తిరుమల కొత్త రూల్స్ ఇక పై ఈ వస్తువులను తీసుకెళ్లకూడదు

1672

తిరుమల వీఐపీ దర్శనాలు రద్దయ్యాయి.. అందరూ సాధారణ భక్తుల మాదిరిగానే స్వామి దర్శనం చేసుకోవాలి అనే రూల్ తీసుకువచ్చారు, ఎల్ 1, ఎల్2, ఎల్ 3 దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు తిరుమల అధికారులు. ఇక ఇదే కాదు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది తిరుమత తిరుపతి దేవస్ధానం. తాజాగా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త అందించింది. జూలై 23న వృద్ధులు, దివ్యాంగులకు, జూలై 24న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో శని, ఆదివారాలు కాకుండా, ప్రత్యేక తిథులు కాకుండా వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా జూలై 23వ తేదీ మంగళవారం వయోవృద్ధులు 65 సంవత్సరాలు పైబడినవారు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

Image result for thirumala

అలాగే తిరుమలలో టిటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకూడదు అని చెబుతూనే ఉంది. అలిపిరి శ్రీవారి మెట్టు ప్రాంతాల్లో అనేకసార్లు తినిఖీల్లో చాలా మంది కొన్ని నిషేదిత వస్తువులు తీసుకువెళుతూ పట్టుబడ్డారు. దీంతో కఠిన నిర్ణయాలు అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం కానీ, వినియోగించడం కానీ చేయరాదని టిటిడి భక్తులను కోరుతోంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్త్రతంగా ప్రచారం చేపడుతోంది.

ఈ క్రింద వీడియోని చూడండి

నిషేధిత వస్తువుల్లో మత్తుపానీయాలు, పొగాకు ఉత్పత్తులు, మాంసం, ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉన్నాయి. తిరుమలలో జూదం ఆడడంతోపాటు పెంపుడు జంతువులను, పక్షులను ఉంచుకోవడం చేయరాదు.లైసెన్సు గల ఆయుధాలు ఉన్న పక్షంలో సమీప పోలీస్ స్టేషన్లో వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అప్పగించాల్సి ఉంటుంది. నిషేధిత వస్తువులను కలిగి ఉన్న పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని టిటిడి భక్తులను కోరుతోంది. మరి టిటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పై మీరేమంటారు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.