క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని.. అండగా నిలిచిన పవన్ కళ్యాణ్

59

అభిమానులు మా హీరో చాలా గొప్పోడు అని కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సాయం చేసేందుకు ముందుండే వ్యక్తులలో జనసేన అధ్యక్షలు పవన్ కళ్యాణ్ ఒకరు. పాలు సామాజిక కార్యక్రమాలలో తనవంతు బాధ్యత నిర్వర్తిస్తుంటాడు పవన్ కళ్యాణ్.. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎందరో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసిన ఘటనలను మనం చూశాం. లేటెస్ట్ గా క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని పరామర్శించాడు.

Image result for pawan kalayan

క్యాన్సర్ వ్యాధితో బాధప‌డుతున్న త‌న అభిమాని, జనసేన కార్యకర్త పాత‌కూటి బుడిగ‌య్య‌ను జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రామ‌ర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో బుడిగయ్య, ఆయన కుటుంబం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిపై కుటుంబ స‌భ్యుల‌ను ఆరా తీశారు. వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్ధిక స‌హాయం అందించారు. త‌న అభిమాని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వ‌తుండిని ప్రార్ధిస్తూ వినాయ‌కుడి విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. దేవుడు బుడిగ‌య్య‌కు మంచి చేయాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌కాశం జిల్లా త్రిపురాంతకం మండ‌లం, అన్న‌స‌ముద్రం గ్రామానికి చెందిన బుడిగ‌య్య పవర్ స్టార్‌కి వీరాభిమాని. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. కీమో థెర‌పీ తీసుకుంటూ కూడా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో కొంత‌కాలంగా మంచానికే ప‌రిమితం అయ్యాడు.

ఈ క్రింద వీడియో చూడండి

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను చూడాల‌న్న త‌న కోరిక‌ను స్థానిక జ‌న‌సేన నాయ‌కుల‌కు తెలిపాడు. దీంతో ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకు వచ్చారు. బుడిగయ్యను పరామర్శించేందుకు అన్నసముద్రం వస్తానని చెప్పారు. ఈలోగా అత‌న్ని అంబులెన్స్‌లో హైదరాబాద్ ప్ర‌శాస‌న్‌న‌గ‌ర్‌లో జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు. వ్యాధి ఎంత కాలం నుంచి ఉంది? చికిత్స ఎక్క‌డ చేయిస్తున్నారు అన్న విష‌యాల‌ను అత‌ని భార్య‌ను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో ఎన్‌.ఆర్‌.ఐ ఆసుప‌త్రి వైద్యుల‌తో తాను స్వ‌యంగా మాట్లాడుతాన‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూడాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన డా.గౌతమ్ కు సూచించారు. పార్టీ అధినేత… అభిమాన హీరో తనను కలవడంతో బుడిగయ్య ఆనందం వ్యక్తంచేశాడు.