వినాయకచవితి రోజు ఇలా పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారమే.

498

సకల దేవతగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలి పూజ గణనాధునికే. ఆయన అనుగ్రహాం పొందితే అన్ని కార్యం జయమవుతుంది. హిందూ సంప్రదాయాల్లో అతి పెద్దదైన, ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ పండుగ తర్వాతనే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.అయితే ఈ పండుగ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి.ఎలా పూజిస్తే ఆ గణేషుడికి కటాక్షం మన మీద ఉంటుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు చెప్తాను విని తెలుసుకోండి.

Image result for vinayaka pooja

శ్వేతార్కంలో ‘శ్వేతం’ అంటే తెలుపు వర్ణం, ‘అర్క’ అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి అని అర్థం.శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభం కలుగుతుంది.ఎవరైతే శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్టించి పూజించాలి. శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకు నేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి. వినాయక చవితి పండుగ రోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి.

Image result for vinayaka pooja

పూజా విధానము
తెల్లజిల్లేడు చెట్టు 45 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున వేరును స్వీకరించాలి. శ్వేతార్క మూల గణపతిని శుద్ధమైన నీటితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణ గా సమర్పించి తర్వాత ఈ దిగువ మంత్రాలతో గణేశునికి పూజ చేయాలి.
ఓం గం గణపతయే నమః
ఓం గ్లౌం గణపతయే నమః
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ ఫాలచంద్రాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం లంబోదరాయ నమః

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మంత్ర జప ఆరంభానికి ముందే ఎన్ని సార్లు మంత్ర పఠనం చేసేది సంకల్పం చెప్పుకోవాలి. మంత్ర జపం చేసే సమయంలో ఎర్రని జప మాల, రుదక్ష్రమాల వాడడం మంచిది. ప్రతి జపమాలలోనూ 108 గింజలు ఉంటాయి. ఒకసారి అన్ని గింజలు లెక్కిస్తూ పూజ చేస్తే 108 సార్లు జపం చేసినట్టవుతుంది. అలా పది సార్లు జపమాల చేయడమంటే 1000 సార్లు నామ జపం అవుతుంది. ఈ విధంగా ఎన్ని జపమాలలు పూజ చేయాలనుకుంటారో ఆ ప్రకారం చేయాలి. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.ముఖ్యంగా వినాయక చవితి రోజున ఈ శ్వేతార్క గణపతిని పూజిస్తే ఇక మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలగడం ఖాయం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.వినాయక చవితి గురించి ఆ రోజు ఇలా శ్వేతార్క గణపతిని పూజిస్తే కలిగే మంచి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.