అనంత పద్మనాభ స్వామి నిధి మిస్టరీ

851

తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి ప్రాచీనమైంది. దీనికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నాటికే ఇదెంతో ప్రాచుర్యం పొందింది. ఆనాటి గ్రంధాల్లో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు. ఈ బారి విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం నుంచి చూస్తే తల భాగం, మధ్య ద్వారం నుంచి చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం నుంచి చూస్తే పాద భాగం కనిపిస్తాయి. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. అయితే ఈ ఆలయం కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తుంది దానికి కారణం అనంత పద్మనాభస్వామి ఆలయంలో దొరికిన నిది.

Image result for అనంత పద్మనాభ

అనంత పద్మనాభ స్వామి ఆలయం, లక్ష కోట్ల విలువైన బంగారంతో దేశంలో అత్యంత ఖరీదైన ఆలయం అనిపించుకుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని అపూర్వ కళాఖండాలను వెలకట్టడం సాధ్యం కాదు. అవి అమూల్యమైనవి. అదలా ఉండగా ఇక్కడి బంగారు రాశులను చూసి అటు అధికారులు, ఇటు భక్తజనానీకమూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ట్రావన్కోర్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు మొదలైన సంపదలతో మహా సుసంపన్నమైంది. నాటి స్థానిక రాజు మార్తాండ వర్మ విలువైన సంపదలు ఎన్నో స్వామివారికి సమర్పించాడు. అనేక శతాబ్దాలుగా మహారాజులు సమర్పించిన బంగారు విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. వజ్రం, గోమేధికం, పుష్యరాగం లాంటి అమూల్య రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు, ఆ విగ్రహాలకు అలంకరించిన కిరీటాలు, హారాలు మొదలైనవి కళ్ళు జిగేల్మనిపించేలా ఉన్నాయి.

Image result for అనంత పద్మనాభ

ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో సుమారు ఐదు లక్షల కోట్ల ఆస్తుల వరకు కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. పూర్వాకాలంలో రాజులు నిధులను భద్రంగా ఉండటం కోసం ఆలయాల్లో దాచే వారని తెలుస్తోంది. ఆలయాల్లో అయితే దేవుడు ఏమైనా చేస్తాడేమోననే భయంతో దొంగిలించడానికి భయపడతారనే ఉద్దేశ్యంతో రాజులు ధనాన్ని ఆలయాల్లో భద్రపరిచే వారని తెలుస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన నిది కూడా అలా రాజులు దాచిపెట్టినదే అని అంటున్నారు. ఆలయంలో దొరికిన నిది విషయానికి వస్తే.. 530 కిలోల బంగారు నాణాలు, అసంఖ్యాకమైన ఆభరణాలు ఉన్నాయి.18 అడుగుల బంగారు ఆభరణం ఏకంగా 35 కిలోల బరువుంది. ఇక బియ్యపు గింజల ఆకృతిలో ఉన్న గొలుసులు, విలువైన వజ్రాలు, రత్నాలతో కూడిన ఆభరణాలు అనేకం ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ, నెపోలియన్ కాలం నాటి బంగారు నాణాలు డబ్బు రూపంలోనే గాక ప్రాచీనత పరంగానూ మహా విలువైనవి. ఆ అపురూపమైన నాణాలు, ఆభరణాల విలువ లక్ష కోట్లు. అమెరికన్ డాలర్లలో చూస్తే 22 బిలియన్ డాలర్లు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే వాటి విలువ అంత ఉండదని ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నప్పటికీ, ఆ సంపద విలువ భారీగానే ఉంటుందనే వారూ ఉన్నారు. ఈ ఐదు గదులలో కంటే ఆరోగదిలో ఇంతకంటే ఎక్కువ సంపద ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆరో గది తెరవకూడదని దానికి నాగబంధం ఉందని భక్తులు, ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నారు. కేరళ ప్రభుత్వం ఆరోనేల మాళిగను తెరవడానికి సిద్ధమైన సందర్భంలో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరో గదిని తాము ఆదేశించే వరకు తెరవకూడదని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆరో గదిక నాగబంధం ఉందని దానిని తెరవకూడదని అది తెరిస్తే అరిష్టం అని భక్తులు హెచ్చరిస్తున్నారు. అయితే హేతువాదులు మాత్రం అది తెరవాల్సిందే అని పట్టుపడుతున్నారు.

Image result for అనంత పద్మనాభ

ప్రభుత్వం గానీ, కోర్టులు గానీ తెరవడానికి సిద్ధంగా లేకుంటే తాము దానిని తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు హేతువాదులు చెబుతున్నారు. ఇప్పుడు పలువురిని పలు ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఆలయం వాస్తు నిధిని సూచిస్తుందా, ఆరో గదికి నాగబంధం ఉన్న నేపథ్యంలో దానిని తెరవగలికే వ్యక్తి ఎవరు, నాగబంధాన్ని చేధించే అస్త్రం సుప్రీంకోర్టు వద్ద ఉందా, ఏ ధీమాతో నాగబంధం చేధించాలనుకుంటున్నారు. నాగబంధాన్ని తెరిస్తే నష్టం అంటున్న ట్రావెన్ కోర్ వంశీయుల వ్యాఖ్యలు నిజమవుతాయా? ఇలా అనేక సందేహాలు భక్తులకు ఉన్నాయి. ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతుండే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పుడు దేశం నలుమూలల నుండీ తరలివస్తోన్న భక్తులతో మరింత రద్దీగా మారింది. దేశంలోనే కాదు, ప్రపంచవాసులంతా ఈ ఖరీదైన పద్మనాభస్వామి గురించి మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఆరవగది ఎప్పుడు తెరుస్తారో, అందులో ఎంత నిది దొరుకుతుందో..