Wednesday, 20 September 2017 | Login

గ‌త కొన్నేళ్లుగా ప్ర‌యివేట్ పాఠ‌శాల‌లు ఫీజులు పెంచ‌డంపై విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి తీవ్ర‌వ్య‌తిరేక‌త వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌యివేట్ స్కూళ్ల అజమాయిషీని క‌ట్ట‌డి చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం సంచలన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ, కేంబ్రిడ్జి గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల‌తో పాటు అన్ని ప్ర‌యివేట్, నాన్ ఎయిడెడ్ పాఠశాల‌లు త‌మ ఆర్థిక లావాదేవీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం హుకుం జారీచేసింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు ప్ర‌భుత్వం వెల్లడించింది.

గ‌త మూడేళ్ల లావాదేవీల‌తో పాటు పాఠ‌శాల‌లో పాటించే ఫీజుల విధానాల‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చాల‌ని తెలిపింది. ఇందుకు సెప్టెంబ‌ర్ 15వ తేదీని గ‌డువుగా ప్ర‌క‌టించింది. ఈలోగా వివ‌రాలు పొందుప‌ర‌చ‌లేని పాఠ‌శాల‌ల‌పై చ‌ర్య తీసుకోనున్న‌ట్లు హెచ్చరించింది. www.cdse.telangana.gov.in ఈ వెబ్‌సైట్‌లో పాఠ‌శాల‌లు వివ‌రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ వెబ్‌సైట్‌లో పొంద‌ప‌రిచే వివ‌రాలు స‌రైన‌వేనా? కాదా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఎలా వ‌స్తుంద‌ని త‌ల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ ఉత్త‌ర్వుకు సంబంధించిన వివ‌రాలు కొన్ని పాఠ‌శాల‌ల‌కు చేర‌న‌ట్లుగా సమాచారం.

Published in politics news T

ఉద్యోగ కల్పనే లక్ష్యంగా యువతీ యువకులకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీ బంపరాఫర్ ప్రకటించింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

tm

జూలై 7వ తేదీ శుక్రవారం భారీ జాబ్ మేళాను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంట్రల్ జోన్ పరిధిలోని గగన్ మహల్ లోని ఏవీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కాలేజీలో ఏర్పాటు చేస్తోంది. టెన్త్, ఐటీఐ, డిగ్రీ, MBA, MCA, బీటెక్, డిప్లొమా అర్హత కలిగిన వారు అర్హులు. వయస్సు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హత సర్టిఫికెట్లు, రెజ్యూమ్స్ తో హాజరుకావాలని జీహెచ్ఎంసీ తెలిపింది. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ జాబ్ మేళాకు వస్తున్నాయని ప్రకటించింది.

 

Published in politics news T

తెలంగాణప్రదేశ్ లో కాంగ్రెస్ యూత్ ఆదివారం నాడు 10కే, 5కే, 2కే రన్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 8 వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ట్రాఫిక్‌ నిబంధనలను పెట్టారు. అవి ఏమిటో తెలుసుకోండి...

* డీబీఆర్‌ మిల్స్‌ నుంచి ట్రాఫిక్‌ను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపుకి అనుమతించరు.

* నల్లగుట్ట నుంచి సంజీవయ్యపార్క్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా వైపుగా మళ్లిస్తారు.

* తెలుగుతల్లి చౌరస్తా వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హెలీప్యాడ్‌ లైన్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వైపు మళ్లిస్తారు.

* వీవీ విగ్రహం (ఖైరతాబాద్‌ చౌరస్తా) వైపు నుంచి ఫ్లైఓవర్, నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదన్‌ కాలేజ్, నిరంకారి భవన్‌ వైపు పంపిస్తారు.

* కర్బాలా వైపు నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను చిల్ట్రన్స్‌ పార్క్‌ నుంచి డీబీఆర్‌ మిల్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా పంపిస్తారు.

* లిబర్టీ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కేఆర్‌ భవన్, తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్‌ మీనార్‌ (యూ టర్న్‌) మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పైకి మళ్లిస్తారు.

* ఇక్బాల్‌ మీనార్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం ఓల్డ్‌ గేట్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదికి మళ్లిస్తారు.

Published in politics news T

ఈ సారి ప్రకృతి తన ప్రభావాన్ని అనంతపురం జిల్లా మీద చూపింది. బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. దీంతో గ్రామంలోని సిమెంటు రోడ్డు రెండు భాగాలుగా చీలిపోయింది. ఇళ్లలోని వస్తువులు కిందపడిపోవడంతో భయపడిన గ్రామస్థులు ఇళ్లలో నుంచి బయటకి వచ్చేసారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి భూకంప తీవ్రతను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కూడేరు మండలం ఎమ్‌ఎమ్‌ హళ్లిలో కూడా అతి స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. జిల్లాలోని జీడిపల్లి, ఎంఎం హళ్లి ఇంకొన్న ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించిందని పేర్కొన్నారు.

Published in politics news T

గత వారం రోజులుగా త వారం రోజులుగా కేరళ రాష్ట్రంలోనే ఆగిన రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. రాబోయే 3, 4 రోజుల్లో అవి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ వరకూ వచ్చే అవకాశాలున్నాయని, ప్రస్తుతం ఝార్ఖండ్‌ నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ఆవర్తనముందని, దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న వెల్లడించారు. అందువలన నైరుతి రుతుపవనాలు ఈనెల 8 తరవాత తెలంగాణను తాకే అవకాశాలున్నాయని.... 8, 9 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, వీటికి రుతుపవనాల రాకనే కారణమని అంచనా వేస్తున్నట్లు ఆమె అన్నారు. దీని వలన పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. ఇంకా తగ్గుతాయని అంటున్నారు. గతేడాది జూన్‌ 17న తెలంగాణకు రుతుపవనాలు వచ్చాయి. ఈసారి వేచి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చని నాగరత్న అన్నారు.

Published in politics news T

తెలంగాణ రాష్టానికి ఈ రోజు నుండి విద్యుత్ సరఫరాను ఆపివేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం టీఎస్ ట్రాన్స్ కో అధికారులకు లేఖ రాస్తూ, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని హెచ్చరించింది. బకాయిలు ఇస్తేనే విద్యుత్ ను సరఫరా చేస్తామని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. తెలంగాణ నుంచి రూ, 4,449 కోట్ల బకాయి రావాల్సి వుందని గుర్తు చేసిన ఏపీ ప్రభుత్వం వాటిని చెల్లించడంలో అశ్రద్ధ చేస్తున్నారని తెలిపింది. బకాయిలు చెల్లించేంత వరకూ విద్యుత్ సరఫరాను ఆపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం కితాబు ఇవ్వాల్సి ఉంది.

Published in politics news T

ప్రస్తుతం లాంగ్ జర్నీల కోసం కూడా బస్ లను ఎంచుకుంటున్నారు ప్రయాణీకులు ..వోల్వో బస్సులు తొందరగా గమ్యాన్ని చేర్చడమే కాకుండా కంఫర్ట్ గా కూడా ఉంటున్నాయి..స్లీపర్ బస్సులు కూడా అందుబాటులో ఉండడంతో హాయిగా పడుకొని బస్సులో ప్రయాణం చేయవచ్చు..బస్ టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు అభిబస్ అనే వెబ్ సైట్ గత పదేళ్లుగా అందుబాటులో ఉంది..అభి బస్ యాప్ ను కూడా మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి మీ ఫోన్లోనే మీకు కావాల్సిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు..ఈ సంస్థకు టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ఎంబాసిడర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే....ఈ యాప్ లేదా వెబ్ సైట్ నుంచి ప్రైవేటుతో పాటు ఆర్టీసీ బస్‌ల టికెట్లు కూడా కొనుగోలు చేసుకోవచ్చు..ఈ అభిబస్ లో కొనుగోలు చేసే టికెట్ కు ఆయా బస్సుల్లో కావాల్సిన సీటును, అనువైన ధరలో ఉన్నవి చూసుకుని, కొనుగోలు చేసుకోవచ్చు. అభి బస్ యాప్ కొత్తగా ఒక సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది..అదేంటో ఈ వీడియో చూసి తెలుసుకొండి....

Published in politics news T

గోమాంటక్ గా చరిత్రలో చెప్పబడ్డ గోవా..దేశానికి పశ్చిమ తీరాన అరేబియా సముద్ర తీరంలో ఉంది..వైశాల్యంలో రెండు, జనాభాలో నాలుగో అతి చిన్న రాష్ట్రం గోవా..1498 లో వాస్కోడిగామా కోజికోడ్ నుంచి గోవాకు రాగా తరువాత వ్యాపారానికి పోర్చుగీసువారు వారు క్రమంగా ఆక్రమించారు..స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా పోర్చుగీసువారు గోవాను వదిలి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో సైన్యం చొరవతో ఖాళీ చేయించారు..గోవాను మొదట కేంద్రపాలిత ప్రాంతంగా ఆ తరువాత 1987 మే 30 న దేశంలో 25 వ రాష్ట్రంగా ఏర్పడింది..గోవా గురించి విశేషాలు ఈ వీడియోలో మీ కోసం..

Published in politics news T

అప్పుడెప్పుడో.. అంటే.. 2012వ సంవ‌త్స‌రానికి చాలా కాలం ముందు నుంచే ఓ పుకారు జోరుగా ప్రచారంలో ఉండేది తెలుసు క‌దా. అదేనండీ… 2012 డిసెంబ‌ర్ 21వ తేదీన భూమిపై ప్ర‌ళ‌యం వ‌స్తుంద‌ని, అంతా నాశ‌న‌మ‌వుతుంద‌ని, మ‌య‌న్లు అన‌బ‌డే ఓ తెగ‌కు చెందిన వారి క్యాలెండ‌ర్ ఆ తేదీ వ‌ర‌కే ఉంద‌ని, అందుకే క‌చ్చితంగా ప్ర‌ళ‌యం వ‌చ్చే తీరుతుంద‌ని అంతటా ప్ర‌చారం జ‌రిగింది.ఈ తప్పక చూడండి

 

Published in politics news T

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలంటే ఏ నిరుద్యోగి అయినా ఏం చేస్తాడు? ఆ ఉద్యోగానికి తగినట్టుగా విద్యార్హతలను సాధించి, అన్ని కోర్సులల్లో శిక్షణ పొంది తనకు నచ్చిన సంస్థకు జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకుని, ఇంటర్వ్యూలు, పరీక్షలు వగైరాలు పూర్తి చేసి ఎట్టకేలకు జాబ్ సాధిస్తాడు. కానీ ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఓ ఈ-కామర్స్ సైట్‌లో జాబ్ కోసం ఆ సైట్‌లోనే తనను తాను అమ్మకానికి పెట్టుకుని సంచలనం సృష్టించాడు.ఈ తప్పక చూడండి

Published in politics news T
Page 1 of 16