శివుడు పార్వతి ఎదుటే మోహినిపై ఎందుకు మోజుపడ్డాడు.. వారిద్దరికీ జన్మించిన బిడ్డ ఎవరో తెలుసా.?

839

శివపార్వతుల గురించి అందరికీ తెలిసిందే. వారి ప్రేమ ఎంతో పవిత్రం. శివుడు ఏకంగా తన శరీరంలో సగ భాగాన్ని పార్వతికే ఇచ్చాడు. అంత ప్రేమ వారిది. మరి ముక్కంటి మరో ఆమెపై మోజు పడ్డాడంటే నమ్మలేము. కానీ నమ్మక తప్పదు.ఎందుకంటే అది నిజం కాబట్టి.శివుడు కూడా ఇతర అమ్మాయి మోజులో పడ్డాడు.మోహిని అందం చూసి పరమశివుడు పరవశించాడు. దేవుళ్లు కూడా అలా చేస్తారా? అంటే కొన్ని కారణాల వల్ల, లోకకల్యాణార్థం దేవుళ్లు అలా చేస్తారు.అయితే శివుడు ఆమె మోజులో పడడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందామా.

పురాణాల్లో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు.భస్మాసురుడు మహాశివుడి ద్వారా ఒక వరం పొందుతాడు. తనకు ఎవరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. అలాగే తను చెయ్యి పెడితే చాలు భస్మం కావాలని కోరుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో శివుడు కూడా ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.దీంతో భస్మాసురుడు అన్ని లోకాలను వారిని గడగడలాడించాడు.దేవతలంతా ముక్కంటి దగ్గరకు వెళ్లారు.శివా నువ్వే మమ్మల్ని రక్షించాలని కోరారు.శివుడు భస్మాసురుడి దగ్గరకు వెళ్లి బుజ్జగించాలని చూశాడు. శివుణ్ని కూడా భస్మం చెయ్యడానికి చెయ్యి ఎత్తాడు భస్మాసురుడు. వామ్మో ఇది ఏందో కొంచెం తేడాగా ఉందని అనుకున్నాడు శివుడు.

వీనికి నేను వరం ఇస్తే నన్నే భస్మం చేయాలనుకుంటాడా అని అనుకున్నాడు.ఇక లాభం లేదు వీన్ని అంతం చెయ్యాల్సిందే అనుకున్నాడు. విష్ణు మూర్తి దగ్గరకి వెళ్లి ఆలోచించాడు. ఎలా అయినా సరే భస్మాసురుడిని అంతం చెయ్యాలనుకుంటున్నానని చెబుతాడు.భస్మాసురుడిని అంతం చేసేందుకు మహావిష్ణువే మోహినిగా అవతరిస్తాడు.పాల కడలి వల్ల రాక్షసులకే అమృతం అభిస్తుంది. మోహినీ తన అందచందాలను చూపించి అసురుల నుంచి అమృతాన్ని తీసుకొస్తుంది.

ఇక మోహినిని చూసిన భస్మాసురుడు ఆమెపై మోజు పడతాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. సరే, కానీ నాకు నాట్యం అంటే ఇష్టం. నేను అలా చేస్తే నువ్వు అలా చేస్తే పెళ్లి చేసుకుంటాం అంటుంది మోహిని.ఇక మోహిని నాట్యం చూసి భస్మారుడు మైమరిచిపోతాడు. మోహిని ఎలా చేస్తే అలా చేస్తూ తన తలపైనే చెయ్యిపెట్టకుని చనిపోతాడు భస్మాసురుడు. అలా తన చావును తానే కొనితెచ్చుకుంటాడు భస్మాసురుడు.అంత వరకు శివుడు, విష్ణువు వేసుకున్న ప్లాన్ మొత్తం ఒకే అయిపోయింది. అయితే మళ్లీ శివుడు మోహిని అందాన్ని చూడాలనుకుంటాడు.సరే అని విష్ణువు మోహినిగా వస్తాడు. మోహిని అందంపై మోజుపడతాడు శివుడు. మోహినిని తన కౌగిళ్లలోకి తీసుకుని బంధిస్తాడు. ఆమెతో రాసక్రీడ సాగిస్తాడు. దీంతో మోహినికి, శివుడికి శ్రీ ధర్మశాస్తా పుడతాడు. మహిషి సంహరణ కోసమే శివుడు అలా చేస్తాడు. లోక కల్యాణార్థం శివుడు చేసిన ఈ పనిని చూసిన గమనించిన పార్వతి కాస్త శివుడిపై అలుగుతుంది. కానీ తర్వాత మళ్లీ శివుడు అసలు విషయం చెప్పేసరికి అర్థం చేసుకుంటుంది.దాంతో ఇద్దరి మద్య ఉన్న అపార్థం తీరిపోతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.