లక్షమందికి ప్రతి రోజు అన్నదానం జరిగే తిరుమల వంటశాల రహస్యాలు ప్రతివొక్కరు తెలుసుకోవాలి

671

అన్నం పరబ్రహ్మ స్వరూపం…. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. ఇక గ‌తంలో ఇలా అన్న‌దానం కొన్ని ప్రాంతాల‌లో రాజుల కాలంలో చేసేవారు.. ఇప్పుడుత‌రాలు మారి దేవాల‌యాల్లో నిత్య అన్న‌దానం జ‌రుగుతోంది .

Image result for tirumala annadanam

క‌ర్నాట‌కా లోని ధ‌ర్మ‌స్ధ‌లం శ్రీమంజునాధుని యొక్క ఆల‌యం ప్ర‌సిద్ది.. అంతేకాదు అక్క‌డ అన్న‌దానం కూడా ఎంతో సుష్టిగా, వ‌చ్చిన వారికి ప్ర‌సాదంలేదు అన‌కుండా పెడ‌తారు.. మ‌రి ఇక్క‌డ స్వామి ప్ర‌సాదం రుచికే కాదు శుభ్ర‌త‌కు కూడా పెట్టింది పేరు అని చెబుతారు ఇక్క‌డ భ‌క్తులు.. మ‌రి ఆదేవాల‌యం గురించి అక్క‌డ నిత్య అన్న‌దాన కార్య‌క్ర‌మం గురించి తెలుసుకుందాం.హెగ్దే వంశ‌స్తులు ఇక్క‌డ 1950లో నిత్య అన్న‌దాన కార్య‌క్ర‌మం ప్రారంభించారు.. రోజు వంద మంద‌కి నిత్యం అన్నదానం చేసేవారు.. ఇలా స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య రోజు పెర‌గ‌డంతో ఇక్క‌డ అన్న‌దానం కూడా రోజు రోజుకు పెంచారు. వ‌చ్చిన వారికి లేదు అన‌కుండా ప్ర‌సాదం పెట్టేవారు… ఆల‌య అధికారులు చెప్పేదాని ప్ర‌కారం ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కూ నిత్య అన్న‌దానం జ‌రుగుతుంది. రోజుకు 25 వేల నుంచి 50 వేల మంది భోజ‌నం చేస్తారు, ఇక్క‌డ కార్తిక దీపోత్స‌వం సోమ‌వారాలు అలాగే పండుగ‌ల స‌మ‌యంలో ల‌క్ష మందికి పైనే వ‌చ్చి స్వామి ప్ర‌సాదం తీసుకుంటారట‌.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్క‌డ ప్ర‌సాదానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది.. ఇక్క‌డ రుచికే కాదు శుచికి శుభ్ర‌త‌కు పెట్టింది పేరు.. ఇక్క‌డ వంట వారు హై టెక్నాల‌జీతో కూడిన సామాన్ల‌తో వంట‌లు వండుతారు.. గంట‌లో ఎంత మందికి అయినా వంట త‌యారు చేస్తారు, ఇక్క‌డ పాక‌శాస్త్ర నిపుణులు… రోజుకి 5 వేల క్వింటాళ్ల రైస్, అలాగే 2 క్వింటాళ్ల కందిప‌ప్పు ఉప‌యోగిస్తారు.. ఇక్క‌డ సాంబార్ ప్ర‌జ‌లు ఎంతో ఇష్టంగా భుజిస్తారు, ఇక దీపోత్స‌వం రోజున సుమారు 8500 క్వింటాళ్ల రైస్ వండి రికార్డు సృష్టించారు. అలాగే 3500 కిలోల వెజిటేబుల్స్ రోజు ఇక్క‌డ వంట‌కు వాడ‌తారు.. స్వామి దర్శ‌నం చేసుకుని వ‌చ్చిన వారికి ఆహారం అందించేందుకు ఇక్క‌డ ఓ పెద్ద డైనింగ్ హాల్ ఉంది.. ఇక్క‌డ 9 వ‌రుస‌లు ఉంటాయి. ఒక్కో వ‌రుస‌లో 400 మంది కూర్చుని భోజ‌నం చేస్తారు. ఈ ఆల‌యం హ‌స‌న్ ద‌గ్గ‌ర్లో ఉంది ..ఈసారి మీరు కూడా అలా వెళితే స్వామి దర్శ‌నం చేసుకుని ప్ర‌సాదం స్వీక‌రించండి, మ‌రి చూశారుగా ధ‌ర్మ‌స్ధల ఆల‌యం గురించి, మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.