పవన్ కల్యాణ్ అభిమానులను తరిమి కొట్టి.. బర్త్ డే కేక్ ను కాలితో తొక్కి : క్షమాపణ చెప్పిన డైరెక్టర్

190

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు ఘోర అవమానం ఎదురైంది.. తాడేపల్లి గూడెం శశి విద్యాసంస్థల ఎదురుగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తుండగా, ఆ విద్యాసంస్థల డైరెక్టర్ నరేంద్ర మేకా వారిని అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులను చెదరగొట్టారు. పోలీసుల సహకారంతో వారిని తరిమి కొట్టారు. అభిమానులు చందాలు వేసి తెచ్చుకున్న 25 కేజీల కేక్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు శశి విద్యాసంస్థల యాజమాన్యానికి వ్యతిరేకంగా రోడ్డు మీద బైఠాయించారు. నినాదాలు చేశారు. దీనితో నరేంద్ర మేకా క్షమాపణలు చెప్పారు. దీనికి దారి తీసిన పరిస్థితులపై ఆయన వివరణ ఇచ్చారు.

25 కేజీల కేక్ నేలపాలు

సోమవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు. శని, ఆది, సోమ మంగళవారాల్లో వరుస సెలవులు రావడంతో శశి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కాలేజీ హాస్టల్ లో నివసిస్తున్న తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వచ్చారు.. అదే సమయంలో మా విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ స్థానిక జనసేన పార్టీ నాయకులతో కలిసి శశి కళాశాల ఎదురుగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం వారు 25 కేజీల కేక్ ను తీసుకొచ్చారు. పుట్టినరోజు సెలెబ్రేషన్స్ చేసుకుని అభిమానులు, కార్యకర్తలు సుమారు వందమందికి పైగా కాలేజ్ మెయిన్ గేటు వద్దకు వచ్చారు.. పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినాదించారు. అరుపులు, కేకలతో మారుమోగించారు. దీన్ని గమనించిన విద్యాసంస్థల డైరెక్టర్ నరేంద్ర సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ ఫాన్స్ వెళ్లిపోవాలని సూచించారు. వారు దీనికి నిరాకరించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కేక్ ను కట్ చేసి తీరుతామని, ఆ తరువాత వెళ్లిపోతామని కోరారు. దీనికి నరేంద్ర అంగీకరించలేదు. దాంతో కోపం వచ్చి జ్=కాలేజీ స్టాఫ్ తో వారిని చెదరగొట్టారు. దీనితో అభిమానులు తాము తెచ్చుకున్న కేక్ ను అక్కడే వదిలేసి, వెళ్లిపోయారు. ఈ కేక్ ను నరేంద్ర.తీసుకుని కిందికి పడేశారు. కాలితో తొక్కారు. అదే సమయంలో కాలేజీ యాజమాన్యం పోలీసులను కూడా పిలవడంతో గొడవ మరింత ముదిరింది. కేక్ కట్ చేయడానికి వీలు లేదని పోలీసులు చెప్పారు. అనుమతి లేకున్నా ఎలా కట్ చేస్తారంటూ నిలదీశారు. తమతో వాదించిన కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు, విద్యార్థులకు అండగా నిలిచారు. కాలేజీ వద్ద నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించారు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్‌ చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. వందమందికి పైగా విద్యార్థులు, జనసేన పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన పెద్దగా అవ్వడంతో శశి విద్యాసంస్థల యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. డైరెక్టర్ నరేంద్ర తాను పవన్ కల్యాణ్ కు వ్యతిరేకిని కాదని వివరణ ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు భావాలకు తాను విరోధిని కాదని అన్నారు. ఆయన బర్త్ డే వేడుకలలో విద్యార్ధులే కాకుండా బయట వారు వచ్చారని, వారిని వెళ్లగొట్టడానికి తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పారు. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చినందు వల్ల హాస్టల్ లో ఉంటోన్న ఆడపిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారని, అలాంటి సమయంలో బయటి వ్యక్తులు క్యాంపస్ వద్ద హడావుడి చేయడం వల్ల కళాశాల కి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఆ భావన తోనే నేను అలా ప్రవర్తించా అని పేర్కొన్నారు. చేసిన పనికి తాను పశ్చాత్తాప పడుతున్నానని అన్నారు. చూడాలి మరి ఫాన్స్ ఇప్పటికైనా చల్లబడతారో లేదో. మరి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు జరిగిన ఈ అవమానం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.