హనుమంతుడిని నాగవల్లి ప్రియుడు అని ఎందుకంటారో తెలుసా.?

201

హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు . కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఒక్కటి హనుమంతుడు. ఆంజనేయుడు వసంత ఋతువు, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిధీ, శనివారము నాడూ, పూర్వాభాధ్రా నక్షత్రమున మధ్యాహ్నం పూట అంజనీదేవికి పుట్టాడు. వాయుదేవుని ద్వారా అంజనాదేవి అనే వానరకాంతకు జన్మించాడు. అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అన్న పేరు కూడా ఉంది..అయితే ఆంజనేయుడిని నాగవల్లి ప్రియుడు అని కూడా అంటారు. మరి ఎందుకంటారు.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రింద వీడియోని చూడండి

ఆంజనేయుడు నాగవల్లి ప్రియుడు. నాగవల్లి అనగా పాము పడగ వంటి ఆకారము కలిగిన దళములు తమలపాకులు. ఇవి ఆయనకు ఎందుకిష్టమంటే…. దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన సమయంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, లక్ష్మీదేవి, కుశలు, కాలకూట విషము, అమృతముతో పాటు నాగవల్లి పత్రములు గూడ ఉధ్భవించినాయంట. ఆ ఆకులు సేవించటం ఆరోగ్యానికి మంచిది.. తమలపాకులను జన్మలో ఒక్కసారైనా నమలని జన్మ బహుశా వుండదని వేమన శతకంలో వివరించెను. జీర్ణశక్తి, ఎముకల పుష్టి, వీర్యవృధ్ధి, ఆకలి కలిగించుట, జఠరాగ్ని రగిలించుట, పైత్యం, అరుచి మొదలైన ఔషధాలన్నీ తమలపాకుల్లో ఉన్నాయి. అందువలన తమలపాకులతో ఆంజేయునికి దళార్చన చేయాలనుకునే వారు మూలం క్రింద వుండే విధంగా, దళ పై భాగం ఉండేటట్టు ఉంచి పూజించాలీ.. భక్తులు భగవంతునకు ఆకూ, పుష్పం, ఫలంలను భక్తితో సమర్పించుట మంచిది. ఆంజనేయుని శరీరం ఆకుపచ్చ రంగులో ఉండును. కాబట్టి తమలపాకులతో స్వామిని అర్చిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

Image result for sri hanuman

అయితే ఆంజనేయుడికి తమలపాకు అంటే ఎందుకు ఇష్టమో తెలిపే మరొక కథ ఉంది. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. దాంతో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం రామునితో చెప్పాలని లంక నుండి బయలుదేరతాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే అశోకవనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దానితో పుష్పాలకు బదులు తమలపాకును కోసి, ఆంజనేయ స్వామి తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే తమలపాకు ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనది. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుండి తిరిగ వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు హనుమంతుడు. అది విన్న వానరులకు విషయం అర్దమైపోతుంది. హనుమంతుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయికళ్లతో ఎదురుచూస్తారు. అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లనే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడు. ఆంజనేయ స్వామి జ్యోతి స్వరూపుడు. ఆయనను పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకు మాలను సమర్పిస్తే మనోబీష్టాలు నెరవేరుతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణ చేస్తే సర్వసంపదలూ, సుఖసంతోషాలు కలుగుతాయి.