తిరుమల తిరుపతి ఆలయాన్ని ఆగస్టు 11 నుంచి మూసేస్తున్నారు, మూసివేసినప్పుడు లోపల ఏం చేస్తారో తెలుసా.

537

హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రాలలో అత్యంత పేరు గాంచినది తిరుమల తిరుపతి దేవస్థానం అనే చెప్పుకోవాలి.ఇక్కడ వెంకటేశ్వర స్వామీ కొలువై ఉన్నాడని మన అందరికి తెలిసిందే.తిరుమల వేంకటేశ్వరస్వామివారు పద్మావతి అమ్మవారి కోరిక మేరకు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చారని పురాణాలు మనకు చెబుతున్నాయి.కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగానే మనసు పరవశానికి లోనవుతుంది.అయితే నిత్యం పూజలు అందుకునే ఈ ఆలయం ఇప్పుడు మూసేస్తునారు.మరి ఎందుకు మూసేస్తున్నారో కారణం తెలుసుకుందామా.

Related image

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా ఆలయాన్ని ఎక్కువ రోజులు మూసివేయనున్నారు. టీటీడీ ఆలయాన్ని ఆగస్టు 11 వతేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 17 వ తేదీ వరకు మూసివేయనున్నారు.తిరుపతి ఆలయంలో అష్ట బంధన బాలా లయ సంప్రోక్షణ చేపడుతున్న కారణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.1958లో దీన్ని ప్రారంభించారు. 2006 తర్వాత మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆగస్టు 10వ తేదీ స్వామివారి దర్శనం ఉన్నా కూడా అప్పటి వరకు క్యూ లైన్ లో ఉండే వారికి మాత్రమే ఉంటుంది. ఆగస్టు 17వ తేదీన ఉదయం 6 నుంచి మళ్లీ స్వామి వారి దర్శనం ఉంటుంది.ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహా సంప్రోక్షణ అనే పవిత్రమైన కార్యక్రమం చేస్తారు.

Image result for tirumala tirupati

ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించే పూజారులు మాత్రమే ఆ సమయంలో ఆలయంలోనే ఉంటారు.తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయాన్ని కొన్ని రోజుల పాటు మూసి వేస్తున్నామని అధికారికంగా ప్రకటించడంతో కొండపైకి వెళ్లే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. రోజూ లక్షలాది మందికి ఆలయాన్నిసందర్శిస్తున్నారుమహా సంప్రోక్షణలో భాగంగా దేవస్థానం అన్ని రకాల సేవల్ని కూడా నిలిపివేసింది. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు జయ విజయలను దాటనివ్వరు. అలాగే ఆలయ సిబ్బందినీ రాములోరి మేడ వరకే అనుమతిస్తారు.మహా సంప్రోక్షణలో భాగంగా ఆలయంలో కొన్ని మరమ్మతులు కూడా చేస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చాలా రకాల పూజలు కూడా నిర్వహిస్తారు.ఇందులో అష్టబంధనం కార్యక్రమం చాలా ముఖ్యమైనది. వందలాది రుత్వికులు, వేద పండితులు, వేద విద్యార్థులతో నిర్వహించే కొన్ని కార్యక్రమాలను చూసే భాగ్యం ఉండదు కానీ వేదమంత్రాలతో దిక్కులు పెక్కటిళ్లుతాయి. శ్రీవారిని కుంభంలోకి ఆహ్వానించడం కీలకఘట్టం. కుంభానికి శక్తి నింపడం, చివరి రోజున కుంభాన్ని తిరిగి స్వామి లోకి పంపడం మహా సంప్రోక్షణలో కీలక ఘట్టాలు. మనకు ఇవన్నీ చూసే భాగ్యం ఉండదు.కాబట్టి మీరు ఆగస్టు 10 నుంచి 17 వ తేదీల మధ్యలో తిరుమలకు వెళ్లాలనుకుంటే మాత్రం మీ పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తిరుమల గుడిని మూసివేయడం గురించి అలాగే 12 ఏళ్లకు ఒకసారి జరిపే ఈ అష్ట బంధన బాలా లయ సంప్రోక్షణ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.