ఈ ఆల‌యాల్లోకి పురుషులు వెళ్ల‌రు మ‌హిళ‌లు లోప‌ల ఏం చేస్తారో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

902

ఇటీవ‌ల కేర‌ళ‌లోని శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని…దీన్ని అడ్డుకోడానికి ఎవరికి అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆలయం తెరుచుకోవ‌డం, ప‌లువురు మ‌హిళ‌లు వెళ్లి తిరిగి వెన‌క్కి రావ‌డం వివాదాలు జ‌రిగిన‌ది తెలిసిందే.. కాని మ‌న దేశంలో కొన్ని చోట్ల అయితే మగవాళ్లు ప్రవేశించకుండా కొన్ని ఆల‌యాల‌లో నిబంధన‌లు ఉన్నాయి. అలా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా ఓ పీఠం ఉంది. ఇలాంటి ఆలయాలు ఏమిటి, అక్క‌డెందుకు ప్ర‌వేశం లేదు అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. చక్కులతుకవు దేవాలయం, కేరళ

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్నట్లే అదే కేరళలో మరో దేవాలయంలో పురుషులపై నిషేదం కూడా ఉంది. అలపుంజ లోని చక్కులతుకవు భగవతీ దేవాలయంలోకి పురుషుల్ని రానియ్యరు. ఏడాదికోసారి జరిగే నారీ పూజ సందర్భంగా కేవలం మహిళలనే అనుమతిస్తారు. అలాగే ధను అనే పేరుతో కూడా చక్కులతుకవు ఆలయంలో సంబరాలు జరుగుతాయి. ఆ సమయంలోనూ ఆడవారు పది రోజుల పాటూ ఉపవాసం చేసి అమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు. దీపాలు వెలిగించి పూజ‌చేసి అక్క‌డే ఉంటారు మ‌హిళ‌లు.

2. కొట్టన్‌కులన్‌గర దేవి ఆలయం, కేరళ
కేరళలోని మరో ఆలయంలో కూడా పురుషుల ప్రవేశంపై నిషేదం ఉంది. అదే కొట్టన్‌కులన్‌గర ఆలయం. ఆదిశక్తి మరియు దుర్గా భగవతి దేవిని పూజించే ఈ ఆలయంలో కొన్ని పండగల సమయంలో ఈ నిషేదం ఉంది. అయితే ఈ సమయంలో పురుషుల మహిళల వేషధారణలో ఆలయంలో ప్రవేశించి అమ్మవారిని పూజించవచ్చు.

3. కాళీ మాత దేవాలయం, బీహార్
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో కాళీ మాత ఆలయం ఉంది. ఈ దేవాలయంలో కూడా ప్రతీ మాసంలోని కొన్ని నిర్ధిష్ట సమయాల్లో మగవారు వెళ్లకూడదు. కనీసం పూజారులు కూడా ఆయా రోజుల్లో లోనికి వెళ్లరు. ఆ సమయంలో కేవలం మహిళలే అమ్మవారికి పూజలు చేస్తారు. మిగతా రోజుల్లో మాత్రం అందరూ అనుమతించబడతారు. కేవ‌లం అమ్మ‌వారి పూజా కుంకుమ తెచ్చి భ‌ర్త‌ల‌కు ఇంట్లో మ‌గ‌వారికి ఇస్తారు.

4. కామాఖ్య పీఠం, ఆంధ్ర ప్రదేశ్
ఉత్తర భారత దేశంలోని గౌహతి నగరంలోని కామాఖ్య ఆలయం మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలోని కామాఖ్య పీఠంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురుషులను ఆలయంలోకి అనుమతించరు. ప్రతి నెల అమ్మవారి నెలసరి వస్తుందని భక్తుల నమ్మకం. ఈ సమయంలో ఈ ఆలయంలోకి మగవారి ప్రవేశించకుండా నిషేదం విధించారు.ఆ స‌మ‌యంలో ఆడ‌వారు మాత్ర‌మే వెళ‌తారు దేవాల‌యంలోకి.

5. సావిత్రి ఆలయం, రాజస్థాన్
రాజస్థాన్ లోని రత్నగిరి పర్వత ప్రాంతంలోని సావిత్రి దేవాలయంలో కూడా మగవారి ఆలయ ప్రవేశం నిషేధం. బ్రహ్మదేవుడు తన భార్య సరస్వతీ దేవీని విడిచి సావిత్రి దేవిని రెండో పెళ్లి చేసుకోవడంతో చదువుల తల్లికి కోపం తెప్పించిందట. దీంతో సరస్వతి దేవి బ్రహ్నను శాపించిందని అందువల్లే ఈ ఆలయంలో మగవారి ప్రవేశంపై నిషేదం ఉందని చరిత్ర చెబుతోంది.

6. భగవతి మాత ఆలయం, తమిళనాడు
ఇక మగవారి ప్రవేశం నిషేధం వున్న ఆలయం తమిళనాడులో ఉంది. కన్యాకుమారిలోని భగవతీ మాతా ఆలయంలో మగవారు గుడి బయటే ఉండాలి. అయితే సన్యాసులకు మాత్రం ఆలయ ద్వారం వరకు అనుమతిస్తారు. ఆడవారు మాత్రం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకోవచ్చు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

7. అట్టుకల్ ఆలయం, కేరళ
తిరువనంతపురంలోని అట్టుకల్ ఆలయంలో కొలువైన కన్యకా దేవి అమ్మవారిని సంక్రాంతి సమయంలో దర్శించుకునే భాగ్యం పురుషులకు వుండదు. ఈ సమయంలో కేవలం మహిళలే అమ్మవారిని పూజించడం, దర్శించుకోవడం చేస్తారు. ఆ సమయంలో ఈ ఆలయ పరిసరాల్లో కూడా పురుషులు కనిపించరు. మ‌రి చూశారుగా ఈ దేవాల‌యాల్లోపురుషుల‌కు ద‌ర్శ‌నం లేదు అనేది. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి. ఇలాంటి దేవాల‌యాలు ఏమైనా మీకు తెలిసిన‌వి ఉంటే మీరు కామెంట్ల రూపంలో చెప్పండి.