ఈ గుడిని దెయ్యాలు నిర్మించాయి ఎలాగో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

678

మ‌న‌కు దేవుళ్ల‌పై ఎంత న‌మ్మ‌కం ఉంటుందో దెయ్యాల‌పై కూడా అంతే న‌మ్మ‌కం ఉంటుంది… భూతాలు ప్రేతాల‌ను న‌మ్మేవారు కొంద‌రు అయితే ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసే వారుకొంద‌రు ఉన్నారు.. సైన్స్ ప‌రుగులు పెడుతున్న వేళ ఇలా భూతాలు దెయ్యాలు అని స‌మాజం వెన‌క్కి వ‌చ్చేలా చేస్తున్నారు అని హేతువాదులు అయితే మండిప‌డుతూ ఉంటారు.కొన్ని వేల ఏళ్ల నుంచి మ‌నం దేవునికి పూజ‌లు చేస్తూ, దేవుడు ఉన్నాడు అని న‌మ్ముతూ ఉంటాం… స‌నాత‌న ధ‌ర్మం ప్ర‌కారం మ‌న దేశంలో అనేక దేవాల‌యాలు మునులు రాజులు భ‌క్తుల చేత నిర్మించ‌బ‌డ్డాయి… ఇలా అనేక దేవాల‌యాల్లోని దేవుళ్లు పూజ‌లు అందుకుంటున్నారు.. ఇక మ‌నం ఇలాంటి దేవాల‌యాల గురించి మాత్ర‌మే విన్నాం.. ఇప్పుడు విన‌బోయే దేవాల‌యం చాలా విచిత్ర‌మైన‌ది దీని గురించి తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు..

Image result for temple

నిజ‌మే ఈ ఆల‌యం నిర్మించింది భ‌క్తులు, రాజులు, దేవుళ్లు కాదు… ఈ ఆల‌యాన్ని దెయ్యాలు నిర్మించాయి.. విన‌డానినకి ఆశ్చ‌ర్యంగా ఉందా ఆస్టోరీ ఏమిటో తెలుసుకుందాం.. క‌ర్నాట‌క‌లోని దొడ్డ‌బ‌లాపురం – దేవ‌న‌హ‌ల్లి అనే రెండు న‌గ‌రాల మధ్య బొమ్మ‌వ‌రే అనే గ్రామం ఉంది.. ఇక్క‌డ సుంద‌రేశ్వ‌ర శివాల‌యం ఉంది.. ఈ ఆల‌యాన్ని కొన్ని సంవ‌త్స‌రాల క్రితం దెయ్యాలు నిర్మించాయట‌..బొమ్మ‌వ‌రే గ్రామ‌స్తులు చెప్పేదాని ప్రకారం ఆరు వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం ఈ గ్రామంలో దెయ్యాల బాధ ఎక్కువ‌గా ఉండేద‌ట.. ఇక్క‌డ‌వారిని అనేక‌ర‌కాలుగా హింసించి పారిపోయేలా చేసేవ‌ని చెబుతున్నారు గ్రామ‌స్తులు.

Image result for temple

ఆ స‌మ‌యంలో గ్రామంలో బుచ్చ‌య్య అనే వ్య‌క్తి మంత్ర విధ్య‌లు నేర్చుకుని మాంత్రికుడిగా మారాడ‌ట‌.. ఇక మాంత్రికుడిగా ఉన్న అత‌ను శివ‌య్య భ‌క్తుడు.. శివునిపై ఉన్న న‌మ్మ‌కం భ‌క్తితో ఆ ఊరివారి స‌హ‌కారంతో గ్రామంలో ఓ శివాల‌యం నిర్మించాడు.. కాని ఇలా గ్రామంలోగుడ్డిక‌ట్ట‌డం ఇష్టంలేని దెయ్యాలు, రాత్రికి రాత్రి ఈ గుడిని కూల్చేశాయి.. దీంతో కోపంతో బుచ్చ‌య్య కొన్నిరోజులు దీక్ష‌గా మాంత్రిక విధ్య‌ల‌తో ఆ దెయ్యాల‌ను అన్నింటిని త‌న మంత్ర‌శ‌క్తితో బంధించాడ‌ట‌.. ఈ స‌మ‌యంలో ఆ దెయ్యాలు త‌మ‌ని విడిచిపెట్టాల‌ని కోర‌గా, రెండు ష‌ర‌తులు పెట్టాడ‌ట బుచ్చ‌య.ఏ దేవాల‌యాన్ని మీరు కూల్చారో దానిని రాత్రికి రాత్రే నిర్మించాలి అలాగే ఈప్రాంతం విడిచి వెళ్లిపోవాలి అని దెయ్యాల‌కి ష‌ర‌తు పెట్టాడు… ఈ ష‌ర‌తుల‌కు ఒప్పుకున్న దెయ్యాలు గుడిని రాత్రికి రాత్రి నిర్మించాయి… ఇక్క‌డ దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి.. సాధార‌ణంగా ఆల‌యాల‌పై దేవుళ్ల బొమ్మ‌లు అంద‌మైన శిల్పాలు క‌నిపిస్తాయి.. కానీ ఈ శివాల‌యం పై దెయ్యాల బొమ్మ‌లు ఉంటాయి.. దెయ్యాలు క‌ట్టిన గుడికాబ‌ట్టి ఆ దెయ్యాల విగ్ర‌హాలు ఆల‌యం పై ఉన్నాయి అని న‌మ్ముతారు అక్క‌డ గ్రామ‌స్తులు.

ఇక ఇక్క‌డ దెయ్యాలు గుడి నిర్మించినా దేవుని విగ్ర‌హా ప్రతిష్ట జ‌ర‌గ‌లేదు. ఇక 50ఏళ్ల క్రితం ఓ చెరువుకి పూడిక తీస్తున్న స‌మ‌యంలో ఓ శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. ఇక వెంట‌నే ఆ శివ‌లింగాన్ని గుళ్లో ప్ర‌తిష్టించారు ఊరి గ్రామ‌స్దులు… ఇలాంటి దేవాల‌యం ప్ర‌పంచంలో ఎక్క‌డా లేదు అని అంటున్నారు, మాఊరికి ఈ దేవాల‌యం వల్ల పేరు కూడా వ‌చ్చింది అని చెబుతున్నారు ఊరి ప్ర‌జ‌లు.. సుమారు ఎనిమిది అడుగుల విగ్ర‌హాన్నిచూసేందుకు ఇక్క‌డ స్వామిని న‌మ్మి పూజ‌లు చేసేందుకు అనేక మంది రోజూ వ‌స్తూ ఉంటాయి….చూశారుగా ఈ దేవాల‌యం విశేషం ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

నేనే సీఎంల‌లో అంద‌రి కంటే సీనియ‌ర్