పూజారి నెత్తి నోరు బాదుకున్న వినకుండా గుడి లోపలికి వెళ్ళారు.. ఆ తర్వాత?

572

వారణాసి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్న విషయం తెలిసిందే. ఈ క్షేత్రం అత్యంత శక్తి కలిగిన పట్టణం. అందువల్లే జల ప్రళయం కూడ ఈ పట్టణాన్ని ఏమి చేయలేదని తెలుస్తుంది. ప్రపంచంలోనే లక్షల కోట్ల సంత్సరాల నుంచి మానవ మనుగడ ఉన్న ప్రాంతంగా వారణాసికి పేరుంది.. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటు వంటి దేవతలే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఒక అమ్మవారి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.ఆమె శక్తి మహిమ గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.మరి ఆ అమ్మవారి గురించి తెలుసుకుందామా.

Image result for varanasi temple

వారణాసిలో ఉన్న శక్తివంతమైన అమ్మవార్లలో వారాహి అమ్మవారు ఒకరు.ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది.శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి ఎలా ఉద్భవించారు.అదే విధంగా వరాహ స్వామి నుంచి వారాహి ఉద్భవించిందని చెబుతారు. ఈమె వరాహ రూపంలో ఉండి చేతిలో చక్రం, ఖడ్గంతో ఉంటుంది.ఈ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది.ఈ ఆలయం ఓ భూ గృహంలో ఉంటుంది.ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలు పడదు.ఉదయం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది.Image result for varanasi templeఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్లిన తర్వాత నేల పై రెండు కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది.ఒక రధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు.అయితే ఇటీవల కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టు బట్టారు. లేదంటే సుప్రీం కోర్టుకు వెలుతామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు.వారు భూ గృహంలో కి వెళ్లి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చబోయారు.

Image result for varanasi templeఆ తర్వాత పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూ గృహంలోనుంచి బయటకు తీసుకువచ్చేశాడు.ఆ తర్వాత దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు.ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్ర కళ, లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది.ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువ సేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్చబోయారు. ఆ ఉగ్ర కళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు.మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అందువల్లే తెల్లవారుజాము 4.30 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రం వరాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అదీ కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు.ఆ సమయంలో అంటే తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామ చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట. అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసి వేసి ఉంటారని చెప్పారు.మరి ఈ అమ్మవారి గురించి మీరేమంటారు.ఈ వారాహి అమ్మవారి గురించి అలాగే ఈ అమ్మవారికి ఉన్న శక్తి గురించి అలాగే ఇలాంటి ఇంకా ఎన్నో అమ్మవార్ల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.