జబర్దస్త్ద్ టీమ్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన రోజా షాక్ లో నాగబాబు

986

రోజా తెలుగు సినీ ప్రజలకు సుపరిచితురాలు…సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన పేరు ఈమె పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు జబర్ధస్త్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నిరంతరం టచ్‌లో ఉండే ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పార్టీలకతీతంగా రోజాను అభిమానించే వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే. అందుకే ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో రోజా.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం..? వివరాల్లోకి వెళితే.. రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రోజా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె త్వరలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నదే ఆ వార్త సారాంశం.

టాలీవుడ్‌లోని ఓ టాప్ హీరో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర కోసం రోజాను చిత్ర యూనిట్ సంప్రదించిందని తెలుస్తోంది. దీనికి ఆమె కూడా ఓకే చెప్పేశారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి జబర్ధస్త్ అభిమానులు ఫీలైపోతున్నారు. దీనికి కారణం ఆమె ఆ షోలో కనిపించరేమోనన్న బాధే. వాస్తవానికి జబర్ధస్త్ సక్సెస్ వెనుక నాగబాబు, రోజాల పాత్ర కూడా ఉంది. అందుకే వీళ్లిద్దరిని వదులుకోవడంలేదు సదరు షో నిర్వహకులు. రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో గ్యాప్ తీసుకున్నట్లు సినిమా చేస్తే షో నుంచి తప్పుకుంటారేమోనని రోజా అభిమానులు ఫీలైపోతున్నారని టాక్.