ఈ ఆలయంలోకి వెళ్లిన వారే కాని.. తిరిగి వచ్చిన వారు లేరు.. ఇంతకీ ఎక్కడ?

421

ప్రపంచములో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటిని చూసి రావాలంటే ఈ జన్మ చాలదు. మనకు తెలియని విషయాలు, వింతలు వీటిచుట్టూ అప్పటికీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. కాలానుగుణంగా ఈ దేవాలయాలు కొంత కాలం స్తబ్దుగానే ఉన్నా సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకి వస్తున్నాయి.ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.అయితే ఇప్పుడు నేను చెప్పబోయే గుడికి మాత్రం వింతైన ప్రత్యేకత ఉంది.అదేమిటి అంటే..ఈ గుడిలోపలికి వెళ్ళినవారు తిరిగిరారంట. మరి ఆ గుడి గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింది వీడియో చూడండి

చుట్టూ పాల సముద్రాన్ని తలపించే మంచు కొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు, కళ్లు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం.. జమ్ముకశ్మీర్‌లోని 22 జిల్లాల్లో ఒక జిల్లా అయిన రిసీ జిల్లాలో శివఖోరి అనే ఓ శివాలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి చాలానే చరిత్ర ఉంది. నిజానికి ఇది ఆలయం అన్న పేరే కాని అసలు అలా కనిపించదు. గుహలా ఉంటుంది. ఈ గుహలోనే పరమశివుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. దాదాపు 200 మీటర్ల పొడవుండే ఈ గుహలోని శివలింగం స్వయంగా రూపుదిద్దుకున్న లింగం అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఆలయ పైభాగం నుండి వచ్చే నీరు నేరుగా శివలింగం పై నిత్యం పడుతూనే ఉంటుంది.ఆలయంలో ఎప్పుడూ రెండు పావురాలు ఉంటాయని, అవి పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయని అంటారు. ఆలయ పైభాగంపై పాముల ఆకారాలు ఉంటాయి. చుట్టూ పార్వతి, వినాయకుల ఆకారాలు కూడా కనిపిస్తాయి.

Related image

ఇక ఈ గుహ నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గం కూడా ఉంది. ఇంతకు ముందు ఒకసారి శివ భక్తులుగా పిలువబడే అఘోరాలు, సాధువులు ఈ మార్గం గుండానే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారట. అయితే అలా వెళ్లిన వారెవరూ అక్కడికి చేరుకోపోగా, తిరిగి రానుకూడా లేదు. వారు ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గుహలోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. కేవలం మహాశివరాత్రికి మూడు రోజుల ముందు మాత్రమే శివఖోరి ఆలయాన్ని తెరుస్తారు. మంచు కొండల నడుమ ఉన్న ఈ ఆలయాన్ని బయట నుంచి చూసేవారే కానీ లోపలికి అడుగుపెట్టాలంటే భయపడుతుంటారు భక్తులు. సృష్టిలో ఎన్నో చిత్రాలు, మరెన్నో వింతలు. అందులో శివఖోరి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి 50 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ 2000 నుండి మాత్రమే భక్తులకు తెలిసింది.విన్నారుగా ఈ గుడికి ఉన్న ప్రత్యేకత. మరి ఈ శివఖోరి ఆలయం గురించి దాని ప్రత్యేకతలు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.