నాసా సైంటిస్ట్ లకే చెమటలు: ఈ గుడిలో జరిగే అధ్బుతం తెలిస్తే షాక్!

477

మన దేశం దేవుళ్ళకు వాళ్ళ విశిష్టతకు పుట్టినిల్లు.మన దేశంలో ఎంతో ఖ్యాతి ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.వాటి పురాతన గుళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు.వాటి నిర్మాణం అప్పటి కాలంలో ఉపయోగించిన పద్ధతి టెక్నాలజీ లేని కాలంలో వారు గుడిని నిర్మించిన విధానం ఇప్పటికాలం వాళ్ళను కూడా బాగా ఆకర్షిస్తుంది.అలాంటి ఒక ఆలయం ప్రత్యేకత గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.మరి విని తెలుసుకోడానికి మీరు సిద్దంగా ఉన్నారా.

Image result for ramappa temple

రామప్ప దేవాలయం..ఈ పేరు వినగానే ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం అని గుర్తుకు వస్తుంది.ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం.800 ఏళ్ల నాటి రామప్ప ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయంలోని వింతలు విశేషాలు పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ‘రామప్ప’ అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదు.ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు.సాధారణంగా ఆలయాల్లోని గర్భాలయాల్లో వెలుతురు తక్కువగా ఉంటుంది. కానీ, రామప్ప ఆలయంలోని గర్భాలయంలో రాత్రివేళల్లో మినహా రోజంతా వెలుతురు ఉంటుంది. ఇందుకు ఆలయంలో నిర్మించిన స్తంభాలే కారణం.

Image result for ramappa temple

బయట ఉండే కాంతి నునుపైన స్తంభాలపై పరివర్తనం చెంది గర్భాలయంలో పడటం వల్ల ఆ వెలుతురు వస్తుంది. అంతేకాదు, ఈ ఆలయంలో ఉండే నందీశ్వరుడిని ఎటువైపు నుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది.ఈ శివాలయాన్ని క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు కట్టించారని ఇక్కడ దొరికిన రాతిశాసనాల్లో ఉంది. ఈ ఆలయం నిర్మాణం పూర్తికావడానికి 40 ఏళ్లు పట్టిందట. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అద్భుత శిల్పకళ కట్టిపడేస్తుంది. ఈ ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు.. నీళ్లలో వేస్తే తేలుతాయట.ఈ ఆలయంలో శిల్పకళ విశిష్టతను తెలిపే మరో అద్భుతం.. సప్తస్వరాలు పలికే శిల్పం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉండే శిల్పాన్ని వేళ్లతో మీటితే సరిగమపదనిసలు పలుకుతుంది. మరో శిల్పంలో ముగ్గురు వ్యక్తులకు కలిపి.. నాలుగు కాళ్లు ఉంటాయి. ఈ విగ్రహాన్ని చూడగానే కాసేపు అక్కడే ఆగిపోతాం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాకతీయుల నాటి అద్భుత సాంకేతిక నైపుణ్యం గురించి తెలపడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం ఉంటుంది చెప్పండి.రామప్ప ఆలయానికి ఇరువైపులా కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం నక్షత్రాకారం గద్దెపై ఉంది. ఆలయం చుట్టూ చెక్కిన 526 ఏనుగు విగ్రహాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఆలయం లోపల గల నల్ల రాతి స్తంభాలపై మలచిన పురాణగాథల శిల్పాలు అద్భుతహా అనిపిస్తాయి. గోపికా వస్త్రాపహరణం మొదలుకుని నరకాశుర వధ వరకు ఎన్నో గాథలను ఈ రాతి స్తంభాలపై చూడొచ్చు.విన్నారుగా కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయ విశిష్టతలు.మరి ఈ దేవాలయం గురించి మీరేమనుకుంటున్నారు.మన దేశంలో ఉన్న పురాతన ఆలయాల గురించి వాటి విశిష్టతల గురించి అలాగే రామప్ప ఆలయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.