ఒక సాహో… 10 తప్పులు

55

బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సాహో’. ఈ చిత్రం ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించింది. యువి క్రియేషన్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంతలా జనాలను ఆకట్టుకోలేకపోయింది. సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సాహో మేకర్స్ చేసిన కొన్ని తప్పుల వలన సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.. మరి సాహో టీమ్ చేసిన ఆ తప్పులు ఏంటో చూద్దామా.

Image result for sahoo
  1. బాహుబలి ఇమేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం.. బాహుబలి కంటే ముందు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయినా ప్రభాస్ ఇమేజ్ బాహుబలి తర్వాత హోల్ ఇండియాకు పాకిపోయింది. 60 కోట్ల హీరోగా ఉన్న ప్రభాస్ ఏకంగా 2000 కోట్ల హీరోగా మారిపోయాడు. అయితే ఈ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ఇమేజ్ ను ఇంకా హై రేంజ్ కు తీసుకెళ్లాలని నిర్మాతలు అనుకుని చాలా ఎక్కువగా ఖర్చు చేశారు. కథలో బలం లేకపోయినా కేవలం ప్రభాస్ కోసమే ఖర్చు చేశారు. ఇదే మొదటి తప్పు.
  2. కొత్త దర్శకుడు అయినా సుజిత్ కు బాహుబలి ప్రభాస్ ను డీల్ చేసే ఛాన్స్ ఇవ్వడం. ఒక చిన్న దర్శకుడు అయినా సుజిత్ ను నమ్మి ఇంత బడ్జెట్ ఎలా పెట్టారో అర్థం కాదు. అంతకముందు కేవలం రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమాను తీశాడు. అది ఒక రివెంజ్ కామెడీ సినిమా. పైగా పెద్ద హీరో కాదు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమా తీసాడు. ప్రభాస్ బాహుబలి తరువాత పెద్ద డైరెక్టర్ తో లేదా బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా తీసి ఉంటె పరిస్థితి ఇలా ఉండేది కాదు.
Image result for sahoo
  1. సినిమా నిర్మాతలే సినిమాకు మైనస్. సుజిత్ లాంటి చిన్న సినిమా డైరెక్టర్ కు ఒక పెద్ద డైరెక్టర్ సహాయం అందించేలా ఏర్పాట్లు చేసి ఉంటె ఫలితం మరోలా ఉండేది. కథ ఎలా ఉన్నా కథనం బాగున్నా కూడా మంచి హిట్ సాధించేది. కథనం బాగుండాలి అంటే మంచి అనుభవం ఉండాలి కానీ ఆ అనుభవం సుజిత్ కు లేదు. అనుభవం లేని డైరెక్టర్ కు ఇంత డబ్బు ఖర్చు చెయ్యడమే నిర్మాతల తప్పు.
  2. ఇక సాహో టీమ్ చేసిన మరొక తప్పు. కథనంలో అవసరం లేకపోయినా స్టార్ క్యాస్ట్ ను తీసుకోవడం. ముఖ్యంగా విలన్ గ్యాంగ్ భారీగా పెరిగిపోవడం. కేవలం హీరోను ఎలివేట్ చెయ్యడానికి బడ్జెట్ పెంచుకుంటూపోయాను కానీ అవుట్ ఫుట్ క్వాలిటీగా ఎలా తీసుకురావాలి అని ఆలోచించలేకపోయారు. యాక్షన్ ను పట్టుకున్నారు కానీ ఎమోషన్ ను పట్టుకోలేదు. ఇదే సినిమాకు పెద్ద మైనస్.
Image result for sahoo
  1. డైరెక్టర్ గా అనుభవం లేకపోవడం.. సుజిత్ ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయలేదు. కేవలం ఒక షార్ట్ ఫిలిం తీసి సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. రన్ రాజా రన్ అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. కానీ సాహో లాంటి పెద్ద బడ్జెట్ సినిమా తీయాలంటే చాలా తెలిసుండాలి. అలా తెలియాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ గ పనిచేయాలి. కానీ సూజిత్ ఎవరి దగ్గర పనిచేయలేదు. ఇది కూడా ఒక మైనస్.
  2. సాహో టీమ్ చేసిన మరొక తప్పిదం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఉపయోగించడం. సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కేవలం ఇండియన్ టెక్నీషియన్స్ నే వాడుకోవాలి అనుకున్నారు కానీ బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ పెరగడంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకొచ్చారు. దీంతో వారిని డీల్ చెయ్యలేకపోయాడు సుజిత్. వారిని కరెక్ట్ గా వాడుకోవడంలో సుజిత్ తడబడ్డాడు.
Image result for sahoo
  1. ఇక సినిమాకు మరొక మైనస్ మ్యూజిక్. సినిమాకు మ్యూజిక్ అంతా క్యాచీగా లేదు. హాలీవుడ్ రేంజ్ మూవీ అని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టారు. ఒకటి రెండు సాంగ్స్ తప్ప మిగతావి ఆడియన్స్ ను టచ్ చేయలేకపోయాయి.
  2. ఈ సినిమాకు మరొక పెద్ద మైనస్ రాజమౌళి. బాహుబలితో ప్రభాస్ కు స్టార్ హోదా తీసుకొచ్చాడు రాజమౌళి. దానిని కంటిన్యు చెయ్యడానికే సాహో టీమ్ ఇంత ఖర్చు పెట్టింది. లేకుంటే ఈ సినిమాకు ఇంతలా ఖర్చు అయ్యేది కాదు. అలాగే రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరోకు ఆ తర్వాత ఒక ప్లాప్ సినిమా ఖచ్చితంగా వస్తుంది. ఎన్టీఆర్ నుంచి మొన్న నాని వరకు అందరు హీరోలు తర్వాత సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇది అనాదిగా వస్తున్నా ఆచారం. ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది.

ఈ క్రింద వీడియో చూడండి

  1. సాహో టీమ్ చేసిన మరొక తప్పిదం అవసరం లేకపోయినా బడ్జెట్ ను పెంచుకుంటూపోవడం. కథ, కథనం, మ్యూజిక్, ఇతర అంశాల మీద ఫోకస్ చేసి ఉంటె ఇంకా బెటర్ గా ఉండేది. సాహోను అందరు బాహుబలితో పోల్చారు. ఇదే పెద్ద మైనస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా తీస్తాడని ఇండియన్ సినీ అభిమానులు అనుకున్నారు. ఆ రేంజ్ కథ కాకపోయినా అందులో 50 శాతం కథ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ సాహో లో అలాంటి కథనే లేదు. ఇది కూడా ఒక మైనస్.
  2. సాహో కథ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసిని పోలి ఉండటం. ఒక ఫ్రెంచ్ సినిమాకు కాపీగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ను కొంచెం చేంజ్ చేసి ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అజ్ఞాతవాసి లాంటి ప్లాప్ సినిమాను కాపీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన వినిపిస్తుంది. సాహో కథ అజ్ఞాతవాసి కథకు దగ్గరగా ఉందని పసిగట్టి ఉంటె ఇంత డ్యామేజ్ జరిగేది కాదని సగటు అభిమాని ఆవేదన.