Wednesday, 20 September 2017 | Login

మన వస్తువులు దొంగతనం అయితే ఎంత బాధ పడతాం కదా....కానీ వాటినే తీసుకొచ్చి ఒక దగ్గర వేసి అమ్ముతుంటారు దొంగ వెధవలు...భారతదేశం అనవసరమైన విషయాల్లో ఫేమస్ అవుతుంటుంది...అందులో చోర్ బజార్ ఒకటి అదేనండీ దొంగల బజారు....మరి భారత దేశం లోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన చోర్ బజార్ లు ఎక్కెడెక్కడ ఉన్నాయో తెలుసా.....ఆ విశేషాలు ఇపుడు మీకోసం రండి సరదాగా తెలుసుకుందాం...

మనదేశంలో చాలా మార్కెట్లున్నాయి. ఒక్కో మార్కెట్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకతలు ఉన్న కొన్ని మార్కెట్ల గురించే మనమిప్పుడు మాట్లాడుకుంటున్నాం. అక్కడ అన్నిరకాల దొంగలించిన సామాన్లూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలకు మీరు మీ బైకును లేదా ఇతర వాహనాలను వేసుకొని వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్కడ వాహనం పార్క్ చేసారంటే ఇక అంతే సంగతి. మన వెహికిల్ లో ఉన్న స్పేర్ పార్ట్స్ అక్కడ ఉన్న షాప్ లలో దర్శనమిస్తాయి. అలాంటి కొన్ని బజార్లు గురించి ఈ వీడియోలో చూద్దాం.

Published in Viral news T

కోడలి కోసం కన్న కొడుకునే హత్య చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. అసలు వివరాలను పరిశీలిస్తే..మత్తు పదార్థాలకు బానిసగా మారిన కొడుకు పెళ్లి చేస్తే మారతాడని ఓ తల్లి భావించింది. అయితే ఆమె ఆశ నిరాశ కావడంతో గత్యంతరం లేక అతడి ప్రాణాలు తీసింది. డ్రగ్స్‌కు అల‌వాటు ప‌డి, రోజూ కోడ‌లికి న‌ర‌కం చూపిస్తున్న కొడుకును క‌న్న‌త‌ల్లి హ‌త‌మార్చింది. ఈ సంఘ‌ట‌న ముంబైలో మన్‌ఖుర్ద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అంబేద్కర్ చ్వాల్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల నదీమ్‌కు మత్తు పదార్థాలు సేవించే అల‌వాటుంది. వివాహం అయితే అంతా సర్దుకుంటుందని అతడి తల్లి అన్వారీ భావించింది.

దీంతో రెండేళ్ల కిందట అలహాబాద్‌కి చెందిన యువతితో వివాహం చేసింది. అయినా నదీమ్‌లో ఎలాంటి మార్పూ రాక‌పోక‌, ఏదో ఒక వంకతో రోజూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఆ నరయాతన త‌ట్టుకోలేక పెళ్లైన ఐదు నెలలకే ఆమె త‌న‌ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే మరోసారి అలా జరకుండా చూస్తానని కోడలికి నచ్చ‌జెప్ప‌ి తిరిగి కాపురానికి అన్వారీ తీసుకొచ్చింది. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మంగళవారం రాత్రి నదీమ్‌ మళ్లీ డ్రగ్స్‌ తీసుకుని రావ‌డాన్ని గమనించిన అన్వారీ, మళ్లీ ఏదో ఒక గొడవ చేస్తాడని గ్ర‌హించి కోడల్ని తన స్నేహితురాలి ఇంటికి పంపించేసింది. నదీమ్ సోదరులు నుండి ఈ విష‌యం తెలుసుకున్న నదీమ్‌ తల్లిని దారుణంగా కొట్టాడు.

ఇక త‌న కొడుకులో మార్పు రావడం కష్టమని భావించిన అన్వారీ చున్నీతో నదీమ్‌ని ఉరేసి హతమార్చింది. రాత్రంతా కుమారుడి మృతదేహం పక్కనే ఏడుస్తూ కూర్చుంది. ఉద‌యం తిరిగి ఇంటికి వచ్చిన కోడలు తన అత్త ఏడుస్తూ ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. కేవలం కుటుంబాన్ని రక్షించుకోడానికి నదీమ్‌ని చంపేశానని అన్వారీ తెలపడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అన్వారీపై సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Published in politics news T

జుట్టు కత్తిరిస్తున్నారంటూ.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మహిళలు ఇటీవల గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. బయటికెళితే ఎక్కడ జుట్టు కత్తిస్తారోనని చాలా మంది మహిళలు ఇంటి గడప కూడా దాటడం లేదు. తమకు తెలియకుండానే జుట్టు కోల్పోతున్న ఘటనలు కొద్ది రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆడవాళ్లు ఒంటరిగా ఉండటాన్ని చూసి భయానక ఆకృతిలో ఉన్న వృద్ధుడొకడు త్రిశూలంతో ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాడు. గమనించి వెళ్లమనేలోపే మహిళలు స్పృహ తప్పి పడిపోతున్నారు. మెలకువ వచ్చి చూసుకునే సరికి వారి జడ తెగిపడి ఉంటోంది.

tm

ఇలాంటి ఘటనలు ఒకటిరెండు కాదు.. ఒకచోట రెండుచోట్ల కాదు.. ఢిల్లీ, గుర్గావ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ముంబై తదితర ప్రదేశాల్లో అనేకచోట్ల జరిగాయి. అయితే అన్ని చోట్లా వృద్ధుడేకాదు కొన్నిచోట్ల వృద్ధురాలు, మరికొన్ని ప్రాంతాల్లో దెయ్యం కూడా ఈ పనిచేసిందని, తాము స్వయంగా చూశామంటూ చెప్పారు. ఓ వృద్ధురాలిని కొట్టి చంపారు కూడా. వీటిని కొట్టిపారేసిన పోలీసులు అసాంఘిక శక్తుల పనేనని, వారిని పట్టుకొని కటకటాల వెనక్కు నెట్టుతామని శపథం చేశారు.

tm

దేశవ్యాప్తంగా ఓ మిస్టరీగా మారిన ఈ వ్యవహారానికి సంబంధించి బిహార్‌ వాసులు మొదటిసారిగా నమ్మశక్యమైన విషయాన్ని చెప్పారు. ఇదంతా చేస్తోంది వృద్ధుడో, వృద్ధురాలో, దెయ్యమో కాదు.. ఓ చిన్న పురుగని నిరూపించారు. బిహార్‌ రాజధాని పట్నాలోని రామకృష్ణానగర్‌లో ఓ వింతపురుగుని పట్టుకున్నారు. మహిళల జుట్టును కత్తిరిస్తోంది ఈ పురుగేనని చెబుతున్నారు. అంతేకాదు జుట్టును ఆ పురుగు నోటితో ఎలా కత్తిరిస్తోందో వీడియో కూడా తీసి, యూట్యూబ్‌లో పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పురుగుని కవర్లో బంధించి, ఇప్పటికైనా పుకార్లను నమ్మవద్దంటూ ఊరూరా తిరుగుతూ.. పురుగును చూపిస్తూ చెబుతున్నారు.

Published in politics news T

కొందరి జీవితాల్లో విషాదం ఎలా ముంచుకొస్తుందో తెలియదు. అనుకోని ఘటనతో ఒక్క సారిగా విషాదం ముంచుకొస్తుంది. అలాంటి ఘటనే ఓ యువకుడి జీవితంలో చోటు చేసుకుంది. కుటుంబం విషయంలో ఆ యువకుడికి చోటు చేసుకున్న విషాదం తీరనిది.

తల్లిని చూడాలనే తపనతో అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడికి ప్రపంచమే శూన్యంగా మారిపోయింది. ఇంటి తలుపు తీసి ఆ తల్లిని చూసి షాక్ అయ్యాడు..ఎందుకో తెలుసా...కావాలంటే ఈ వీడియో చూడండి.

 

Published in politics news T

కామంతో కళ్ళు మూసుకుపోయాయి అన్న సామెతకు ముంబైలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. డీఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంధేరీలో నివసించే ఓ 16 ఏళ్ల బాలుడిపై ఏడాదిగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ 15 మంది తోటి బాలురే అత్యాచారం చేసేవారు. బాలుడు తీవ్ర నొప్పితో బాధపడుతూ ఈ విషయాన్ని స్నేహితుడికి తెలిపి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడికి వైద్య పరీక్షలు జరిపించగా అత్యాచారం జరిగిందని నిర్ధారించారు.

అసహజ సిద్దమైన లైంగిక చర్యకు పాల్పడిన 15 మంది బాలురపై పోలీసులు ఐపీసీ పిల్లల సంరక్షణ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. వీరంతా 15 నుంచి 17 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. నిందితుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎన్‌ నగర్‌ పోలీసులు తెలిపారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా కొట్టెవారని బాలుడు తన ఫిర్యాదులో తెలిపాడు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఈ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం మేరకు 2016లో బాలుడి ఇంటి పక్కనే ఉండే మరో బాలుడు అ‍త్యాచారం జరుపుతూ వీడియో తీశాడు. తర్వాత ఈ వీడియోను అతని స్నేహితులకు షేర్‌ చేశాడు. ఆ వీడియోను చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. బాలుడిని నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం జరిపేవారు. నిందితుల్లో ఒకరు బాలుడిని రెస్టారెంట్‌ వెళ్లి తినడానికి డబ్బులు ఇవ్వాలని బెదిరించగా బాధితుడు దానికి అంగీకరించలేదు. దీంతో నిందితులు జూన్‌ 26 మరో సారి అ‍త్యాచారం జరిపారు.

Published in politics news T

హైదరాబాద్ కూకట్‌పల్లి లో జూన్ 7న అదృశ్యం అయిన 10వ తరగతి బాలిక పూర్ణిమ సాయి ఆచూకీ దొరకడంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలోని దాదర్ లో పూర్ణిమ సాయిని పోలీసులు గురించడంతో ఈ మిస్సింగ్ మిస్టరీకి తెర పడింది. నిజాంపేటకు చెందిన పూర్ణిమ సాయి 40 రోజుల క్రితం అదృశ్యం అయింది. జూన్‌ 7న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోలీసులను పిర్యాదు చేసారు. పోలీసులు స్కూల్ కు వెళ్లి విచారిస్తే.. పూర్ణిమ అసలు స్కూల్ కే రాలేదని చెప్పడంతో వారు విస్మయానికి గురి చెందారు. ఈ మిస్సింగ్ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు..14 బృందాలుగా విడిపోయి పూర్ణిమ కోసం వెతికారు.

tm

సినిమాల్లో నటించాలనే కోరిక పూర్ణిమకు ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ముంబై, చెన్నై సహా పలుచోట్ల గాలించారు. అన్ని స్టూడియోలను సంప్రదించారు. చివరకు దాదార్‌లోని ఓ స్టూడియో వద్ద ఉన్న పూర్ణిమను గుర్తించిన ముంబై పోలీసులు.. ఓ ఎన్జీవోలో చేర్పించారు. పూర్ణిమ సాయి సమాచారాన్ని ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులు తెలియజేశారు.

tm

అయితే, మూడ్రోజుల క్రితమే పూర్ణిమ మిస్సింగ్ కేసును పోలీసులు కిడ్నాప్ కేసుగా మార్చారు. సినిమాల్లో నటించాలనే పిచ్చి కోరికతోనే పూర్ణియి సాయి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఓ ఎన్జీవో సంరక్షణలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మొత్తంగా పూర్ణిమ క్షేమంగా ఉందని పోలీసులు వెల్లడించడంతో ఈ మిస్సింగ్ మిస్టరీ కథ సుఖాంతం అయింది.

Published in politics news T

మహిళలకు ఇప్పుడు ఎక్కడా రక్షణ లేకుండా పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఇల్లు,రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలు అన్న తేడా లేకుండా పోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరువాత ఆ కెమెరాలుతో ఎక్కడ ఎవరు తమను ఏ రీతిలో బంధిస్తారో తెలియని పరిస్థితి. ఆఖరికి రైల్లో బాత్రూమ్ ల్లోను కొంతమంది కీచకులు కెమెరాలతో వెంటాడుతున్నారు. తాజా గా ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లోక్ మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణించిన ఓ 50ఏళ్లమహిళ. ఎ-1 ఏసీ కోచ్ లో ప్రయాణిస్తూ.. మూత్ర విసర్జన కోసం బాత్రూమ్ వెళ్లింది. ఈమె థానే నగరానికి చెందిన మహిళా. ఇది గమనించిన షేక్ సలీం అనే రైల్వే ఉద్యోగి.. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి రహస్యంగా వీడియో తీశాడు.

tollywood-heroines-cleavage-images

ఇంతలో మొబైల్ అలారం మోగడంతో.. తననెవరో రహస్యంగా చిత్రీకరిస్తున్నారన్న విషయాన్ని మహిళ కనిపెట్టేసింది.

 

వెంటనే విషయాన్నిఅక్కడున్న తోటి ప్రయాణికులకు చెప్పడంతో.. అంతా కలిసి సలీం వద్ద తనిఖీలు చేశారు. దీంతో అతని మొబైల్లో పలువురి మహిళల అర్థనగ్న వీడియోలు కనిపించాయి. దీంతో రైల్వే కంట్రోల్ రూమ్ అధికారులకు సమాచారం అందించారు.ఝాన్సీ జీఆర్పీ పోలీసుల విచారణలో సలీం రైలులో పలువురి మహిళల అర్దనగ్న వీడియోలను షూట్ చేశాడని తేలింది. మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన సలీంపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ వెంటనే రిమాండ్ కు తరలించారు. కాగా, నిందితుడు షేక్ సలీంను కళ్యాణ్ నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రైల్వేలో సలీం ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. విధినిర్వహణలోనే గోరఖ్‌పూర్ -లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన సలీం.. ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు.

Published in politics news T

రైడ్ కోసం కారు బుక్ చేసిన ఒక వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ. అసలు వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 1న ముంబయికి చెందిన నర్సియాన్.. ములుంద్ నుంచి వకోలా మార్కెట్ వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే.. అతడ్ని పికప్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్.. నర్సియాన్ ఉన్న ప్లేస్ ను కనుక్కోలేకపోయాడు. దీంతో.. అతనే స్వయంగా క్యాబ్ వద్దకు వెళ్లి క్యాబ్ ఎక్కాడు. అయితే.. క్యాబ్ 300 మీటర్ల దూరం వెళ్లాక డ్రైవర్ కారు ఆపేశాడు. గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో.. మరోక్యాబ్ ను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. రూ.1491051648 చెల్లించాలన్న మెసేజ్ వచ్చింది.

ఆ భారీ మొత్తాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు నర్సియాన్. మీరు మొత్తం సొమ్ము చెల్లించనందుకు క్యాబ్ బుక్ చేసుకోలేకపోయారు అని కూడా అందులో పేర్కొంది. ఇది మాత్రమే కాదు యాప్ అకౌంట్లో ఉన్న రూ.127 ను డిడెక్ట్ అయ్యాయి కూడా.. అసలు ఏమి జరుగుతోందో తెలియక నర్సియాన్ కస్టమర్ కేర్ ను సంప్రదించాడు.. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగి ఉంటుందని.. దీనిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారంట. జరిగిన ఈ సంఘటన మొత్తం నర్సియాన్ సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. మీరు కూడా ఒక్కసారి లుక్ వేయండి మరి..! 

Published in politics news T

ప్రేమికుల రోజు పురస్కరించుకుని ప్రేమికులు తమ ప్రేమను ప్రదర్శించడానికి చిత్ర, విచిత్ర కార్యాలు పూనుకుంటారు. అవి కొందరికి నచ్చినా కొన్నిసార్లు అవే ప్రాణాల మీదకి తెస్తాయి. ఇది ఇలా ఉంటే ఇలాంటి విచిత్రమైన కార్యం ఒకటి చేసి ప్రేమికుడు చివరికి జైలు పాలు కావాల్సి వచ్చింది. విషయంలోకి వస్తే ముంబైలో ఉండే ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి తన ప్రేమ తెలియజేయడానికి సాహసోపేతమైన కార్యం చేసి చిక్కులు తెచ్చుకున్నాడు. మంగళవారం ప్రేమికుల రోజు కావడంతో తన ప్రియురాలికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఈ అబ్బాయి అనుకున్న వెంటనే తన కారును కొత్తగా విడుదలైన రూ. 2000 నోట్లతో పూర్తిగా అలంకరించేశాడు.

ఇక కారును ప్రియురాలికి చూపించడానికి బయల్దేరిన ఈ ప్రేమికుడును పోలీసులు చూసి.. మార్గం మధ్యలోనే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ యువకుడి వివరాలు పోలీసులు వెల్లడించలేదు గానీ పలువురు ప్రేమికులు మాత్రం అతనికి అండగా నిలుస్తుండగా.. మరికొందరు ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్నారు.  

Published in politics news T

2016 నవంబర్ 17 న ముంబై లోని కరోడి అనే గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ సెయింట్ ఆంతోనీస్ పారిస్ కు చెందినా చర్చ్ బయట ఉన్న జీసస్ క్రైస్ట్ విగ్రహం కాలి నుండి నీరు రావడం ప్రారంభం అయింది. అది గమనించిన స్థానికులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇది జీసస్ చేసిన మిరాకిల్ అని ప్రచారం జరిగింది. ఆ వింతను చూడడానికి ముంబై నుంచి బయట ప్రాంతాల వారు కూడా చాలామంది వచ్చారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి రెండు రోజుల్లోనే వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి రావడంతో పోలీస్ సెక్యురిటీ మీడియా కవరేజ్ కూడా వచ్చింది. ఆ పవిత్ర జలాన్ని చాలామంది తల మీద జల్లుకొని దాన్ని తీర్ధంలా తాగి ఇంకా బాటిల్స్ లో కూడా పట్టుకొని మరీ వెళ్ళారు.

ఆ సమయంలో ఆ చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వింత దేవుడే చేసాడని అది దేవుడి గొప్పతనం అని చాలామంది ప్రచారం చేసారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి కూడా ఇదే ప్రూఫ్ అని ప్రచారం కూడా జరిగింది. ఇలా ఆ ప్లేస్ బాగా పాపులర్ అయింది. అయితే ఆ వింత మీద రీసెర్చ్ చేయడానికి ఫిన్లాండ్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చారు.

ఆయన రీసెర్చ్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన రీసెర్చ్ లో తేలింది ఏమిటంటే ఆ చర్చ్ కు దగ్గరలో టాయ్ లెట్స్ లో ఉన్న ప్లంబింగ్ వర్క్ సరిగ్గా లేకపోవడం వలన లోపల డ్రైనేజ్ లోని నీళ్ళు లీకవడం జరిగిందనీ ఆ నీటిని ఈ విగ్రహం అబ్సార్బ్ చేసుకొని ఇలా నీళ్ళు లీకవుతుందని చెప్పారు. 

ఇది నమ్మమని చెప్పిన భక్తులకు ప్రూవ్ చేయడానికి  ఆయన ఆ టాయ్ లెట్స్ ను రిపేర్ చేయించారు. అంతే ఆ విగ్రహం నుండి నీళ్ళు రావడం ఆగిపోయింది. నిజంగా ఆ విగ్రహం నుండి వచ్చిన నీరు టాయ్ లెట్ లోనిదే...దాన్నే భక్తులు మూఢ నమ్మకంతో తాగారు. దేవుడు లేడని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. దేవుడు అనేది మన నమ్మకం. దాన్ని మనస్పూర్తిగా నమ్మాలి గాని, కాని అది నమ్మించడానికి దేవుడు అధ్బుతాలు చేస్తాడని చెప్పడం తప్పు. దేవుడిని మనస్పూర్తిగా నమ్మండి. అద్బుతాలను కాదు.

Published in politics news T
Page 1 of 2