ఒక కన్ను చూపు పోయింది.. నరకం అనుభవిస్తున్నా : జబర్దస్త్ వినోద్

78

జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తి కొనుగోలు విషయమై జరిగిన జరిగిన గొడవ కారణంగా ఈయనపై దాడి జగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకొని కాస్త కోలుకున్న వినోద్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వెలిబుచ్చాడు. అతను చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for జబర్దస్త్ వినోద్ జ

కాచిగూడలోని కుత్బిగూడాలో ఇంటి ఓనర్, కొందరు దుండగులు కలిసి చేసిన దాడిలో వినోద్ త్రీవంగా గాయపడ్డారు. తలపై, ముఖంపై బలమైన గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్న వినోద్ ప్రస్తుతం కోలుకొని తనపై జరిగిన దాడి, దాని పర్యవసనాల తాలూకు వివరాలు తెలిపాడు. దాడి జరిగిన ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదని చెబుతూ తీవ్ర ఆవేదన చెందాడు వినోద్. తాను లేడీ గెటప్పులో రాణించడానికి ముఖ్య కారణం తన కళ్లే అని, ఆ కళ్లలో ఒకటి చిన్నగా అయిపోవడం అదేవిధంగా సరిగ్గా కనిపించకపోవడంతో తనకు భయమేస్తుందని తెలిపాడు. తన కన్ను చిన్నగా అయిందని అందరూ అనుకుంటున్నారు. ఇక తనకు లేడీ గెటప్ సూట్ కాదని భావిస్తున్నారు. దీంతో ఇక అవకాశాలు కూడా రావేమో అని భయం వేస్తోంది. ఆ కన్నును రోజూ అద్దంలో చూసుకుని ఏడుస్తున్నాను అంటూ విలపించాడు వినోద్.

ఈ క్రింద వీడియో చూడండి

తాను ఉంటున్న ఇల్లు కొందామని ఇంటి ఓనర్‌కి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని, అయితే ఇంటి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని వారిని అడగగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారని వినోద్ అన్నాడు. దీంతో రిజిస్ట్రేషన్ అయినా చేయించండి లేదా నా డబ్బు అయినా వెనక్కి తిరిగివ్వండి అని వారిపై ఒత్తిడి తెచ్చానని, ఈ నేపథ్యంలో నాపై కక్ష్య కట్టి దాడి చేశారని వినోద్ చెప్పాడు. ఓకే నీ 10 లక్షలు ఇవ్వడమా లేక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడమా.. ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని నమ్మించి నాపై ఇలా దాడికి పాల్పడ్డారని ఆవేదన చెందాడు వినోద్. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని, నీ 10 లక్షలు ఇవ్వం, ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయం అంటూ దౌర్జన్యం చేశారని చెబుతూ ఆవేదన చెందాడు వినోద్.