అరవింద సమేత లో నాగబాబు పాత్రెంటో తెలుసా..!

447

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో క్రేజీగా రూపుదిద్దుకుంటున్న సినిమా అరవింద సమేత ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది…వరుసగా హిట్లు కొడుతున్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ఫ్యాక్షన్ నేపధ్యమున్న సినిమా చేస్తుండడంతో సహజంగానే ఆసక్తి నెలకొంది..ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, లీక్ద్ స్టిల్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి…

ఈ సినిమాలో నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. లీకయిన స్టిల్ కూడా ఎన్టీఆర్-నాగబాబు మధ్య ఓ ఎమోషనల్ సీన్ ను రివీల్ చెయ్యడంతో అసలు ఈ సినిమాలో నాగబాబు ఏ పాత్ర పోషిస్తున్నాడన్న విషయం పై చర్చలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం నాగబాబు ఈ సినిమాలో ఓ గ్రామ సర్పంచ్ గా కనిపిస్తాడట. అంటే రాయలసీమ లో ఉన్న ఓ గ్రామం.. అక్కడ గ్రామ పెద్ద అన్నమాట. అంతే కాకుండా నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. మెగా బ్రదర్ ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడంతో అటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఇటు మెగా అభిమానుల్లో వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బ లు హీరోయిన్లు గా నటిస్తుండగా జగపతి బాబు, రావు రమేష్, శ్రీనివాస రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. P. S. వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.