గురు పూర్ణిమ అంటే ఏమిటి..గురు పూర్ణిమ గురించి తెలుసుకోండి.

556

జులై 27 వ తేదిన చంద్ర గ్రహనం ఉందని మన అందరికి తెలిసినదే.అయితే ఇదే రోజు గురు పౌర్ణమి కూడా వచ్చింది.అసలు మీకు గురు పౌర్ణమి అంటే ఏమిటో తెలుసా..ఆరోజును ఎందుకు సెలెబ్రేట్ చేసుకుంటారో తెలుసా..అసలు ఆరోజు మనం మన గురువులను ఎందుకు పూజించాలో మీకు తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Image result for guru purnima sai baba

వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో పూజలు జరుగుతాయి. కొత్త అంగ వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలు ఉంచాలి. ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. పూజ అయిన తర్వాత తలా ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్ళలోని బియ్యంలో కలుపుకుంటారు.గురువులను ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు.వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు.విన్నారుగా గురు పౌర్ణమి విశేషాలు.మరి గురు పౌర్ణమి గురించి దాని విశిష్టత గురించి అలాగే ఈరోజు చెయ్యాల్సిన పనుల గురించి మీ అభిప్రాయాలన్నిటిని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.