అధ్బుతం: షిరిడి లో తన సమాధి దగ్గర ప్రత్యక్షమైన బాబా.. భక్తులు పరుగులు

1519

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన దేవుడు సాయిబాబా.శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు.హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యుడు.అయితే చాలా మంది దేవుడు లేడు ఎవరు లేరు అని అంటుంటారు.అలాంటి వారి కోసమే నేను ఉన్నాను అని దేవుడు కొన్ని కొన్ని సంఘటనలను చూపిస్తాడు.అలాంటి ఒక సంఘటన గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Related image

సాయి భగవాన్‌ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు.షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన వున్న గురుస్థానంలో ఆయన కూర్చొనివుండేవారు. భగవుంతునికి ఎలాంటి పేర్లు వుండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు.స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధినుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్యవ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజనక్షేత్రంగా మారిపోయింది.

Related image

బాబా భక్తులలో నాగ్‌పూర్‌కు చెందిన గోపాల్‌రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం.అయితే షిర్డీలోని ద్వారకామయి ఆలయంలోని ఓ గోడపై సాయిబాబా రూపం దర్శనమిచ్చింది.ఓ భక్తుడు చెప్పడంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. బుధవారం అర్థరాత్రి నుంచి బాబా రూపం కనిపించిందనే సమాచారంతో ఈ ఆకృతిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 వరకు దాదాపు నాలుగు గంటలపాటు సాయిరూపం గోడపై కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

వారిని అదుపుచేయడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సాక్షాత్తు షిర్డీ సాయి నిజరూప దర్శనం తమకు కలిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సాయిని ప్రత్యక్ష రూపంలో దర్శించకునే అదృష్టం దక్కిందని తెగ సంతోషపడిపోతున్నారు. అయితే దీనిపై షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరికొద్ది రోజుల్లో సాయిబాబా సమాధిలోకి వెళ్లి 100 ఏళ్లు పూర్తికాబోతున్న సమయంలో ఇలా దర్శనం ఇవ్వడం ఆయన మహిమలకు నిదర్శనం అని అంటున్నారు.మరి సాయిబాబా దర్శనం గురించి అలాగే ఆయన మహిమల గురించి షిర్డీ పవిత్రత గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.