తిరుమల కొండపై మహా అద్బుతం మూడేళ్ల చిన్నారిని కాపాడిన స్వామి

1202

తిరుమలకు స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.. ముఖ్యంగా స్వామి దర్శనం కోసం 72 గంటలు కూడా క్యూలో నిల్చుని ఉంటారు.. ఇక సెక్యూరిటీ విషయంలో కూడా తిరుమల చాలా కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉంటుంది.. నిత్యం భక్తులతో కటకటలాడే దేవాలయం కావడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా తితిదే అధికారులు పోలీసులు పలు జాగ్రత్తలు కట్టుదిట్టమైన భద్రత చేపడతారు.. ఇక తిరుమల పేరు చెబితే నడక దారి గుర్తు వస్తుంది. లేదా ఘాట్ రోడ్డు గుర్తు వస్తుంది. ప్రభుత్వాలు ఘాట్ రోడ్లు ఏర్పాటు చేసినా చాలా మంది స్వామిని నడిచి వెళ్లి దర్శించుకోవడానికి ఇష్టపడతారు. తాము కోరిన కోర్కెలు తీర్చే భగవంతుడు తిరుమలేశుడు అని అంటారు.. అందుకే స్వామిని అలాగే దర్శించుకుంటారు. నడక దారిలో వెళ్లే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తారు వైకుంఠం కాంప్లెక్సులో కూడా దర్శనానికి ముందుకు వెళతారు.

Related image

ఇక మెట్లపై నడిచి వెళ్లే సమయంలో సెక్యూరిటి అనేక జాగ్రత్తలు చెబుతారు.. కాని ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. తాజాగా తిరుమలలో జరిగిన ఓ అద్బుతం ఇప్పుడు అందరూ చర్చించుకునేలా సాగుతోంది. తిరుమల స్వామిని దర్శించుకోవడానికి తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం తిరుమల వెళ్లారు.. ఈ సమయంలో తిరుమలలో మెట్ల మార్గం ద్వారా వెళుతున్నారు. అనుకోకుండా బాబు పైనుంచి మెట్ల పై నుంచి జారి పడిపోయాడు.. దాదాపు 120 మెట్ల వరకూ జారిపడిపోయాడు. అక్కడ ఉన్న భక్తులు కూడా అందరూ బాబుకి ఏమౌతుంది అని కంగారు పడ్డారు.. తల్లి దండ్రులకు ప్రాణాలు పోయినంత పని అయింది.కాని అద్రష్టవశాత్తు ఆబాబుకి చిన్నదెబ్బ కూడా తగలకుండా బయటపడ్డాడు.

ఈ క్రింద వీడియో చూడండి

మెట్ల మార్గం దగ్గర దర్శనానికి వెళుతున్న సమయంలో చిన్న సంఘటన జరిగినా పోలీసులకు తెలుస్తుంది అయితే బాబుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని ఈ విషయం పైన అధికారులకు తెలియచేయలేదు.. అయితే ఆ కుటుంబం వారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్వామిని దర్శించుకుని ముగ్గురు కూడా తలనీలాలు సమర్పించారు.. పెళ్లి అయిన 15 సంవత్సరాలకు బాబు పుట్టాడని, మా బాబు ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి వెంకన్న స్వామి కారణం అని చెప్పారు ఆ తల్లిదండ్రులు.. ముఖ్యంగా ఆ బాబు పేరు కూడా వెంకట్ అని స్వామి వారి పేరు పెట్టుకున్నామని అందుకే మా బాబు కూడా స్వామి లీలతో ఎలాంటి ప్రమాదం లేకుండా ఉన్నాడు అని తెలియచేశారు. నిజంగా ఇదంతా చూస్తుంటే స్వామిలీల అని చెబుతున్నారు అక్కడభక్తులు. మరి దీనిపై మీరేమంటారు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి..ఓం నమోవెంకటేశాయ నమ: