శివునికి పూజ చెయ్యడానికి వెళ్ళిన పూజారి తిరిగి రాలేదు.. ఏం జరిగిందో చూసేసరికి షాక్ లో భక్తులు

444

శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగంరూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు.నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటారు. అది అక్షరాలా నిజం. అయితే ఇప్పుడు ఒక శివపూజారి గుడిలోనే శివైక్యం అయినా ఘటన అందరిని భాదపెడుతుంది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

కత్తి పట్టినోడు ఆ కత్తికే బలైనట్లు నిత్యం దైవ స్మరణలో ఉండే పూజారి ఆ దేవుడి సన్నిధానంలోనే దేవుడి పాదాల చెంతనే తుది శ్వాస విడవటం దైవ సంకల్పం కాకపోతే ఏంటీ.. ఇలాంటి ఘటనే ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో జరిగింది. భీమేశ్వరంలోని పంచారామాల్లో ఒకటైన.. సోమేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు గుండెపోటుతో చనిపోయారు. ఆయన సోమేశ్వరాలయంలో పూజ చేస్తూనే శివలింగంపై కుప్పకూలారు. నిత్యం పూజించే శివుని ముందే శివైక్యం పొందారు. ఆయన గర్భగుడిలో శివలింగంపై పడి ప్రాణాలొదిలిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ప్రధాన అర్చకులకు గతంలోనూ ఓ అరుదైన ఘటన జరిగింది. 1986లో రాజమండ్రికి వచ్చిన వరదల సమయంలో ఆయన ర్యాలీ క్షేత్రంలో పూజారిగా ఉన్నారు. గోదావరికి వరదలు వచ్చాయి.ఆ సమయంలో గట్టున ఉన్న అమ్మవారి గుడిలో ఉన్నారు. వరదలకు భయపడి అందరూ ముందుగానే వెళ్లిపోయారు. అయితే దుర్గమ్మకు హారతి, నైవేధ్యం పెట్టే సమయం అయ్యిందని.. అమ్మవారికి తీర్థప్రసాదం ఇచ్చే వస్తానని చెప్పి గుడిలోనే ఉండిపోయారు. ఈలోపే గోదావరి ఉప్పొంగింది. గుడి మొత్తం నీళ్లలో మునిగింది. అమ్మవారి విగ్రహం కొట్టుకుపోయింది. అమ్మవారినే పట్టుకుని ఉన్న పూజారి.. వరదల్లో కొట్టుకుపోతూ ఓ చెట్టు దగ్గర ఆగిపోయారు. అలాగే రెండు రోజులు ఉన్నారు. ఆ తర్వాత సహాయ సిబ్బంది ఆయన్ను కాపాడారు. అంతా ఈశ్వరుడి లీల అని చెబుతారు. అంతలా స్వామి సేవలో తరించారు కాబట్టే.. తన చివరి శ్వాస కూడా శివ లింగంపైనే విడవటం జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు.. మరి శివుడి గుడిలోనే శివైక్యం అయినా ఈ పూజారి ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.