మంచం మీద ఈ వ‌స్తువులు పెడితే మీ ఇంట్లో నుంచి ల‌క్ష్మీదేవి వెళ్లిపోతుంది

1143

కొన్ని ప‌నులు మనం తెలిసి చేస్తూ ఉంటాం.. కొన్నిప‌నులు తెలియ‌క చేస్తూ ఉంటాం.. మ‌నం చేసే ప‌నిలో ఏదైనా త‌ప్పు ఉంటే వెంట‌నే దానిని స‌రిచేస్తారు మ‌న పెద్ద‌లు.. అందుకే మ‌న పెద్ద‌లు చెప్పిన విధంగా మ‌నం అనేక జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఉంటాం. ఇక మ‌నం ఎవ‌రి ఇంటికి అయినా వెళ్లిన స‌మ‌యంలో వారి ఇంటిలో ఉన్న మంచం పై కూర్చొము.. అది అనాధిగా వ‌స్తున్న ప‌ట్టింపు ఆచారం అని చెప్ప‌వ‌చ్చు.. కుర్చిలో లేదా దివాన్స్ సోఫాలపై మాత్ర‌మే కూర్చుంటాం.. ఇలా అవ‌తలి వారు మ‌న‌కు ఎంత బంధువులు అయినా మంచం పై కూర్చోకూడ‌దు అంటారు పెద్ద‌లు.

అయితే మ‌నం ఇంట్లో మంచానికి ఇంత వాల్యు ఇస్తాం.. మ‌రి ఇలాంటి మంచం పై కొన్ని వ‌స్తువులు పెడితే ఇంట్లో అశాంతి దుఃఖం క‌లుగుతుందట‌..కొ్న్ని పెట్ట‌కూడ‌ద‌ని వ‌స్తువులు పెడితే ల‌క్ష్మీదేవికి కోపం వ‌చ్చి ఇంట్లో బంగారం ఆస్తి లేకుండా వెళ్లిపోతుంద‌ట‌..మ‌రి మంచం పై ఎటువంటి వ‌స్తువులు పెట్ట‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం ఎట్టి ప‌రిస్దితుల్లోనూ మంచం పై పెట్ట‌కూడ‌దు.. అలాగే బంగారం దాచే బాక్సులు లాక‌ర్లు కూడా మంచం పై పెట్ట‌కూడ‌దు .. ఇక ఖ‌రీదైన‌ వ‌జ్రాల ఆభ‌ర‌ణాలు, ముత్యాలు, కెంపులు, వెండి అస‌లు మంచం పై పెట్ట‌కూడ‌దు… ఇక దేవుని విగ్ర‌హాలు ఏ లోహంతో త‌యారు చేసినా మంచం పై పెట్ట‌కూడ‌దు. అలాగే గ‌వ్వ‌లు ప‌చ్చ‌లు అస‌లు పెట్ట‌కూడ‌దు… ఇక రుద్రాక్ష‌లు కూడా మంచం పై పెట్ట‌కూడ‌దు అని తెలుసుకోండి.. మ‌నం పూజలు చేసే స‌మ‌యంలో వాడే ప‌సుపు కుంకుమ గంధం క‌ర్పూరం ఎట్టిప‌రిస్దితుల్లో మంచం పై పెట్ట‌కూడ‌దు.. అలాగే దేవుని ప‌టాల‌ను కూడా మంచం పై ఎట్టి ప‌రిస్తితుల్లోనూ పెట్ట‌కూడ‌దు..

మ‌న‌కు తెలిసి త‌ప్పు చేసిన వాళ్ల‌ము అవుతాము. ఇక దిండుకింద రుద్రాక్ష‌లు వంటివి కూడా పెట్ట‌కూడ‌దు.. అలాగే దిండుకింద పెట్టి వాటిని నిద్రించ‌కూడ‌దు… పూజ కోసం తీసుకువ‌చ్చిన పూలు ప‌ళ్లు త‌మ‌ల‌పాకులు మంచం పై పెట్ట‌కూడ‌దు.. ఇక మంచం పై కూర్చుని ప్ర‌సాదం తిన‌కూడ‌దు… అలాగే భోజ‌నం కూడా మంచం పై చేయ‌కూడ‌దు.. చూశారుగా ఇలాంటి త‌ప్పులు మీరు చేయ‌కండి..ఈ జాగ్ర‌త్త‌లు పాటించి మంచి ఫ‌లితాలు పొందండి… ఈ వీడియోపై మీ కామెంట్ల ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి.