తిరుమలలో మరో తిరుగులేని మహా అద్భుతం: చూస్తే షేర్ చేయకుండా ఉండలేరు

396

తిరుమ‌ల శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆల‌యం. ఈ ఆల‌యం గురించి తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. దేశ‌వ్యాప్తంగానే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంత‌టి గుర్తింపు పొందింది ఈ ఆల‌యం. ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య రోజూ వేల‌ల్లో ఉంటుంది. ఇక ప్ర‌త్యేక పూజ‌లు, ఉత్స‌వాలు జ‌రిగిన‌ప్పుడు అయితే ఆ సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది.శ్రీవారిని దర్శించుకుని భక్తులు పులకించిపోతుంటారు.తిరుమల అద్భుతాలను నెలవు అని చెప్పుకోవాలి.స్వామివారి కృప ఉంటె అసాధ్యాలు సైతం సుసాధ్యాలు అని ఎన్నోసార్లు నిరూపితం అయ్యింది.ఇప్పుడు అలాంటి నమ్మలేని అద్భుతం చోటుచేసుకుంది.మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for tirumala tirupati

కర్ణాటకకు చెందిన చిన్నప్ప రాజమ్మ దంపతులు తమ కొడుకుతో కలిసి స్వామిదర్శనం కోసం వచ్చారు. కొడుకుకు మతిస్థిమితం లేకపోవడంతో ఎవరు అతనికి పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.అతనికి చిన్నప్పటినుంచి మతిస్థిమితం లేదు. అందరిలా కాకుండా 25 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడిలాగానే ప్రవర్తించేవాడు.ఎంతోమంది డాక్టర్స్ ప్రయత్నించినా అతని మానసిక వైకల్యాన్ని నయం చేయలేకపోయారు. అమ్మానాన్న అని కూడా పిలవలేని స్థితిలో అతను ఉన్నాడు. వీళ్ళు ప్రతి ఏడాది తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈసారి కూడా స్వామివారి దర్శనం చేసుకుందామని ముక్కోటి ఏకాదశి రోజున వచ్చాడు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడి వెళ్లగా ఈ దంపతులు పిల్లాడు ఉత్తర ద్వారం వరకు వెళ్ళగానే ఎవరు తెరవకముందే దాని అంతటా అదే తెరుచుకుంది.సడెన్ గా ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో పెద్ద వెలుగు వచ్చింది. అలా ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం వీళ్లకు దక్కింది. వెంటనే ఆ ఉత్తర ద్వారం మూసుకుపోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే అప్పటివరకు పిచ్చి పిచ్చి చేష్టలు చేసే అతను కుప్పకూలిపోయాడు.ఉత్తర ద్వారం మూసుకుపోయిన వెంటనే అతను మేల్కొని వాళ్ళ అమ్మానాన్నలను గుర్తుపట్టి నోరారా అమ్మానాన్న అని పిలిచాడు. కొడుకు ఇలా పిలవడం చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆ దేవుడే దీనికి కారణమని ఆ తల్లిదండ్రులు కొడుకుతో కలిసి వెళ్లిపోయారు.ఈ ఘటన ఆ నోటా ఈ నోటా పడి తిరుమల మొత్తం పాకిపోయింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తిరుమలలో జరిగిన ఈ అద్భుత ఘటన గురించి అలాగే ఇలాంటి ఎన్నో అద్భుత ఘటనలకు కేంద్రంగా మరీనా తిరుమల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.