అన్నయ్య చిరంజీవికి అదిరిపోయే గిఫ్ట్ పంపిన పవన్ కల్యాణ్

87

మెగాస్టార్ చిరంజీవి.. ఎంతో మందికి ఆదర్శం.. సినీ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎదగాలంటే.. డబ్బు లేదా పలుకుబడి.. ఏదో ఒకటి ఉండాలి. కానీ అవేవీ లేకుండా చాలా కష్టపడి ఆయన ఈ స్టేజ్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన మెగాస్టార్‌గా అందరి మన్ననలు పొందుతున్నారు. ఇరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఓవైపు అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటే మరో వైపు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఓ లేఖను కూడా విడుదల చేశారు. అందులో పవన్ ఏమన్నారంటే..

Image result for chiru and pawan kalyan

తనకు స్ఫూర్తిప్రదాత అయిన చిరంజీవి జన్మదినం.. అభిమానులందరికీ పండుగ రోజని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయనలో ఉన్న క్రమశిక్షణ, పట్టుదలే ఆయన్ను ఈ స్థాయికి చేర్చాయన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సైరా మూవీ మెగా అభిమానులకు చిరంజీవి అందిస్తున్న కానుక అని పవన్ అభివర్ణించారు. జనసేన పార్టీ కార్యకర్తల తరఫున చిరంజీవికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు..

Image result for chiru and pawan kalyan

నాకు స్పూర్తి ప్రదాత చిరంజీవి గారి జన్మదినం. అభిమానులందరికీ పండుగ రోజు. చిరంజీవి గారంటే కేవలం మెగాస్టార్ కాదు. మూర్తిభవించిన స్ఫూర్తి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకొనేందుకు కష్టపడటం అనే జీవన వేదానికి చిరంజీవి గారి ప్రస్థానం నిదర్శనం. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత నిగర్వంగా, నిరాడంబరంగా ఉండటం, తన మూలాలను మరిచిపోని సృహతో ఉండటం లాంటి జీవన విలువలకు ప్రతీక. చిరంజీవి గారు తానే ఒక సందోహం.. తన జీవితమొక సందేశం.

Image result for chiru and pawan kalyan

చిరంజీవి సందేశాన్ని అందిపుచ్చుకొన్న లక్షల మంది యువతరంలో నేనొక పరమాణువును కావడం అదృష్టం. అంతకుమించి, ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం. అన్నయ్య చిరంజీవి నరసాపురంలో విద్యార్థిగా ఎన్‌సీసీలో ఉన్ననాటి నుంచి, మద్రాసులో యాక్టింగ్ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి.. ఈ రోజు వరకు అదే ఉక్కు క్రమశిక్షణ. అదేస్థాయిలో అనితర సాధ్యమైన నేర్చుకునే తత్వం. అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురుదెబ్బలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని తొక్కేసుకొంటూ ఉన్నత శిఖరాలకు ఎగబాకిన ధీరత్వం. ఆయన వేసే ప్రతీ అడుగు ఆదర్శం, అనుసరణీయం.

ఈ క్రింద వీడియో చూడండి

చిరంజీవి ప్రస్తుతం యావత్ భరతజాతి విస్మరించిన అస్తుత సమరాగ్రేసురుడు. అగణ్య ధీరాగ్రేసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆసేతు హిమనగమూ భళీ భలీయని ప్రతిధ్వనించేలాగా సైరా అంటూ సినీ ప్రియులకు కానుకగా అందిస్తున్న చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా తరఫున, జనసైనికుల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి. ఆయన జీవితం మరింత మందికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉండాలని కోరుకొంటున్నాను.

ఆకాశం ఎప్పటికీ అలా నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. కానీ దాని వలన గాలి అష్టదిక్కులకూ విస్తరిస్తుంది. చిరంజీవి గారు మౌనిగా, మునిగా సుస్థిరంగా ఉంటారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నవతరాలను తీర్చిదిద్దుతూనే ఉంటుంది అంటూ ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ తన హృదయ స్పందనను వ్యక్తం చేశారు. అలాగే సైరాకి సంబంధించి ఒక ఫ్రేమ్ ని ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్న ఓ ఫోటోని కూడా చిరంజీవికి పవన్ కల్యాణ్ గుర్తుగా అందించినట్లు చెబుతున్నారు. మరోసారి మనం కూడా మెగా స్టార్ కు బర్త్ డే విషెస్ చెబుదాం.