ద‌ట్ట‌మైన అడ‌విలో స‌ర్ప‌రూపంలో అమ్మ‌వారు క‌ళ్లారా చూస్తున్న‌భ‌క్తులు

862

ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో జ‌ల‌జ‌లా పారే సేల‌యేళ్ల మ‌ధ్య గుబ్బ‌లు గుబ్బ‌లుగా ఓ అమ్మ‌వారు వెల‌సింది.. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో గిరిజ‌నులు ఆదివాసీయులు త‌మ దైవంగా ఆ అమ్మ‌వారిని కొలుస్తారు. ఆ త‌ల్లిపేరు గుబ్బ‌ల మంగ‌మ్మ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రిజిల్లాలో జంగారెడ్డి గూడెం ప్రాంతంలో, బుట్టాయిగూడెం ద‌గ్గ‌ర కామ‌వ‌రం అడ‌వుల్లో ఈ అమ్మ‌వారు వెలిశారు.. ఈ దేవాల‌యం గురించి అక్క‌డ విశిష్ట‌త‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ అడ‌వుల్లో కొండ‌ల మ‌ధ్య సెల‌యేరు పారే ప్రాంతంలో గుహ‌లో ఆమె వెల‌సింది… సుమారు 50 ఏళ్ల క్రితం ఆమె ఈప్రాంతంలో వెలిసినా, 40 ఏళ్ల నుంచి ఆమెను అడ‌వి జాతి వారు కొలుస్తున్నారు.. ఆమె మ‌హిమ‌ల‌కు భక్తుల కోరిక‌లు తీర‌డంతో ఆమెను ద‌ర్శించుకునేందుకు ఏపీ తెలంగాణ ప్ర‌జ‌లే కాకుండా ఇతర రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా ఇక్క‌డ‌కు పెద్ద సంఖ్య‌లో వ‌స్తారు..వారి కోరిక‌లు తీరిన త‌ర్వాత ఇక్క‌డ మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం, మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తారు.

Image result for ammavaru pics inforest

ఆమె కొలువై ఉన్న భాగంలో సెల‌యేటి నుంచి నీరు నిరంత‌రం వ‌స్తూనే ఉంటుంది.. అమ్మ‌వారిని ద‌ర్శించుకోవాలి అంటే మోకాలి లోతు నీటిలో దిగి అమ్మ‌వారిని ద‌ర్శించుకోవాలి.. ఇప్ప‌టికే ఈ ఆ నీరు ఎక్క‌డ నుంచి వ‌స్తుంది అనేది చాలా మందికి తెలియ‌దు… అయినా త‌డిచి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు..ఆమెను చూస్తే స‌ర్ప జాతి ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంది అనిపిస్తుంది.. ఇక్క‌డ అమ్మ‌వారు స‌ర్ప‌రూపంలో తిరుగుతూ ఉంటారు అని ఆమె స్వ‌యంభూతంగా వెలిశార‌ని భ‌క్తులు చెబుతారు.. అందుకే ఇక్క‌డ స‌ర్పాలు క‌నిపించినా వాటికి హానిత‌ల‌పెట్టరు… భ‌క్తుల కోర్కెలు తీర‌డంతో ఎంతో మంది ఇక్క‌డ‌కు వ‌చ్చి అమ్మ‌వారి మొక్కులు తీర్చుకుంటారు.

Image result for ammavaru pics inforest

అస‌లు అమ్మ‌వారు ఇక్క‌డ వెల‌శారు అని ముందుగా తెలుసుకుంది క‌రాటం కృష్ణ‌మూర్తి… ఆయ‌న‌కు అమ్మ‌వారి గురించి ఎలా తెలిసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్ల క్రితం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భూస్వామి గుబ్బ‌ల మంగ‌మ్మ కొలువై ఉన్న అడ‌విలో వెదురు గ‌డ‌లు తీసుకుని ఎద్దుల బండి పై ఇంటికి వెళుతున్నాడు.. ఆ స‌మ‌యంలో ఎద్దులు కొంత దూరం వ‌చ్చిన త‌ర్వాత ముందుకు క‌ద‌ల‌లేదు ఎంత ప్ర‌య‌త్నించినా ఎద్దులు ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డంతో ఆ వెదురులు అలా ప‌క్క‌న పెట్టేసి ఎద్దులను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు..

Related image

ఇలా ఇంటికి చేరిన కృష్ణ‌మూర్తికి రాత్రి క‌ల వచ్చింది.. ఆక‌ల‌లో గుబ్బ‌ల‌మంగ‌మ్మ ప్ర‌త్య‌క్ష‌మై ఎద్దులు బండి ఆగిన ప్రాంతానికి కాస్త ముందుకు వెళితే సెల‌యేటి కింద గుహ ఉంటుంది.. ఆ గుహ‌లో తాను ఉన్నాను అని చెప్పింది.. త‌న‌ను వ‌చ్చి ద‌ర్శించుకుని ఇక్క‌డ గ్రామస్తుల‌కి అన్న‌దానం చేయ‌మ‌ని చెప్పి, ఆమె మాయ‌మైంది.. అలాగే కృష్ణ‌మూర్తి త‌ర్వాత రోజు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు.. అక్క‌డ అమ్మ‌వారు చెప్ప‌న విధంగా కొలువై ఉన్నారు.. దీంతో చుట్టు ప‌క్క‌ల వారికి ఈ విష‌యం చెప్పి అన్న‌ధానం చేసి అమ్మ‌వారికి పూజ‌లు చేయ‌డం ఆరంభించారు.. అలా గిరిపుత్రుల‌కు ఆమె కొలువైన అమ్మ‌వారుగా పూజ‌లు అందుకుంటోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్క‌డ ఓ గానుగ చెట్టు ఉంటుంది… ఇక్క‌డ అమ్మ‌వారికి పూజ‌లు చేస్తే సంతానం క‌లుగుతుంది అని చెబుతారు… పిల్ల‌లు లేని వారు ప‌సుపు కుంక‌మ ఎర్ర‌టి వ‌స్త్రంలో పెట్టి చెట్టు కొమ్మ‌కు క‌డ‌తారు.. ఇలా చేస్తే వారికి సంతానం క‌లుగుతుంది అని వారి న‌మ్మ‌కం .. ఇక మ‌రోక క‌థ కూడా చెబుతారు ఇక్క‌డ అమ్మ‌వారు ఎవ‌రి ఇంటిలో అయిన స‌మ‌స్య వస్తే వారి ఇంటికి ప‌దేళ్ల బాలిక రూపంలో వచ్చి వారి స‌మ‌స్య‌లు తీర్చుతార‌ట‌అలా అమ్మ‌వారు వారి కోరిక‌లు తీర్చి వారి క‌ష్టాలు తీరుస్తారు అని చెబుతూ ఉంటారు.. మ‌రి ఇంత గొప్ప దేవాల‌యాన్ని మీరు ద‌ర్శించి అమ్మ‌వారి కృప‌ని పొందండి . ఈ వీడియోపై మీ అభిప్రాయాన్నికామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.