అరవింద సమేత లో కీలక సీన్లు లీక్..షాక్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్…

720

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత…ఏఎ సినిమాకు రాదా కృష్ణ నిర్మాత..ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది..ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు…స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సినిమా చిత్రీకరణ సమయంలో సీన్లు లీకవకుండా చేయడం తలకు మించిన పనిలా అవుతోంది… . షూటింగ్ స్పాట్లో మొబైళ్లు వాడకుండా నిషేధం విధించినా కూడా లీక్స్ ఆగట్లేదు. ఎలాగోలా దృశ్యాల్ని కెమెరాలోకి ఎక్కించేస్తున్నారు. సోషల్ మీడియాలో లీక్ చేసేస్తున్నారు. అందులోనూ బాగా క్రేజున్న కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే ఈ బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ‘అరవింద సమేత’ చిత్ర బృందం ఇప్పుడు ఈ ఇబ్బందితోనే తలలు పట్టుకుంటోంది. ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్-నాగబాబుల ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాని గురించి చాలా చర్చ నడిచింది.

సినిమాలోని కీలక సన్నివేశానికి సంబంధించి దృశ్యం ఇలా లీక్ కావడంతో ‘అరవింద సమేత’ టీం షాకైంది. షూటింగ్ స్పాట్ కు ఎవరూ మొబైళ్లు తేకూడదని షరతు విధించి.. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయినా కూడా లీక్స్ ఆగలేదు. తాజాగా ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ కొత్త లుక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో జీన్స్ మీద పొడవాటి తెల్లటి జుబ్బా లాంటిది వేసుకుని నడుస్తున్నాడు తారక్. ఇది సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాలు తీస్తుండగా క్లిక్ చేసిన ఫొటో అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఆ ఫ్లాష్ బ్యాక్ సాగుతుందట. అందులో పూర్తిగా ఎన్టీఆర్ ఇలాంటి డ్రెస్సింగ్ తోనే కనిపిస్తాడట. ఈ పిక్ లీక్ కావడంతో చిత్ర బృందాన్ని టెన్షన్ పెడుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా మళ్లీ ఇలా జరగడం పట్ల త్రివిక్రమ్ చాలా సీరియస్ అయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సినిమా నుంచి వరుసగా ఇలా లీక్స్ రావడం ఇండస్ట్రీ జనాలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.