యూఏఈలో 350, దక్షిణాసియాలో 100, ఇండియాలో 7500, ఇతర ప్రాంతాల్లో 900 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు 35 వేల షోలు ప్రదర్శించారు.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సాహో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండడంతో థియేటర్స్ నుంచి రివ్యూలు చెప్తున్నారు. సినిమా ఒక షో అయిపోయిన తర్వాత రివ్యూలు వస్తాయి. కానీ సాహో విడుదల అయినా అర్ధగంటకే రివ్యూ బయటకు వచ్చేసింది. దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమాలో కంటెంట్ ఎలాంటిదో.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే యూఎస్ లలో కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ డే రోజు కలక్షన్స్ లలో దుమ్ములేపింది. తొలిరోజు 153 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి భారతీయ చిత్ర పరిశ్రమను షాక్ కు గురిచేసింది. అప్పట్లో బాహుబలి 2 తొలిరోజు 122 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తే అదే పెద్ద రికార్డ్ అనుకున్నారు. ఇప్పుడు దానిని బీట్ చేసి సాహో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తొలిరోజే 85 కోట్ల డిస్టిబ్యూటర్ షేర్ ను రాబట్టింది. యూఎస్ ప్రీమియర్ ద్వారా 31 కోట్లు కొల్లగొట్టిన చిత్రం ఓవర్సీస్ ఇండియా కలుపుకుని మరొక 118 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటిరోజు ఇలా ఉంటె వీకెండ్ కంప్లీట్ అయ్యేంతవరకు ఇంకెంత కలెక్ట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.350 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 2000 కోట్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ స్టామినా ఉండడంతో అదేమీ పెద్ద అసాధ్యం కాదని అంటున్నారు. మరి సాహో సినిమా గురించి అలాగే మొదటిరోజు కలెక్షన్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.