ఈరోజు సూర్య గ్రహణం అమావాస్య.. ఈ తప్పులు ఎవ్వరూ చెయ్యకండి

398

భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడతుంది. ఆ సమయంలో చంద్రుడి నీడ సూర్యుడిపై పడటం వల్ల చీకటి అలుముకుంటుంది. చంద్రుడి నీడ సూర్యుడిని పూర్తిగా ఆవహించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో ప్రకాశవంతుడైన సూర్యుడు ఒక సన్నటి అంచులా కనిపిస్తాడు. అలాంటప్పుడు ఉష్ణోగ్రత కూడా గణనీయంగా పడిపోతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది.సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉండక సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటే ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. ఆగస్టు 11 న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది.

Image result for lunar eclipse

శనివారం మధ్యాహ్నం 1.32 గంటలకు మొదలై సాయంత్రం 5.02 గంటల వరకు దాదాపు మూడున్నర గంటలు ఈ గ్రహణం ఆకాశంలో కనువిందు చేయనుంది.అయితే ఇది ఉత్తరార్థగోళంలోని ముఖ్య ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది. భారత్‌లో దీని ప్రభావం ఉండదు.. అయితే ఈ గ్రహణ సమయంలోకొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు అంట.మరి ఎలాంటి పనులు చెయ్యకూడదో తెలుసుకుందామా.గ్రహణం ఉండే సమయంలో పెళ్లి చూపులు, గృహ ప్రవేశాలు,ఉప నయనం,నూతన విగ్రహ ప్రతిష్ట ,నూతన వధువు ప్రవేశం, కొత్త వాహనం కొనుగోలు చెయ్యడం, బావులు బోర్లు లాంటివి తవ్వించడం ,పుట్టు వెంట్రుకలు తీయడం,చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి అస్సలు చెయ్యకూడదు.గర్భిణీ స్త్రీలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

Related image

గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయానికి అరగంట ముందు వరకు కూడా తినవచ్చు,ద్రవ పదార్ధాలు త్రాగవచ్చు.అయితే గ్రహణ సమయంలో చలనం లేకుండా పడుకోవటం మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ప్రశాంతంగా పడుకోవటం కానీ దైవ నామ స్మరణ చేయటం కానీ చేస్తే గర్భిణీ స్త్రీలకు మరియు కడుపులో పెరుగుతున్న శిశువుకు చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు అనవసరంగా తిరగకూడదు, అనవసరంగా ఆహార పదార్ధలను తినకూడదు,అనవసరంగా పనికిరాని విషయాలను మాట్లాడకూడదు.అలా చేస్తే విపరీతమైన చర్యలు,బుద్ది కలిగిన వారు పుట్టే అవకాశం ఉంది. అందువల్ల గ్రహణ సమయంలో తిరగకుండా ప్రశాంతంగా ఉంటే పుట్టే సంతానం బాగుంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే ఎట్టి పరిస్థితిలో ఎవరైనా సరే గ్రహణాన్ని చూడకూడదు.చూస్తే వివిధ రకాల దోషాలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి గ్రహణాన్ని చూడకుండా ఉంటె మంచిది.కాబట్టి ఈ పనులన్నీ అస్సలు చెయ్యకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.గ్రహణం రోజు ఈ పనులు చేస్తే కీడు జరుగుతుంది అని అనుకుంటున్నారా.గ్రహణం రోజు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.