పెళ్ళైతే గానీ ఈ సమస్య పోదు.. ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా: ప్రభాస్

66

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది.. రెబల్ స్టార్ ప్రభాస్ పేరే.. పెదనాన్న నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తనదైన శైలి నటనతో రాణిస్తున్నాడు. దేశం గర్వించదగిన సినిమా ‘బాహుబలి’లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత తాను పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ వెల్లడించాడు. దాంతో పెళ్లి కూతురు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉందని కొన్ని రోజులు, వైజాగ్ అమ్మాయని కొన్ని రోజులు ఇలా వార్తలు హల్చల్ చేశాయి. గతంలో ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్లు, వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను ఇటు ప్రభాస్, అటు అనుష్క ఎన్నిసార్లు ఖండించినా ఫలితం ఉండటం లేదు. దీంతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ ఆసక్తికరంగా స్పందించారు ప్రభాస్. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

ఈ క్రింద వీడియో చూడండి

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన కొత్త సినిమా ‘సాహో’ ప్రమోషన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల చిత్ర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ప్రభాస్‌కి మళ్ళీ అనుష్కతో రిలేషన్‌ షిప్‌కి సంబందించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. మీరు.. అనుష్క డేటింగ్ చేస్తున్నారంట కదా అని ఒకరంటే.. ప్రభాస్ – అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంట కదా అని మరొకరు అంటున్నారు. అంతేకాదు, గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న అంశాలు అని ‘అనుష్క – ప్రభాస్ మ్యారేజ్’ అని కూడా ప్రస్తావిస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఉదంతమే ఎదురుకావడంతో కాస్త చిరాకు పడ్డారు ప్రభాస్.

Image result for prabhas anushka

ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. అన్ని సార్లూ నేను సమాధానం చెప్పాను. మళ్లీ చెబుతున్నాను.. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అనుష్క నేను ప్రేమలో ఉన్నామని మీరు అంటున్నదే నిజమైతే గత రెండేళ్లుగా మేం ఎక్కడైనా కలిసి కనిపించామా? మేమన్నా ఇంట్లో దాక్కున్నామా? అని చెబుతూ.. అంతెందుకు అనుష్కను కలిసి రెండేళ్లు అయిపోయింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు. ఇక ఇలాంటి రూమర్స్‌కి తెరపడాలంటే.. ముందు అనుష్కనో లేక నేనో పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పటిదాకా ఈ సమస్య పోయేలా అనిపించడం లేదు. ఈసారి అనుష్క కలిసినప్పుడు త్వరగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని డైరెక్ట్‌గా చెప్పేస్తా.. అప్పుడైతే గానీ మీరు ఈ ప్రశ్నలు ఆపేలా లేరు అన్నారు ప్రభాస్. ఇలా ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఇకనైనా ఈ రూమర్స్ కు అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి. మరి అనుష్కతో ప్రేమ వ్యవహారం మీద ప్రభాస్ చెప్పిన సమాధానం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.