సూర్య‌దేవాల‌యంలో ఆదిత్యుడ్ని తాకిన సూర్య‌కిర‌ణాలు భ‌క్తులు ఆశ్చ‌ర్యం

326

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆంద్ర‌ప్ర‌ధేశ్ లోని సూర్య‌దేవాల‌యాల్లో ఎంతో విశిష్ట‌మైన దేవాల‌యం.. దేశంలో ఉన్న ప్రముఖ ఆల‌యాలలో దీనికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది.. ఇక ఈ దేవాల‌యంలో స్వామికి సూర్య‌కిర‌ణాలు తాక‌డం అనేది ఇక్క‌డ విశిష్ట‌త‌గా చెబుతారు గ‌ర్బ‌గుడిలోని స్వామిపాదాలను నేరుగా సూర్య‌కిర‌ణాలు తాకుతాయి. నేటి ఉద‌యం మూలవిరాట్టును సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి మేఘాలు అడ్డుపడటంతో భక్తులు ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే, క్షణాల వ్యవధిలోనే ముబ్బులు తొలగి స్వామివారి ముఖాన్ని కిరణాలు తాకడంతో భక్తులు తన్మయత్వం చెందారు.

Related image

ఇలా స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి అనేక మంది దూర ప్రాంతాల నుంచి వ‌స్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సూర్య‌కిర‌ణాలు తాకిన స‌మ‌యంలో స్వామిని ద‌ర్శించుకోవాలి అని చాలా మంది కోరుకుంటారు… ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి సూర్యుడు మారే సందర్భంలో కిరణస్పర్శ మూలవిరాట్టును తాకడం ఆనవాయితీగా వస్తోంది. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం క‌నిపిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రథసప్తమితోపాటు మార్చి 9, 10 తేదీలు, అలాగే అక్టోబరు 1, 2 తేదీల్లోనూ సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి. సోమవారం ఈ దృశ్యాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కనులారా వీక్షించారు. సూర్యకిరణాలు ఆలయంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తులు విశ్వసిస్తుంటారు. మన దేశంలోని సూర్యదేవాలయాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయం నిర్మించాడని, దీని పక్కనే ఉన్న కోనేరును ఇంద్ర పుష్కరిణి అని అంటారు. ఇక్క‌డ స్నానాలు చేసిస్వామిని ద‌ర్శించుకుంటారు. ఇక వేలాదిగా స్వామిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఇలాంటి విశేష‌మైన రోజుల్లో వ‌స్తారు… చూశారుగా స్వామి విశిష్ట‌త దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.