సాక్ష్యాత్తు దేవుడే స్వయంగా దొంగని పోలీసులకు పట్టించాడు.. ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు

525

దేవుడు ఉన్నాడా లేడా..ఈ ప్రశ్న ఎంతోమందికి ఉంటుంది.ఉన్నాడని కొందరు లేడు అని కొందరు అంటారు.ఎవరి నమ్మకాలను బట్టి వారి ఆలోచన ఉంటుంది.అయితే ఎక్కువమంది ఉన్నాడనే అంటారు.దానికి సాక్షాలుగా ఎన్నో ఆధారాలను ఎన్నో విషయాలను కూడా వారు చెబుతారు.ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పడానికి మరొక ఆధారం దొరికింది.దేవాలయంలో దొంగతనం చేసిన ఒక దొంగను దేవుడే పట్టించాడు.నన్ను దేవుడే పట్టించాడు అని ఆ దొంగే చెబుతున్నాడు.దేవుడు ఎలా పట్టించాడు అని అనుకుంటున్నారా..పూర్తీగా చెబుతా వినండి.

Image result for సింహాచలం అప్పన్న ఆలయం

అది సింహాచలం అప్పన్న ఆలయం.ఇది అతి పురాతనమైన ఆలయం.ఈ ఆలయానికి ఉత్తరాంద్ర నుంచే కాకుండా ఒడిస్సా రాష్టం నుంచి కూడా భక్తులు అధికంగా వస్తుంటారు.ఆలయంలో భక్తులు కోరికలు తీర్చమని తలనీలాలు సమర్పిస్తారు.ఇక భక్తులు ఇచ్చిన తలనీలాలను వేలం పాట ద్వారా ప్రతి ఏడాది అమ్మేస్తుంటారు.వాటి ద్వారా ఆ ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది.అయితే వీటిలో ఉన్న ఏడూ లక్షల విలువైన తలనీలాలను ఒక వ్యక్తి ఏడాది క్రితం దొంగతనం చేశాడు.అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది.ఈ వ్యవహారంలో దేవస్థానం వారి పాత్ర ఉందని పెద్దల పాత్ర ఉందని రకరకాల ఊహాగానాలు వచ్చాయి.ఇక దీనిపై పోలీసులు కేసు నమోద్ చేశారు.కేశకండన శాలలో సిసి పుటేజిని పరిశీలించారు.ఎటువంటి ఆధారాలు లభించలేదు.

Image result for సింహాచలం అప్పన్న ఆలయం

దీంతో పోలీసులు కూడా కేసును పక్కన పెట్టేశారు.కేసు అలా పెండింగ్ లో ఉంది.అయితే పోలీసులకు అనూహ్యంగా ఒక ఏడాది తర్వాత ఒక ఫోన్ వచ్చింది.సింహాద్రి అప్పన్న ఆలయంలో తలనీలాలు చోరీ జరిగింది కదా.ఆ దొంగతనం చేసింది నేనే అని ఆ దొంగ ఫోన్ చేసి మరీ చెప్పాడు.అయితే ఇది విని పోలీసులు షాక్ అయ్యారు.ఒక దొంగ తనంతట తానే దొంగతనం చేశాడని ఒప్పుకోవడం ఏమిటి ఆశ్చర్యపోయారు.ఎక్కడ ఉన్నావంటూ అడిగారు.నేనే మీ దగ్గరకు వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.కొంత సమయానికి ఆ దొంగ వచ్చాడు.ఇంతకు ఎవరు నువ్వు ఏం చేశావు అని అడిగారు.అప్పుడు జరిగిందంతా చెప్పాడు ఆ వ్యక్తి.నా పేరు రాంబాబు.నేను నాలుగేళ్ల క్రితం క్రికెట్ బెట్టింగ్ లో చాలా కోల్పోయా.నేను వృత్తిరీత్యా తల నీలాల వ్యాపారం చేస్తా.ఈ వ్యాపారం నా తండ్రి నుంచి నాకు వచ్చింది.ఇదే నా కుటుంబం యొక్క జీవనాధారం.

Image result for సింహాచలం అప్పన్న ఆలయం

ప్రతి ఏడాది భద్రాచలం,కాణిపాకం,శ్రీశైలం సింహాచలం..ఇలా రకరకాల గుళ్ళలో తలనీలాలు కొని అమ్మేస్తుంటాను.అయితే డబ్బు ఒక్కసారిగా పోవడంతో నాకు దిక్కుతోచలేదు.అందుకే సింహాచలం అప్పన్న ఆలయంలో తలనీలాలను దొంగతనం చేశా అని చెప్పాడు.తప్పు చేశాను కాబట్టి లొంగిపోతున్నా అని చెప్పాడు.అయితే నువ్వు రాకపోయి ఉంటె నువ్వు ఎప్పటికి దొరికేవాడివి కాదు.ఇలా నీ అంతకు నువ్వు లొంగిపోవడానికి కారణం ఏమిటి అని పోలీసులు అడిగారు.అప్పుడు రాంబాబు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.సింహాద్రి అప్పన్న కలలో కనిపించి నిజం ఒప్పుకో అన్నాడంట.ఈ విషయాన్నీ ఒక్కసారి కలలో వచ్చి చెప్పలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రతిరోజు వచ్చి ఈ విషయం గురించి చెప్తున్నాడు.దేవుడు కలలో కనిపిస్తున్నాడని నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు.నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను అని చెప్పాడు.చివరికి నేను చేసింది తప్పు అని రాంబాబు పోలిసుల ముందు నిలబడ్డాడు.ఇది విని పోలీసులు కూడా షాక్ అయ్యారు.దేవుడు అన్నిసార్లు కలలో కనిపించి చెప్పాడంటే ఆ అప్పన్న స్వామీ ఎంత పవరో అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తలనీలాలు దొంగలించి సంవత్సరం తర్వాత లొంగిపోయిన ఆ దొంగ గురించి అలాగే లొంగిపోవడం వెనుక దేవుడి హస్తం ఉంది అని చెప్పిన విషయం గురించి అలాగే అప్పన్న స్వామీ పవర్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.