జయలలిత పాత్రలో ఆ ప్రముఖ హీరోయిన్…!

511

మహానటి ఘన విజయం సాదించడంతో ఇప్పుడు సినీ వర్గాల దృష్టి బయోపిక్ లపై పడింది…తెలుగులో ఎన్టీఆర్, వైస్సార్ బయోపిక్ లు రెడీ అవుతున్నాయి..ఎన్టీఆర్ తరహాలోనే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించి తమిళనాడు ముఖ్యమంత్రి తన హవా కొనసాగించిన జయలలిత జీవిత కధ తో సినిమా రాబోతున్నట్టు గత కొంత కాలంగా ప్రచారం సాగుతోంది..ఐతే ఈ పాత్ర ఎవరు చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. కీర్తి సురేష్.. త్రిష లాంటి వాళ్ల పేర్లు తెరమీదికి వచ్చాయి. ఐతే కీర్తి తనకు ఆ ఉద్దేశం లేదని తేల్చేయగా.. త్రిష మాత్రం తాను జయలలిత పాత్ర చేయానికి సిద్ధమని ప్రకటించింది…

తనకు జయలలిత అంటే చాలా ఇష్టమని.. అందుకోసమే ఈ సినిమా చేయాలనుకుంటున్నానని.. మరే ఉద్దేశాలు లేవని ఆమె అంది. తాను పదేళ్ల వయసులో స్కూల్లో చదువుకుంటుండగా.. జయలలిత తన పాఠశాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చారని.. అప్పట్నుంచి ఆమె అంటే ఇష్టమని త్రిష చెప్పింది. జయలలితపై ఇష్టంతోనే తాను తన ట్విట్టర్ ప్రొఫైల్ పేజీలో జయలలిత నుంచి అవార్డు తీసుకుంటున్న ఫొటో పెట్టినట్లు త్రిష వెల్లడించింది.జయలలిత మరణం తీరని లోటని.. ఆమెకు ఆమే సాటి అని త్రిష చెప్పింది. ఆమె బయోపిక్ తీస్తే చేయడానికి తాను సిద్ధమని.. కానీ తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని.. కేవలం జయలలితపై ఉన్న ఆరాధనభావంతోనే ఈ సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పిందామె.