రాక్షసుడు ప్రతిష్టించిన శివలింగం ఇక్కడ ఏం చేస్తారో తప్పక తెలుసుకోండి

403

భారత దేశం దేవాలయాల నిలయమని ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పురాణ ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి దేవాలయం ఒకటి మ‌న ద‌క్షిణ భార‌త దేశంలో ఉంది. ముఖ్యంగా శివాల‌యాల‌లో ఈ ప్రాముఖ్య‌త చాలా ఎక్కువ‌గా ఉంటుంది అదే ప్రాముఖ్య‌త మ‌న కేర‌ళ‌లో ఉన్న దేవాల‌యంలో ఉంది..మ‌రి ఆ దేవాలయం ఏమిటి ? దాని ప్రాముఖ్య‌త ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం.కేరళలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొట్టాయంకు 40 కిలోమీటర్ల దూరంలో ఈ వైకోం అనే చోట, వైకోమ్ మహాదేవ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించి చాలా మందికి ఆ రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రమే తెలుసు. మ‌రి మీరు ఈ దేవాల‌యం చ‌రిత్ర విశిష్ట‌త తెలుసుకోండి.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో వైకోమ్ మహాదేవ ఆల‌యం ఒకటి. ఎర్నాకుళం కి 33 కిలోమీటర్ల దూరంలో ఈ ఆల‌యం ఉంది..ఎర్నాకులం మరియు తిరువనంత‌పురం మధ్య రైలు మార్గంలో కొట్టాయంకు 40 కిలోమీటర్ల దూరంలో వైకోం అనే ప్రాంతం ఉంది.
ఇక్కడ కొలువై ఉన్న శివుడిని అన్నదాన ప్రభువు అని అంటారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే, ఇక్కడ ఉదయం పూట దక్షిణామూర్తిగా పూజలు అందుకునే పరమశివుడు, సాయంత్రం మాత్రం కిరాతక మూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా, ఇది వాస్త‌వం. మ‌రి దానికి కార‌ణం కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ
పురాణాలను అనుసరించి పూర్వం ఖరా అనే రాక్షసుడు ఉండేవాడు… అతను శివుడి పరమ భక్తుడు. ఇతను చిదంబరంలో శివుడి గురించి ఘోర తపస్సు చేసి అతని నుంచి మూడు శివలింగాలను పొందుతాడు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క శివలింగాన్ని ఉంచుకొని మరో శివలింగాన్ని నోటిలో కరుచుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అతడు వైకోమ్ వద్దకు రాగానే ప్రయాణం ఎక్కువ సేపు చేయ‌డం వల్ల కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటాడు.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

అప్పుడు అతని నోటిలో ఉన్న శివలింగం భూమిని తాకి అక్కడే ప్రతిష్టించబడుతుంది. ఇక రెండు చేతుల్లో ఉన్న రెండు శివలింగాలను ఎట్టుమన్నూర్, కాడుతత్తూర్‌లో ప్రతిష్టించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అటు పై ఈ మూడు ప్రాంతాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా మారిపోయాయి.. పరుశురాముడు కూడా ఈ ఆలయంలోని పరమశివుడిని ఆరాధించినట్లు స్థానిక క‌థ‌నం తెలియ‌చేస్తోంది. ఈ ఆలయ భవనం 11 వ శతాబ్దానికి చెందినది, మరియు చెక్క పలకలు మరియు కుడ్యచిత్రాలు వరుసగా 15 మరియు 18 వ శతాబ్దానికి చెందినవి. లోపలి ప్రాకారం యొక్క గోడ చెక్క చట్రంపై నిలువు వరుసలతో కప్పబడి ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ దేవాలయంలో ప్రతిరోజూ ఐదు సార్లు పూజలు జరుపుతారు. అదేవిధంగా పర్వదినాల్లో సంగీతం, నృత్య ప్రదర్శనలను కొనసాగిస్తారు. ఏడాదికి ఒకసారి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవంలో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. మ‌రి చూశారుగా ఈ దేవాల‌యాన్ని మీరు కూడా ఎప్పుడైనా సంద‌ర్శించండి. ఇలాంటి ఇంట్ర‌స్టింగ్ వీడియోల కోసం మా ఛాన‌ల్ ని స‌బ్ స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.