కాకికి శని ఏ వరం ఇచ్చాడో తెలుసా..? సూర్యుడు కాకికి ఇచ్చిన అద్భుతమైన రెండు వరాలు..!

810

కాకులు పితృదేవతలకి ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు. చాలాకాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి, సూర్య భగవానుడి కోసం తపస్సు చేసింది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

నీకేమి కావాలని ఆ కాకిని సూర్యుడు అడగగా… ఈ సృష్టిలో నాకు చాలా అపఖ్యాతి ఉంది. కాకా అని అరుస్తుంటే నన్ను అందరూ విసుక్కుంటున్నారు.

అందరూ నన్ను తిట్టుకుంటున్నారు. దగ్గరకు రానివడం లేదు అని చెబుతుంది. నాకు కూడా గుర్తింపు వచ్చేలా, నేను కూడా ఎవరికైనా వాహనం అయ్యేలా నన్ను అనుగ్రహించు అని కాకి సూర్యుడిని అడుగుతుంది.

అప్పుడు సూర్యుడు నేను నీకు రెండు వరాలు ఇస్తున్నాను అని చెబుతూ… 1.పితృదేవతలకు  పెట్టె పిండం ఈ రోజు నుంచి నీకు పెట్టు గాకా. కాకులు తింటేనే ఆ ఆహరం చనిపోయిన పితృదేవతలకు చేరాలి అని మొదటి వరం ఇచ్చాడు.

ఇక రెండవ వరం ఏమిటంటే… నా కుమారుడు శనీశ్వరుడు ఉన్నాడు. తనకు వాహనంగా ఉండు అని రెండవ వరం ఇచ్చాడు సూర్యుడు కాకికి. ఇలా కాకికి సూర్యభగవానుడు ఈ రండు వరాలు ఇచ్చాడు.