ఏపీ సీఎం జగన్ పై ప్రభాస్ సంచలన కామెంట్లు

71

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న తెలుగు స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. బాహుబ‌లి సినిమాకు ముందు వ‌ర‌కు ప్ర‌భాస్ అంటే కేవ‌లం తెలుగు వాళ్ల‌కు మాత్ర‌మే తెలిసిన హీరో. ఆ సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి ప్ర‌భాస్ ఒక్క‌సారిగా నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. బాలీవుడ్‌, కోలీవుడ్ స్టార్ హీరోల‌ను త‌ల‌ద‌న్నే క్రేజ్ ప్ర‌భాస్‌కు వ‌చ్చేసింది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌‌పై బాహుబలి ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు కురిపించారు. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రమోషనల్‌లో భాగంగా, ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌కు.. జగన్ పాలన ఎలా వుందన్న ప్రశ్న ఎదురైంది.

ఏపీ సీఎం గురించి అడిగిన ప్ర‌శ్న‌కు జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు ప్రభాస్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ గురించి చెప్పాల‌ని ప్ర‌భాస్‌ను అడ‌గ‌గా అందుకు ప్ర‌భాస్ స్పందిస్తూ త‌న‌కు ఏపీ రాజ‌కీయాల గురించి పెద్ద‌గా తెలియ‌ద‌ని చెప్పాడు. జ‌గ‌న్‌ను త‌మిళ‌నాట పొలిటిక‌ల్ బాహుబ‌లిగా పిలుస్తున్నార‌ని చెప్ప‌గా… ప్ర‌భాస్ స్మైల్ ఇస్తూ యంగ్ సీఎంగా ఆయన చాలా బాగా చేస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక జ‌గ‌న్ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో చ‌రిత్ర తిర‌గ‌రాస్తూ ఏకంగా 151 అసెంబ్లీ సీట్ల‌తో పాటు 22 ఎంపీల‌ను గెలుచుకున్నాడు. జ‌గ‌న్ పాల‌న‌లో కూడా త‌న‌దైన మార్క్ చూపిస్తూ రాష్ట్ర ప్ర‌జ‌ల చేత ప్ర‌శంస‌లు అందుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్‌పై ప్ర‌భాస్ చేసిన పాజిటివ్ కామెంట్ల‌తో వైసీపీ వాళ్లంతా ప్ర‌భాస్ వీడియోను షేర్ చేస్తూ ప్ర‌భాస్‌ను ప్ర‌శంసిస్తున్నారు.

Image result for prabhas

ప్ర‌భాస్ యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ డైరెక్ష‌న్‌లో రూ.350 కోట్ల‌తో తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ సినిమా సాహోలో న‌టించాడు.. బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది. మొత్తం నాలుగు భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న సాహో ప్ర‌మోష‌న్ల‌లో ప్ర‌భాస్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్ పలు భాషల్లో సినిమా విడుదల నేపధ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరి ప్రభాస్ జగన్ పై చేసిన కామెంట్ లపై మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలో తెలియచేయండి.