జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్స్ లీక్.. తెలిస్తే షాక్

985

రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై వచ్చే జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఒక్క షోతో వంద‌ల మంది న‌టులు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ప‌దుల సంఖ్య‌లో క‌మెడియ‌న్లు అవకాశాలు అందుకున్నారు.. ఎంతోమంది జీవితాలు ఈ ఒక్క షోతో మారిపోయాయి. వారానికి రెండు రోజులు అన్నీ మ‌రిచిపోయి ప్రేక్ష‌కుల‌ను హాయిగా న‌వ్విస్తుంది ఈ షో. ఇక ఈ కార్య‌క్ర‌మంతో క‌మెడియ‌న్లు కూడా జీవితంలో సెటిల్ అయిపోయారు. టీవీ షోనే క‌దా అని త‌క్కువ‌గా అంచ‌నా వేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే సినిమాల్లో కూడా ఇంత సంపాదన వ‌స్తుందో రాదో తెలియ‌దు, కానీ ఇప్పుడు ఇందులో ఉన్న న‌టులు మాత్రం ఓ రేంజ్ లో సంపాదిస్తున్నారు. అసలు వారి సంపాదన సినిమాల్లో నటించినా కూడా అంత రాదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. మరి జబర్దస్త్ వల్లే వారికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి అని నిస్సందేహంగా చెబుతారు. సో కామెడికి కేరాఫ్ అడ్రస్ అయిపోయిన షో జబర్దస్త్ , కొత్తవారికి అవకాశాలు ఇస్తూ పాతవారు సినిమాల్లో సెటిల్ అవుతున్నారు.

Related image

ఇక సినిమా వాళ్ళు, యాంకర్లు రెమ్యునరేషన్ గురించి అభిమానుల్లో ఎల్లప్పుడూ ఆసక్తికరంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారి పారితోషిక వివరాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి. ఎంత గోప్యంగా ఉంచుదాం అని చూసినా.. ఏదో ఓ రకంగా లీక్ అవుతూనే ఉంటాయి, ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో’లో కంటెస్టెంట్ల దగ్గర నుంచి జడ్జీల వరకు ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు తాజాగా ఆ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాతో పాటు కమెడియన్ల రెమ్యునరేషన్‌ వివరాలు లీక్ అయ్యాయి.

Related image

ఓ వైపు జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాటు బ‌య‌ట కూడా కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు వాళ్లు. ఇక ఇప్పుడు ఒక్కొక్క‌రు ఎంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటారో ఒక్క‌సారి చూద్దాం.. ముందు జ‌డ్జుల నుంచి మొద‌లుపెడితే ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు 2 ల‌క్ష‌లు తీసుకుంటుంది రోజా. నెల‌కు 8 ఎపిసోడ్లు ఉంటాయి కాబ‌ట్టి అక్ష‌రాలా 16 ల‌క్షల వ‌ర‌కు రోజాకు అందుతున్నాయ‌ని తెలుస్తుంది. ఇక నాగ‌బాబు కూడా 20 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఇప్పుడు రోజా రాజకీయాల్లో మరింత బిజీ అవడంతో ఆమెకు ఆఫర్ మరింత పెంచారట.. ఆమెకు కూడా నెలకు 20 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. అటు యాంకర్లగా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మిలకు నెలకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇస్తారని సమాచారం.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువగా నెలకు 4 లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, అదిరే అభి రూ. 3 లక్షలు, రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు, హైపర్ ఆది రూ. 3 లక్షలు అందుకుంటుండగా.. గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు చెరో 2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు. ఇకపోతే బులెట్ భాస్కర్‌కు 2 లక్షలు, ఇతర కామెడియన్లకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా వీరికి నెల నెల రెమ్యునరేషన్ గా ఇస్తోందట నిర్మాణ సంస్ద. మొత్తానికి వీరు సినిమాల్లో నటించినా ఇంత పెద్ద ఎత్తున పారితోషకాలు రావని బుల్లితెర లో నటిస్తూ సినిమాలు చేయడం బెటర్ అని చెబుతున్నారు చాలా మంది ఆర్టిస్టులు, మరి చూశారుగా జబర్దస్త్ లీడర్స్ యాంకర్స్ జడ్జీలు అందుకుంటున్న రెమ్యునరేషన్లు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.