ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై ప్రీ-పోల్ సర్వే ప్రచురించిన ఓ ప్రాంతీయ పత్రిక న్యూస్ ఎడిటర్‌ను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న ‘నేటి భారతం డాట్ కామ్’లో కూన అజయ్ బాబు ప్రీ-పోల్ సర్వే ఫలితాలను పబ్లిష్ చేశారు. ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి లీకైన ఇంటెలిజెన్స్ వివరాలను బట్టి వైసీపీ 4551 ఓట్ల తేడాతో విజయం సాధిస్తుందని ప్రచురించారు.

అయితే ప్రీ-పోల్ సర్వేను ప్రచురించడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ‘నేటి భారతం డాట్ కామ్’‌ హైదరాబాద్‌కు చెందిన వెబ్ డిజైనర్ డి.రంజిత్ కుమార్ నేతృత్వంలో నడుస్తున్నట్టు గుర్తించారు. దీనికి ఓ ప్రాంతీయ పత్రికలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నకూన అజయ్ బాబు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. కల్పిత పత్రాలతో ప్రీ-పోల్ సర్వే ఫలితాలు ప్రచురించిన నేరం కింద ఇద్దరినీ అదుపులోకి తీసుకుని జుడీషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

Published in politics news T

గ‌త కొన్నేళ్లుగా ప్ర‌యివేట్ పాఠ‌శాల‌లు ఫీజులు పెంచ‌డంపై విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి తీవ్ర‌వ్య‌తిరేక‌త వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌యివేట్ స్కూళ్ల అజమాయిషీని క‌ట్ట‌డి చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం సంచలన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ, కేంబ్రిడ్జి గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల‌తో పాటు అన్ని ప్ర‌యివేట్, నాన్ ఎయిడెడ్ పాఠశాల‌లు త‌మ ఆర్థిక లావాదేవీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం హుకుం జారీచేసింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు ప్ర‌భుత్వం వెల్లడించింది.

గ‌త మూడేళ్ల లావాదేవీల‌తో పాటు పాఠ‌శాల‌లో పాటించే ఫీజుల విధానాల‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చాల‌ని తెలిపింది. ఇందుకు సెప్టెంబ‌ర్ 15వ తేదీని గ‌డువుగా ప్ర‌క‌టించింది. ఈలోగా వివ‌రాలు పొందుప‌ర‌చ‌లేని పాఠ‌శాల‌ల‌పై చ‌ర్య తీసుకోనున్న‌ట్లు హెచ్చరించింది. www.cdse.telangana.gov.in ఈ వెబ్‌సైట్‌లో పాఠ‌శాల‌లు వివ‌రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ వెబ్‌సైట్‌లో పొంద‌ప‌రిచే వివ‌రాలు స‌రైన‌వేనా? కాదా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఎలా వ‌స్తుంద‌ని త‌ల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ ఉత్త‌ర్వుకు సంబంధించిన వివ‌రాలు కొన్ని పాఠ‌శాల‌ల‌కు చేర‌న‌ట్లుగా సమాచారం.

Published in politics news T

మ్యారిటల్‌ రేప్‌పై తన అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపింది కేంద్రం. వాటిని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ‘భారత్‌లో మ్యారిటల్‌ రేప్‌ నేరంగా పరిగణించలేం. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను భారత్‌ గుడ్డిగా అనుసరించబోదు. ఎందుకంటే దేశంలో అక్షరాస్యత, మెజారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, సమాజ దృష్టికోణం, పేదరికం, విభిన్నత వంటి అనేక సమస్యలు ఉన్నాయి’ అని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

tm

మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించడం లింగ సమన్వత్యంలో కీలక ముందడుగుగా భావించారు. కానీ కేంద్రం ఈ విషయంలో భిన్నమైన వైఖరిని తీసుకుంది. మ్యారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించే ముందు ఏది మ్యారిటల్‌ రేప్‌, ఏది నాన్‌ మ్యారిటల్‌ రేప్‌ అన్నది స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముందని అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. ‘ఒక వ్యక్తి తన భార్యతో చేసే శృంగార చర్యలన్నీ మ్యారిటల్‌ రేప్‌ కింద పరిగణిస్తే.. ఏకపక్షంగా భార్య చెప్పిన విషయాల ఆధారంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది’ అని తెలిపింది. సాక్ష్యాల విలువను గుర్తించడం ఈ విషయంలో ప్రధాన సమస్యగా మారుతుందని పేర్కొంది. అంతేకాకుండా వివాహ వ్యవస్థను మారిటల్‌ రేప్‌ అస్థిరపరిచే అవకాశముందని కేంద్రం భావించింది.

Published in politics news T

పూర్వకాలంలో తమ రాజ్యంలోని పరిస్థితులను గమనించడానికి రాజులు మారువేషంలో పర్యటించేవారని చదువుకున్నాము.. సినిమాలలో కూడా చూశాము. అయితే, ఇప్పుడు అచ్చం అలాగే చేశారు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి. ఎలాంటి భద్రతా లేకుండానే వ్యక్తిగత సహాయకురాలితో కలిసి అర్ధరాత్రి స్కూటర్‌పై పుదుచ్చేరిలోని ప్రధాన రహదారులు, ఇరుకురోడ్లలో సుమారు గంటపాటు పరివేక్షించారు.

tm

కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసే అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్నారు. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబరు 2007 లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి గవర్నర్ గా కొనసాగుతున్నారు.. ఈ నేపథ్యంలోనే పోలీసుల పనితీరును గమనించేందుకు అర్ధరాత్రి తన సహాయకురాలితో వెళ్లారు.

tm

ప్రజలు తనను గుర్తు పట్టకుండా చున్నీని తలపై కప్పుకొని.. నైట్‌ డ్యూటీలో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారో, లేదో ఆమె తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉందని, మహిళలకు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని అభిప్రాయపడుతూ ట్విట్టర్‌లో ఒక సందేశం పోస్టు చేశారు.పోలిసుల పనితీరు బాగుందని మెచ్చుకున్నారు కానీ ఈవిడ పనితీరే బాగాలేదనే విమర్శలు వస్తున్నాయి. బండి నడిపేప్పుడు హెల్మెట్ లేదు, కనీసం లైసెన్స్ అన్నా ఉందా లేదా అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

Published in politics news T

ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళుతుండగా ఓ ఆర్టీసీ బస్సు మీద అసభ్యకరంగా ఉన్న ఓ తెలుగు చిత్రం పోస్టర్‌ను ఆయన గమనించారు.

tm

దాంతో ఆయన వెంటనే బస్సు ఆపించి కండక్టర్‌ సాయంతో పోస్టర్‌ను తొలగించేశారు. ఇలాంటివి యువతను తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు. డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకోకూడదని ఈ సందర్భంగా వీహెచ్‌ పేర్కొన్నారు. ఇటీవల ఓ గోవా ఎమ్మెల్యే.. బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ ప్రకటనలన్నీ నిషేధించాలని.. ఇలాంటి పోస్టర్లు విద్యార్థులు ప్రయాణించే బస్సులపై అంటిస్తే వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్న విషయం తెలిసిందే.

Published in politics news T

మహిళలపై వికృత చర్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. అసలు వివరాలను పరిశీలిస్తే.. కర్ణాటకలోని కొడగు జిల్లాలో మాదికేరి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతుండగా మరోపక్క కాంగ్రెస్ నాయకుడు టీపీ రమేశ్, ఎమ్మెల్సీ వీణ అచ్చయతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాకి చిక్కాడు. రమేశ్, వీణ చేయి పట్టుకుంటుండగా, ఆమె అలెర్ట్ అయ్యి వెంటనే ఇబ్బంది పడుతూ తన చెయ్యి వెనక్కు లాక్కుంది.

ఇదంతా వీడియోలో క్లారిటీగా రికార్డు అవడంతో టీపీ రమేశ్ విమర్శలకు గురి అవుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ వీణ స్పందిస్తూ.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన మొదటిసారి చూస్తున్నాను. వేదిక మీద చాల బరువు తగ్గావ్..! అంటూ నా చెయ్యి పట్టుకోవడంతో నేను షాక్ అయ్యానని అన్నారు.

 

Published in politics news T

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 16 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 32 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని, 9 జవహార్‌ నవోదయ విద్యాలయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన రాజ్యసభ సభ్యుడు ఎంఏ.ఖాన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అవేంటంటే.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో కేంద్రీయ విద్యా సంస్థలు, జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాధనలు పంపిందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలు మంజూరు చేస్తుందా? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు తెలంగాణ నుంచి 16 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

tm


భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్‌ టౌన్‌, సిద్దిపేట, కొమురంభీం ఆసిఫాబాద్‌, జోగులాంబ గద్వాల, భువనగిరి, వికారాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌ క ర్నూల్‌, నిర్మల్‌, వనపర్తి, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినట్లు పేర్కొన్నారు. అలాగే, 2014 తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో తెలంగాణలో ఏ జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు లేవో అక్కడ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

 

 

Published in politics news T

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు దుర్మరణం చెందారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కారు ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

tm

ఈ దుర్ఘటనలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌ కుమారుడు విజయ్‌ కుమార్‌, ఆయన అత్తగారు అక్కడికక్కడే మృతి చెందారు. విజయ్ కుమార్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ ప్రసూతి ఆస్పత్రితో వైద్యులుగా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయన భార్యతో పాటు మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఘటనాస్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

tm

Published in politics news T

బ్యాంకులు పనిచేసే రోజుల్లో, వర్కింగ్ అవర్స్ లోనే ఏటీఎంలకు వెళితే నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక డిజిటల్ లావాదేవీలు మాత్రమే చేయాలని కండిషన్ పెట్టినప్పటి నుంచి బ్యాంకుల్లో కూడా డబ్బులు డ్రా చేయడానికి సరిపడా నగదు ఉండడం లేదు. దీనికి తోడు వేస్తే ఇంత, తీస్తే ఇంత, బ్యాంకు వైపు చూస్తే ఇంత.. ఇలా ఎడా పెడా ఛార్జెస్ వాయిస్తున్నారు. ఇటువంటి ఉక్కిరి బిక్కిరిలో ఉన్న ఖాతాదారులకు వరుస సెలవుల రూపంలో ఇబ్బందులు తారా స్థాయికి చేరనున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఆగస్టు 12 శనివారం నుంచి ఆగస్టు 15 మంగళవారం వరకు వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఈ 4 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు మాత్రం యథావిధిగా సాగుతాయి. ఈనెల 25 నుంచి కూడా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న 4వ శనివారం, 27న ఆదివారం కావడంతో మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

Published in politics news T

ఇటీవలి కాలంలో యువ ఐఏఎస్‌ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించగా.. తాజాగా బీహార్లోని బక్సర్ జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న ముఖేష్ పాండే రైలు పట్టాలపై కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వేగంగా వస్తున్న రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. ఆయన మృత దేహాన్ని పోలీసులు ఢిల్లీ శివారులోని ఘజియాబాద్ స్టేషన్ కు సమీపంలో గుర్తించగా.. ఆయన జేబులో ఒక కాగితాన్ని పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా ఆయన బస చేసిన హోటల్ గదికి వెళ్లి, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో.. 2012 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారినైన తాను ప్రస్తుతం బీహర్ లోని బక్సర్ జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

తరువాతి పేజీలో ఇంకా ఉంది..

Published in politics news T
Page 1 of 12