బోనాల్లో రంగం చెప్పే స్వర్ణలత గురించి ఎవ‌రికి తెలియ‌ని షాకింగ్ విష‌యాలు

1432

బోనాల్లో రంగం స‌మ‌యంలో ప్ర‌తీ ఒక్కరూ కోట్లాదిమంది ఆమె మాట కోసం ఎదురుచూస్తూ ఉంటారు.. ఆమె ఎటువంటి ప‌లుకులు ప‌లుకుతుందా అని వినేందుకు ఆతృత చూపిస్తారు.. బోనాల స‌మ‌యంలో రంగం చెప్పే మాతంగి స్వ‌ర్ణ‌ల‌త గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుందాం…సికింద్రాబాద్‌ సమీపంలోని తుకారాంగేట్ ద‌గ్గ‌ర ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే అతి సామాన్య మహిళ ఆమె….నిరంతరం బతుకు పోరాటం చేస్తున్న ఆమెకీ ఒక రోజు ఉంది… ఆ రోజు కోసమే ల‌క్ష‌లాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు..ఏడాదికోసారి వినిపించే ఆమె మాటల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తారు.

Image result for swarnalatha rangam

హైదరాబాద్‌‌లో బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత రంగం వినిపించడం ఆనవాయితీ. దీన్ని భవిష్యవాణిగా భక్తులు విశ్వసిస్తారు….చిన్న తనంలోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో ఆమెకు కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో సందడిగా ఆ పెళ్లి జరిగిందట‌. ఆ తర్వాత ఆమె జీవితం మహంకాళి అమ్మ సేవకే అంకితమైంది. ఆమె పదోతరగతి వరకు చదువుకున్నారు… చిన్న‌త‌నం నుంచే నుంచే భవిష్యవాణి వినిపిస్తున్నారు స్వ‌ర్ణ‌ల‌త.ఆమెది ఏర్పుల’ వంశం. మొదట ఏర్పుల జోగమ్మతో ‘రంగం’ మొదలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. 1996 వరకూ ఆమె అక్క ఏర్పుల స్వరూపారాణి రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించారు….అక్కతో కలిసి నేనూ గుడికి వచ్చేదాన్ని. ఆమె వారసత్వంగానే 1997 నుంచి నేటి వరకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా అని ఆమె భ‌విష్య‌వాణి గురించి తెలియ‌చేశారు.

Image result for swarnalatha rangam

స్వ‌ర్ణ‌ల‌త తండ్రి నర్సింహ అమ్మవారి గుడి దగ్గర పంబజోడు వాయించేవారు. ఆమె త‌ల్లి ఇస్తారమ్మ గుడికొచ్చి జేగంట మోగించేది.. కొద్దిరోజుల‌కు ఆమె త‌ల్లితండ్రి చ‌నిపోయారు..ఇప్పుడు ఇంట్లో ఆమె ,పిన్ని, వదిన,ఆమె తమ్ముళ్లు ఉంటున్నారు… ఇక ఆమె క‌ష్టాలు కూడా చెప్పుకొచ్చారు.. ఈ స‌మాజంలో మాతంగి అంటే ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ముందుకు రారని. అతి కష్టం మీద ఒక చిన్న కిరాయి ఇంట్లో బతుకుతున్నాం అని చెప్పింది ఆమె.ఆమె అతి సాధారణ టైలర్‌….ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్పఆమె ఇళ్లు గ‌డ‌వ‌ని ప‌రిస్దితి.. . రవికెలు, ఇతర దుస్తులు కుడుతూ. నెలకు 1500 వ‌ర‌కూ సంపాదిస్తుంది…ఇక ఆమె తమ్ముడు దినేశ్ ఎలక్ట్రీషియన్ గా ప‌నిచేస్తున్నాడు. ఇక ఆమె రంగం చెప్పినందుకు గాను దేవస్థానం వారు, ప్ర‌తీ నెలా ఆమెకు మూడు వేల రూపాయ‌లు ఇస్తున్నారు… కొ్ది రోజుల క్రితం త‌మ‌కు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామన్నారు కానీ,అదింకా కార్యరూపం దాల్చలేదు అని చెప్పింది ఆమె… రంగం రోజున ప్రభుత్వం తరపున పసుపు కుంకుమ సారె ఇస్తారేమోనని ప్రతీ సంవత్సరం ఆశపడుతున్నా, కానీ తీరడం లేదు అని చెబుతోంది..

Image result for swarnalatha rangam

మా కుటుంబంలో పుట్టే ఆడబిడ్డలంతా అమ్మవారికే అంకితం. ఇప్పటివరకు మాతంగులైన వాళ్లంతా నాతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను మహంకాళికి సమర్పించుకున్నారు. మా తమ్ముడికి ఆడపిల్ల పుడితే, నా తరువాత ఆమే భవిష్యవాణి వినిపిస్తుంది అని ఆమె తెలియ‌చేశారు..ముందుగా రంగం చెప్పే వేదికను మా తమ్ముడు దినేశ్ అలంకరిస్తాడు. పచ్చికుండను భూమిలోకి పాతి, దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి నాకు ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. రంగం దగ్గరకు వస్తాను. ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటూ ఆమె భ‌విష్య‌వాణి గురించి తెలియ‌చేశారు….ఆమె సాధారణ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటారు. ఆ చివరి అంకంలో పదిహేను నిమిషాల పాటు భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె చెప్పే ముచ్చట కోసం వేల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ ఉజ్జ‌యినీ అమ్మ‌వారి దేవాల‌య చ‌రిత్ర తెలుసుకుంటే …రెండు వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయ నిర్మాత వారసులు మాట్లాడుతూ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. 1813లో సైన్యంలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సురిటి అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యాడు. ఆ సమయంలో జంటనగరాల్లో కలరా సోకి వేల మంది మరణించారు. అప్పుడు అప్పయ్య ఉజ్జయినీలో శ్రీ మహంకాళి దేవీని దర్శించి కలరా వ్యాధి నుంచి కాపాడితే, సికింద్రాబాద్‌లో విగ్రహ ప్రతిష్టచేయించి ఆలయం నిర్మిస్తామని కోరుకున్నాడు… 1815లో కలపతో అమ్మవారి విగ్రహన్ని చేయించి ప్రతిష్ఠచేశారు. చూశారుగా అలా అమ్మ‌వారు ఇక్క‌డ ప్ర‌తిష్టించ‌బ‌డ్డారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

పాక్ ఎన్నికల్లో గెలిచిన మొదటి హిందూ అభ్యర్ది ఇతనే..!