ప్రభాస్ సాహో ఐదవ రోజు కలెక్షన్స్ :

111

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగతి తెలిసిందే.. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సినిమా కావ‌డంతో క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో ఈ సినిమాపై అంచ‌నాలు ఉన్నాయి. సినిమాపై జాతీయ స్థాయిలో మంచి హైప్ ఉంది. సాహో ఫీవ‌ర్‌తో దేశం అంతా ఊగిపోయింది. అయితే అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ సాహోకు బ్యాడ్ టాక్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు సుజిత్ క‌థ‌నం న‌డిపించ‌డంలో పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. సినిమాపై ఉన్న హైప్‌తో పోలిస్తే అంచ‌నాలు అందుకోవ‌డంలో కాస్త త‌డ‌బ‌డింది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. భారీ హైప్‌, సోలో రిలీజ్‌, ప్ర‌మోష‌న్లు తొలి రోజు నుంచే భారీ వ‌సూళ్లు తెచ్చిపెట్టాయి.

Image result for sahoo

సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10500 స్క్రీన్లలో విడుదలైంది. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లలో, యూకేలో 300, యూరప్‌లో 500, యూఏఈలో 350, దక్షిణాసియాలో 100, ఇండియాలో 7500, ఇతర ప్రాంతాల్లో 900 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు 35 వేల షోలు ప్రదర్శిస్తే తర్వాత రోజు నుంచి కొన్ని షోలను తగ్గించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘సాహో’ తొలి నాలుగురోజులు రూ.108 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇదే కలెక్షన్స్ ను ఐదవ రోజు కూడా కొనసాగించింది. ఐదవ రోజు 20 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.. ముంబై బాక్సాఫీస్ వద్ద మొదటి నాలుగురోజులు రూ.75 కోట్ల గ్రాస్ వసులు చేస్తే ఐదవ రోజు 10 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో మొదటి నాలుగు రోజులు రూ.29 కోట్లు వస్తే ఐదవ రోజు 3 కోట్లు రాబట్టినట్లు సమాచారం. మలయాళ వెర్షన్‌ లో మొదటి నాలుగు రోజులు 25 కోట్లు కలెక్ట్ చేస్తే ఐదవ రోజు 3 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక మొత్తం కలెక్షన్స్ విషయానికి వస్తే… యూఎస్ లో మొదటి నాలుగు రోజులు 86 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం, ఐదవ రోజు 10 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో మొదటి నాలుగురోజులు కలిపి 300 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రభాస్ క్రేజ్ తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేయగా.. ఐదవ రోజు కలెక్షన్స్‌తో ఇప్పుడు 450 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనంగా మారింది. అది అలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ ఇప్పటికే 75 కోట్లు దాటిపోయినట్లు తెలుస్తోంది. 350 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 500 కోట్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఎంత కలెక్ట్ చేస్తుందో. మరి సాహో సినిమా గురించి అలాగే నాలుగు రోజుల కలెక్షన్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.