ఈ రాశుల వారికి కోపం ఎక్కువ ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

907

మ‌న‌కు రాశులు న‌క్ష‌త్రాలు ఉంటాయి. ఇలా అనేక‌ జాత‌కాలు న‌మ్మేవారు ఉంటారు. ముఖ్యంగా రాశిచ‌క్రాల ద్వారా మ‌నిషి ముందుకు వెళ‌తాడు. వాటిని పాటించేవారు కొందరు అయితే, పాటించ‌ని వారు కొంద‌రు ఉంటారు. ఒక్కో రాశి వారికి ఒక్కో లోపం ఉండటం సహజమే. ఒక్కోసారి ఆ లోపల కారణంగా ఎన్నో ఇబ్బందులను పడవలసిరావచ్చు. మీ రాశి ప్రకారం ఆ లోపాల‌ని తెలుసుకుంటే ముందే జాగత్త పడవచ్చు..రాశుల ప్రకారం మీలో ఉండే లోపాలు… సరిదిద్దుకుంటే విజయము మీ సొంతం.. మ‌రి అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for మేష రాశి

మేష రాశి వారు ప్రతి చిన్న విషయానికి అలిగి అవతలి వ్యక్తిని అపార్ధం చేసుకుంటారు. వీరు కాస్త చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.కాని వీరు చేసే ప‌నులు చాలా క‌మ్మిట్ మెంట్ల‌తో చేస్తారు.

వృషభ రాశి వారు ఎదుటి వారి మాటను అసలు వినరు.వీరికి ఏది నచ్చితే అది చేస్తారు. అలాగే మొండి పట్టుదల,కాస్త సోమరితనం ఉంటాయి. కాస్త గర్వం కూడ ఎక్కువే. ఇక కాస్త సొమ‌రులు కూడా ఉంటారు ఇది వ‌దిలేస్తే మ‌రింత బాగుంటుంది వారి జీవితం.

మిధున రాశి ..ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరు అవతలి వ్యక్తులు వింటున్నారనేది చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. దాంతో అవతలి వ్యక్తులు కాస్త ఇబ్బంది పడతారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడ‌తారు ఎవ‌రు ఏమి అనుకుంటారా అనే భ‌యం వీరికి ఉండ‌దు. భయానికి మీనింగ్ తెలియ‌ని వారు అంటే వీరు అని చెప్పాలి. వీరు అందరిని తొందరగా నమ్మేస్తారు.

కర్కాటక రాశి… ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు..ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు. వీరు చాలా పిరికిగా ఉంటారు. కొంద‌రు చాలా సున్నితంగా ఉంటారు. అలాగే ఏమైనా డెసిష‌న్లు తీసుకునే స‌మ‌యంలో వీరు మ‌రింత తొంద‌ర‌గా తీసుకుంటారు.

Image result for కర్కాటక రాశి

సింహ రాశి…ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వారి గురించి వారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా పట్టించుకోకున్నానిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలని ఆలోచన కలిగి ఉంటారు. ఇక వీరు ముఖ్యంగా ఆరోగ్యం పై శ్ర‌ద్ద పెట్టాలి.

కన్యారాశి…ఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. తన వంటి మంచివాళ్ళు ఎక్కడా ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు. దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది. పైగా ఆరంబ‌డాల‌కు వెళ‌తారు.

తుల రాశి..ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు. నిర్ణయం తీసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ధ‌నం వ‌స్తే ఆచితూచి ఖ‌ర్చు చేయ‌రు వేల రూపాయ‌ల‌ని చిల్ల‌ర రూపాయలుగా ఖ‌ర్చు పెడ‌తారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

వృశ్చికరాశి..ఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు..ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. వీరు ఏ ప‌ని అయినా క‌రెక్టుగా చేస్తారు అందుకే రాజ‌కీయాల్లో వ్యాపారాల్లో ఎక్కువ శాతం వీరే ఉంటారు, ధ‌నికులుగా సులువుగా ఈ రాశివారు అవుతారు. క‌ష్ట‌ప‌డే త‌త్వం ఎక్కువ‌, కొత్తద‌నం చూపిస్తారు వీరి నిర్ణ‌యాల‌లో.

ధనుస్సు…ఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు. ప్రతీ చిన్న విషయానికి నిరాశ పొందుతారు.
అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా రాణింపు ఉండదు..

Related image

మకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి కారణం లేకుండానే కోపానికి గురవుతుంటారు. వీరికి కోపం ఆవేశం ఎక్కువ‌
వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.

కుంభరాశి…కుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు. కానీ వారి లోపాల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.
అంతేకాకుండా వీరు అవతలవ్యక్తి చెప్పేది కూడా వినరు. వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.

Image result for మీనరాశి..

మీనరాశి.. ఈమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు. వీరికి స్ధాన చ‌ల‌నం ఎక్కువ ఉద్యోగ వ్యాపారాల్లో చాలా చంచ‌ల‌మైన మ‌న‌సు ఆలోచ‌న క‌లిగి ఉంటారు. వీరు చిన్నచిన్న‌విషయాలకే కుంగిపోతుంటారు.. చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు. ఇతరులపై కుట్రలు పన్నలేరు. ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి వ‌స్తుంది. మ‌రి చూశారుగా ఈ న‌క్ష‌త్రాల రాశుల వారు వారి కోపాలు తాపాలు త‌గ్గించుకుని ఉంటే మంచి జ‌రుగుతుంది అని. ఆవేశం ఉండ‌కూడ‌దు అని చెబుతున్నారు పండితులు. దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.