వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యకండి

91

మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పొర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9న రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. శుక్రవారం ఉదయం 6.28 నుంచి 8.45 వరకు సింహలగ్నం, ఈ రెండు గంటల 17 నిమిషాలలో పూజ చేసుకోవచ్చని పండితులు తెలియజేశారు. ఈ ముహూర్తం దాటితే మధ్యాహ్నం 1.21 నుంచి 3.39 మధ్య వృశ్చికలగ్నం ముహూర్తం 2.18 గంటలు, తిరిగి రాత్రి 7.26 నుంచి 8.53 వరకు కుంభలగ్నం 1.28 నిమిషాలు, రాత్రి 11.54 నుంచి 1.49 వరకు వృషభలగ్నంలో పూజచేసుకోవాలని సూచిస్తున్నారు. మహిళలు సంతానం, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఈ వ్రతాన్ని చేస్తారు.

Image result for వరలక్ష్మి

స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానము చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని,గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. లక్ష్మి దేవిని ఈశాన్యం దిక్కున పెట్టి పూజ చేస్తే మంచిది. అందువల్ల ఈశాన్యంలో పద్మం ముగ్గు పెట్టి పూజ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజ చేసే స్థలంలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశం పెట్టాలి. ఒక పళ్లెంలో బియ్యాన్ని పోసి దాని మీద తమలపాకులు వేసి కలశాన్ని పెట్టాలి . కలశంలో మామిడి ఆకులను ఉంచాలి. బియ్యం పోయాలి. పసుపు, గంధంలతో అలంకరణ చేయాలి. దానిపై కొత్త కొబ్బరికాయను పెట్టి దానిపైన కొత్త జాకెట్ ముక్కను పెట్టాలి. ఈ కలశాన్ని మన అభిరుచి మేరకు అలంకరణ చేయవచ్చు. దీపారాధన, పసుపు, కుంకుమ, అగరవత్తులు, కొబ్బరికాయలు, కర్పూరం, అరటి పండ్లు, తమలపాకులు, ఏడు రకాల పువ్వులు, ఏడు రకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి. తొమ్మిది పోగులతో తోరం కట్టి పూజలో పెట్టాలి.. ఆ తర్వాత వినాయకుణ్ణి పసుపుతో తయారుచేసుకోవాలి . వినాయకుణ్ణి కలశం దగ్గర పెట్టి దీపారాధన చేసి ఆచమనం చేయాలి. ఆ తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామం మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత తమ గోత్ర నామాలు చెప్పుకొని సంకల్పం చెప్పకోవాలి. ఆ తర్వాత నీటిని ముట్టుకొని వినాయకునికి షోడశ ఉపచార పూజ చేయాలి. పువ్వులు, అక్షింతలు వేసి ఓం గణపతాయా నమః అని మంత్రమ్ చదివి దూపం ఇవ్వాలి. దీపానికి నమస్కరం చేసి వినాయకునికి బెల్లం ముక్క,అరటిపండు నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పించి మంగళ హారతి ఇవ్వాలి.

తర్వాత వరలక్ష్మి అమ్మవారికి కుంకుమ పెట్టి తొమ్మిది పోగులతో తయారుచేసుకున్న తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోరం మీద పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలను తీసుకోని తొమ్మిది సార్లు పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారి ఫోటో మీద, కలశం మీద, అమ్మవారి రూపు మీద పంచామృతం జల్లాలి. ఆ తర్వాత శుద్ధోదకం జల్లాలి. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ, పువ్వులు, అక్షింతలు సమర్పించి దూపం దీపం పెట్టాలి. ఇలా వలలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చెయ్యాలి. సాయంత్రం ముత్తైదువులను పిలిచి తాంబులం ఇవ్వాలి. అయితే ఇక్కడ ఆడవారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమ ఏమిటంటే.. పూజ ముగిసే వరకు ఏమి తినకూడదు.తిని పూజ చేస్తే అమ్మవారికి మీరు చేసిన పూజ వృధా అవుతుంది. కాబట్టి ఉపవాసంతో ఉండి ఈ పూజ చెయ్యాలి.కాబట్టి ఉపవాసంతో ఉండి ఈ వ్రతాన్ని చెయ్యండి.