మన దేశ చరిత్రలో అద్భుతం..ఈ గుడిలో శివలింగం చేస్తున్న మహాద్భుతం చూసి తీరాల్సిందే.

362

శివలింగం అనేది శివుడిని పూజించడానికి ఉపయోగించే ఒక పవిత్ర చిహ్నం.లింగాన్ని పూజిస్తే సాక్షాత్తు శివుడ్ని పూజించినట్టే. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని శివ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే ఆ శివ క్షేత్రాల్లో ఉండే శివలింగాలు కూడా ఒక్కొక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క క్షేత్రంలో లింగం ఒక్కొక్క రూపంలో ఉంటుంది. చాలా చోట్ల వివిధ రంగుల్లో శివలింగాలు ఉంటాయి. అలాగే శివలింగం పైన నీరు పారే లింగాలు ఉన్నాయి. స్వయంగా వెలిసిన లింగాన్ని స్వయంభు లింగమని, దేవతల చేత ప్రతిష్ఠింపబడిన లింగాన్ని దైవిక లింగం అని, ఋషుల చేస్తా ప్రతిష్ఠింపబడిన లింగాన్ని ఋషి లింగమని, మానవుల చేతే ప్రతిష్ఠింపబడిన లింగాలను మానవ లింగాలని పిలుస్తారు.అలా మానవుల చేత నిర్మితమైన ఒక అద్భుతమైన శివలింగం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for siva lingam

కేరళలో దేశంలోనే అతిఎత్తైన శివలింగం కొలువుదీరింది.111.2 అడుగుల ఎత్తు.. ! 8 అంతస్తుల మహా లింగం ఇది. తిరువనంతపురం జిల్లా చెంకాల్‌లోని మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయాన్ని శివలింగం ఆకారంలో నిర్మించారు. ఇటీవలే నిర్మాణం పూర్తై భక్తులకు దర్శనమిస్తోంది. జనవరి 10న లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించి శివలింగం ఎత్తునుకొలిచారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం టాలెస్ట్ శివలింగంగా రికార్డ్ క్రియేట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. స్థూపాకారంలో 8 అంతస్తుల్లో శివలింగాన్ని నిర్మించారు. అందులో ఆరు అంతస్తులు మానవదేహంలోని ఆరు శక్తి కేంద్రాలను సూచిస్తాయి. దూరం నుంచి చూస్తే పదంస్తుల భవనంలా కనిపిస్తుంది.గ్రౌండ్ ఫ్లోర్‌లో 108 శివలింగాలను ఏర్పాటు చేశారు. వీటికి భక్తులు అభిషేకాలు చేయవచ్చు. ఆలయం ప్రాంగణంలో అద్భుతమైన కళాచిత్రాలను పొందుపరిచారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శివలింగం టాప్ ఫ్లోర్‌లో కైలాస పర్వతం నమూనాను ఏర్పాటు చేశారు. హిమాలయ పర్వతాల్లో కొలువైన ఉన్న శివపార్వతులను అక్కడ దర్శించుకోవచ్చు.వారణాసి, బద్రినాథ్, గంగోత్రి, గోముఖ్, రామేశ్వరం, ధనుష్‌కోటి సహా పలు హిందూ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాన్ని శివలింగ నిర్మాణంలో వినియోగించారు. అందుకే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే దేశంలోని శైవక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నట్లేనని ఆలయ పూజారులు తెలిపారు.2012లో ప్రారంభమైన శివలింగ నిర్మాణం ఆరేళ్ల పాటు సాగింది. దేశంలోని ప్రఖ్యాత శివాలయాలను సందర్శించిన అనంతరం శ్రీ మహేశ్వరానంద సరస్వతి ఈ శివలింగాన్ని డిజైన్ చేశారు.దేశంతో అత్యంత ఎత్తైన శివలింగం రికార్డు ఇంతకుముందు కర్నాటకలోని కోలార్ జిల్లా కోటిలింగా దేవాలయం పేరిట ఉంది. అక్కడ 108 అడుగుల శివలింగం కొలువై ఉంది. ఆ రికార్డును తిరువనంతపురంలోని ఈ మహాశివలింగం అధిగమించింది.మరి ఈ శివలింగం గురించి దాని ప్రత్యేకతలు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.